Match Referee
-
టీ20 వరల్డ్‌కప్‌కు అంపైర్లు వీరే.. భారత్ నుంచి ఇద్దరు
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా-వెస్టిండీస్‌లకు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 2 న చెన్నై వేదికగా అమెరికా-కెనడా మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీకోసం 20 మందితో కూడిన అంపైర్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది.ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్లో సభ్యత్వం పొందిన అంపైర్లు 16 మంది, ఎమర్జింగ్ ప్యానెల్‌లోని నలుగురు అంపైర్లు ఉన్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్‌కు చోటు దక్కింది. కాగా మదనగోపాల్‌కు ఐసీసీ ఈవెంట్లో అంపైరింగ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారి. అతడితో పాటు సామ్ నోగాజ్స్కీ, అల్లావుడియన్ పాలేకర్, రషీద్ రియాజ్, ఆసిఫ్ యాకూబ్‌లు సైతం తొలిసారి ఐసీసీ ఈవెంట్లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదే విధంగా 2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరోవైపు ఈ ప్రధాన టోర్నీ కోసం మ్యాచ్ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్‌లను మ్యాచ్ రిఫరీలగా ఐసీసీ నియమించింది. వరల్డ్‌కప్‌కు అంపైర్లు వీరే..క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్టన్ రుసెరే, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్. The ICC announced the group of officials for the first round of the T20 World Cup 2024 in the USA and West Indies. The squad includes 20 umpires and 6 match referees.#T20WorldCup2024 pic.twitter.com/lvH9P4trg1— CricTracker (@Cricketracker) May 3, 2024 -
విషాదం.. క్రికెట్ దిగ్గజం కన్నుమూత
దక్షిణాఫ్రికా క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మ్యాచ్ రిఫరి మైక్ ప్రోక్టర్ (77) కన్నుమూశారు. గుండె సర్జరీ అనంతరం వచ్చే సమస్యల కారణంగా ప్రోక్టర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెట్ తొలినాళ్లలో ప్రోక్టర్ గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున కేవలం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ప్రోక్టర్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఘనమైన రికార్డు కలిగి ఉన్నాడు. ప్రోక్టర్ 401 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 21936 పరుగులు, 1417 వికెట్లు పడగొట్టాడు. ప్రోక్టర్ ఖాతాలో 48 సెంచరీలు, 70 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ప్రోక్టర్ అంతర్జాతీయ కెరీర్లో ఆడిన ఏడు మ్యాచ్‌లు (1967-70 మధ్యలో) ఆస్ట్రేలియాతోనే ఆడాడు. ఇందులో 41 వికెట్లు పడగొట్టి, 25.1 సగటున 226 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ప్రోక్టర్ పేరిట ఆరు వరుస సెంచరీల రికార్డు ఉంది. 1970లో రొడేషియా తరఫున అతను ఈ ఫీట్ సాధించాడు. కౌంటీల్లో 13 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు గ్లోసెస్టర్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించిన ప్రోక్టర్.. 1971లో ఆ కౌంటీ తరఫున వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్‌పై నిషేధం విధించిన సిడ్నీ టెస్ట్‌కు ప్రోక్టర్ రిఫరిగా వ్యవహరించాడు. ప్రోక్టర్ రిఫరి విధుల నుంచి వైదొలిగిన అనంతరం జాతీయ జట్టు చీఫ్ సెలక్టర్‌గా కూడా వ్యవహరించాడు. -
మ్యాచ్ రిఫరీపై పంచ్‌ల వర్షం.. ఫుట్‌బాలర్‌పై 30 ఏళ్ల నిషేధం
క్రీడల్లో గొడవలు జరగడం సహజం. ఒక్కోసారి అది కొట్టుకునేంత స్థాయికి వెళుతుంది. మితిమీరినప్పుడు క్రమశిక్షణా చర్యల కింద ఆట నుంచి నిషేధించడం జరుగుతుంది. తాజాగా ఒక ఫ్రాన్స్ ఫుట్‌బాలర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మ్యాచ్ సందర్భంగా రిఫరీకి పంచుల వర్షం కురిపించాడన్న కారణంతో అతనిపై 30 ఏళ్ల నిషేధం విధించారు మ్యాచ్ నిర్వాహకులు. 25 ఏళ్ల వయసున్న ఫుట్‌బాలర్ పేరు ప్రస్తావించడానికి నిర్వాహకులు ఇష్టపడలేదు. అయితే ఆ ఆటగాడు ఫ్రాన్స్‌లోని ఎంటెంటే స్పోర్టివ్ గాటినైస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లోరిట్ ఫుట్‌బాల్ డ్రిస్టిక్ట్ ప్రెసిడెంట్ బెనోయిట్ లెయిన్ పేర్కొన్నారు. కాగా లోకల్ కప్‌లో భాగంగా జనవరి 8న జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుందన్నారు. మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవలో రిఫరీపై పిడిగుద్దులు కురిపించడంతో.. అతను రెండురోజుల బెడ్‌పై నుంచి లేవలేకపోయాడని తెలిపారు. ఘటన జరిగిన రోజే ఆటగాడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించి 30 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు పేర్కొన్నాడు. విచారణ తర్వాత పోలీసులకు అప్పజెప్పామన్నాడు. అంతేకాదు ఆటగాడి చర్యతో సదరు టీమ్‌ను రెండు సీజన్ల పాటు టోర్నీల్లో పాల్గొనకుండా బ్యాన్ చేసినట్లు బెనోయిట్ వెల్లడించాడు. చదవండి: 'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా' ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్‌కు మంత్రి పదవి -
ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి..
ఫుట్‌బాల్ ఆటలో రెడ్,యెల్లో కార్డ్‌లు జారీ చేయడం సాధారణంగా చూస్తుంటాం. గ్రౌండ్లో గొడవకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి చేస్తే రెడ్‌కార్డ్ జారీ చేస్తారు. రెడ్‌కార్డ్ జారీ చేస్తే మ్యాచ్ ముగిసేవరకు మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఇక వార్నింగ్ ఇచ్చి వదిలేయడానికి యెల్లోకార్డ్ జారీ చేయడం చూస్తుంటాం. ఈ రెండుకార్డులు కాకుండా మరొక కార్డు ఉంటుంది. అదే వైట్‌కార్డ్. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ కార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి వైట్‌కార్డ్ చూపించింది లేదు. తాజాగా మాత్రం మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ వైట్‌కార్డ్ చూపించడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. శనివారం పోర్చుగల్‌లో బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య మహిళల ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో కాసేపట్లో తొలి హాఫ్ ముగుస్తుందన్న దశలో స్టాండ్స్‌లో ఒక అభిమాని అనారోగ్యానికి గురయ్యాడు. ఇది గమనించిన రిఫరీ వైట్‌కార్డ్ చూపించాడు. క్రీడలో వైట్‌కార్డ్ అనేది క్రీడాస్పూర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. రిఫరీ వైట్‌కార్డ్ చూపెట్టగానే మెడికల్ సిబ్బంది సదరు అభిమానికి మెడికల్ ట్రీట్మెంట్ అందించారు. జరుగుతున్నది ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి ఇరుజట్ల మేనేజ్మెంట్కు క్రీడాస్పూర్తి చూపించాలనే ఇలా చేసినట్లు రిఫరీ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఇక పోర్చుగల్ సహా ఫుట్‌బాల్ అంతర దేశాలలో వైట్‌కార్డ్ జారీని ప్రవేశపెట్టారు. ఇటీవలే ఫుట్‌బాల్ అంతర్జాతీయ గవర్నింగ్ బాడీ ఆటగాడు గాయపడితే కంకషన్ ప్లేయర్(సబ్‌స్టిట్యూట్) వచ్చేందుకు వైట్‌కార్డ్ ఉపయోగించడం మొదలుపెట్టింది. అలాగే ఖతర్ 2022 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లోనూ వైట్‌కార్డ్‌ను ప్రవేశపెట్టినప్పటికి రిఫరీలు వాటిని ఉపయోగించలేదు. తాజాగా ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తొలిసారిగా వైట్‌కార్డ్ ఉపయోగించి రిఫరీ చరిత్ర సృష్టించాడు. As equipas médicas de Benfica e Sporting receberam cartão branco após assistirem uma pessoa que se sentiu mal na bancada 👏 pic.twitter.com/ihin0FAlJF — B24 (@B24PT) January 21, 2023 చదవండి: 'అలా అయితేనే టీమిండియాను కొట్టగలం'.. ఆసీస్‌కు సూచనలు 'పంత్ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు -
టాస్ కాయిన్ ఇవ్వడం మర్చిపోయిన శ్రీనాథ్.. వీడియో వైరల్
టీమిండియా-దక్షిణాఫ్రికా రెండో వన్డే సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌తో పాటు మ్యాచ్ ప్రెజెంటర్ సంజయ్ మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్లు మైదానం మధ్యలోకి వచ్చారు. ఈ క్రమంలో స్పిన్ చేయడానికి కాయిన్ ఎవరికి వచ్చిందిని మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్‌ను అడిగాడు. ఈ క్రమంలో ధావన్, కేశవ్ మహారాజ్ ఇద్దరూ ఒకరినొకరు అయోమయంగా చూసుకున్నారు. ఎందుకుంటే కాయిన్ వారిద్దరి ఎవరు దగ్గర లేదు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కాయిన్ కెప్టెన్లకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ధావన్ నవ్వుతూ శ్రీనాథ్‌కు కాయిన్ ఇవ్వమని అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🚨 Toss Update from Ranchi 🚨 South Africa have elected to bat against #TeamIndia in the second #INDvSA ODI. Follow the match ▶️ https://t.co/6pFItKiAHZ @mastercardindia pic.twitter.com/NKjxZRPH4e — BCCI (@BCCI) October 9, 2022 చదవండి: Tri Series NZ VS BAN: రాణించిన కాన్వే.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్ -
రిఫరీపై అమానుష దాడి.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత పురుషుల రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో అనుచిత ఘటన చోటు చేసుకుంది. బౌట్లో అప్పటిదాకా గెలుపు ధీమాతో ఉన్న సర్వీసెస్ రెజ్లర్ సతేందర్ మలిక్ ఫలితం బౌట్ వెలుపలి జోక్యంతో మారింది. ప్రత్యర్థికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చిన విధానంపై రిఫరీ జగ్బీర్ సింగ్‌ను సతేందర్ ప్రశ్నించాడు. ఇది సహించలేని రిఫరీ జగ్బీర్ సింగ్ రెజ్లర్ చెంప చెళ్లుమనిపించాడు. ఒక్కసారిగా రిఫరీ తనపై చేయి చేసుకోవడంతో సతేందర్ సహనం కోల్పోయి ఆ వెంటనే జగ్బీర్ సింగ్‌ను తిరిగి కొట్టాడు. మొత్తం ట్రయల్స్‌కే మచ్చ తెచ్చిన ఈ ఉదంతంపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కఠిన నిర్ణయం తీసుకుంది. రిఫరీపై ఎలాంటి చర్య తీసుకోకున్నా... క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ లేని సతేందర్‌పై జీవితకాల నిషేధం విధి స్తున్నామని ప్రకటించింది. ఈ సంఘటన వీడియో పరిశీలిస్తే మాత్రం ముందుగా రిఫరీనే సతేందర్‌పై చేయి చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అసలేం జరిగింది! ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడే రెజ్లర్ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 125 కేజీల ఫైనల్ బౌట్లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సతేందర్ మలిక్... మోహిత్‌తో తలపడి 3–0తో ముందంజలో నిలిచాడు. ఇంకో 18 సెకన్లలో బౌట్ ముగియనున్న దశలో మలిక్‌ను మోహిత్ మ్యాట్‌పై (టేక్‌డౌన్)పడగొట్టాడు. ఓ పట్టుపట్టి పక్కకు నెట్టేశాడు. బౌట్లో ఉన్న రిఫరీ వీరేందర్ మలిక్ ‘టేక్‌డౌన్’కు పాయింట్లు ఇవ్వకుండా... కేవలం నెట్టేసిన దానికి ఒక పాయింట్ ఇచ్చాడు. దీనిపై అసంతృప్తితో ఉన్న మోహిత్ ‘చాలెంజ్’కు వెళ్లాడు. ఈ అప్పీల్‌ను సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్ టీవీ రిప్లేలో పరిశీలించారు. టేక్డౌన్ను పరిగణనలోకి తీసుకున్న జగ్బీర్ రెండు పాయింట్లు కేటాయించాడు. దీనివల్ల సతేందర్, మోహిత్ 3–3తో సమంగా నిలిచారు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం స్కోరు టై అయినపుడు ఆఖరి పాయింట్ ఎవరు చేస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. చివరి పాయింట్ మోహిత్ చేయడంతో అతన్నే విజేతగా ప్రకటించారు. అప్పీల్ (చాలెంజ్)తో తారుమారైన ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయిన సతేందర్ పక్కనే 57 కేజీల ఫైనల్ బౌట్ వేదికపై నుంచి నడుచుకుంటూ వెళ్లి రిఫరీ జగ్బీర్ నుంచి వివరణ కోరే ప్రయత్నం చేశాడు. అయితే జగ్బీర్ నుంచి సమాధానం బదులు సతేందర్ చెంపదెబ్బ తిన్నాడు. సతేందర్ కూడా క్షణికావేశానికి లోనై జగ్బీర్ను రెండు దెబ్బలేశాడు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న డబ్ల్యూఎఫ్ఐ ఉన్నతాధికారులు, రెజ్లర్లు, పలువురు అభిమానులు ఖిన్నులయ్యారు. ఈ గందరగోళంలో రవి దహియా, అమన్‌ల మధ్య జరుగుతున్న 57 కేజీల ఫైనల్ బౌట్‌ను నిలిపి వేశారు. వీఐపీ వేదికపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఈ బౌట్లను చూస్తున్నాడు. రెజ్లర్ అనుచిత ప్రవర్తనపై కన్నెర్ర చేసిన ఆయన ఇకపై బౌట్లో దిగకుండా కఠిన చర్య తీసుకున్నారు. చదవండి: ‘కామన్వెల్త్’కు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ -
బీర్ బాటిల్‌తో మ్యాచ్ రిఫరీ తల పలగొట్టాడు.. అంతటితో ఊరుకోకుండా
సీరియస్‌గా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్ అసిస్టెంట్ రిఫరీ తలపై ఒక ఆకతాయి బీర్ బాటిల్ విసరడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ ఘటన బుండెస్లిగా లీగ్‌లో జరిగింది. బోచుమ్, బోరుస్సియా మోయెన్చెంగ్లాడ్బాచ్ మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది. హాఫ్ టై ముగిసేసరికి గ్లాడ్బాచ్ 2-0తో ఆధిక్యంలో ఉంది. బోచుమ్ జట్టు ఓడిపోతుందన్న విషయాన్ని ఒక ఆకతాయి అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. ఇక రెండో హాఫ్ మొదలైన తర్వాత ఆట 71వ నిమిషంలో అసిస్టెంట్ రిఫరీ క్రిస్టియన్ గిట్టిల్మన్పై సదరు ఆకతాయి బీర్ బాటిల్‌ను విసిరాడు. అది వచ్చి నేరుగా రిఫరీ తలకు బలంగా తగిలింది. గ్రౌండ్లో కూలబడ్డ రిఫరీ నొప్పితో విలవిల్లాలాడు. విషయం తెలుసుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు రిఫరీ వద్దకు వచ్చి అతనికి ఎలా ఉందోనని ఆందోళన పడ్డారు. దాదాపు 20 నిమిషాల చర్చ అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్‌ను సజావుగా జరగనీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కోసం రిఫరీని గాయపరిచినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్ తెలిపింది. ఇదిలాఉంటే.. గ్లాడ్బాచ్కు చెందిన ఒక ఆటగాడు స్టాండ్స్‌లో ఉన్న సదరు ఆకతాయితో గొడవకు దిగాడు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా.. నీ బుద్దిని కాస్త అదుపులో ఉంచుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పి అక్కడినుంచి తీసుకెళ్లారు. ఈ ఉదంతాన్ని ఇరు క్లబ్‌లు సోషల్ మీడియా వేదికగా ఖండించాయి. ''మేం రిఫరీ లైన్స్‌మన్ క్రిస్టియన్ గిట్టిల్మన్ను క్షమాపణ కోరుతున్నాం. ఈ విషయం మాకు భరించలేనిది. ఒక ఆకతాయి అభిమాని పిచ్చిగా ప్రవర్తించినందుకు మాకు సిగ్గుగా ఉంది. ఇలాంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతాం'' అంటూ బోచుమ్ క్లబ్ వెల్లడించింది. చదవండి: PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా టీమిండియా బౌలర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! Nick Kyrgios: టెన్నిస్ స్టార్ అసహనం.. మతి పోయిందా ఏమన్నా అయ్యుంటే? Disgraceful situation at Vonovia Ruhrstadion, where the Bochum-Gladbach Bundesliga clash was abandoned after 71 minutes due to a linesman being struck on the head by an object from the crowd.#BOCBMG pic.twitter.com/Yfdn4R2blJ — Sacha Pisani (@Sachk0) March 18, 2022 -
IPL 2022: హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు బంపర్ ఆఫర్
ఈనెల 26 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఆరుగురు రిఫరీల ప్యానెల్లో హైదరాబాద్ మాజీ రంజీ ఆటగాడు డేనియల్ మనోహర్‌కు చోటు దక్కింది. ఈ ప్యానెల్లో మనోహర్.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్‌తో కలిసి పని చేయనున్నాడు. మనోహర్.. ఐపీఎల్లో రిఫరీగా వ్యవహరించబోయే తొలి హైదరాబాదీగా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. గతంలో శివరాం, షంషుద్దీన్, నంద కిషోర్‌లు ఐపీఎల్లో హైదరాబాద్ నుంచి అంపైర్లుగా వ్యవహరించారు. మనోహర్.. 73 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీల సాయంతో 4009 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 65 వికెట్లు పడగొట్టాడు. 2007-08 సీజన్ అనంతరం అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 48 ఏళ్ల మనోహర్ భారత ఏ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. చదవండి: Maxwell: ప్రత్యర్ధులు బహు పరాక్.. కెప్టెన్సీ భారం లేని కోహ్లి ఉప్పెనలా విరుచుకుపడతాడు.. -
క్యాచ్ వదిలేశాడని చెంప పగలగొట్టేశాడు.. కేవలం వార్నింగ్ మాత్రమేనా!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్యాచ్ మిస్ చేశాడాని హారిస్ రౌఫ్ తన సహచర ఆటగాడు కమ్రాన్ గులాంను చెంప దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హారిస్ రౌఫ్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు. కాగా ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ అలీ నఖ్వీ స్పందించాడు. రౌఫ్‌ను అతడు హెచ్చరించనట్లు సమాచారం. అదే విధంగా రౌఫ్‌కు అలీ నఖ్వీ సమన్లు కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే రౌఫ్‌పై లాహోర్ ఖలందర్స్ ఎటువంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం. కాగా రౌఫ్‌పై ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, కేవలం వార్నింగ్‌తోనే విడిచిపెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఎం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా సోమవారం పెషావర్ జల్మీ వర్సెస్ లాహోర్ ఖలాండర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి హజ్రతుల్లా జజయి పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కమ్రాన్ గులామ్ ఈజీ క్యాచ్‌ను జారవేశాడు. అయితే వెంటనే అఖరి బంతికి మహ్మద్ హారిస్‌ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో సెలబ్రేషన్స్‌లో మునిగిపోయయాడు. సహచర ఆటగాళ్లందరూ రౌఫ్‌ను అభినందిస్తుండగా.. కమ్రాన్ గులామ్ కూడా దగ్గరకు వచ్చి అభినందించాడు. ఈ క్రమంలో కోపంగా ఉన్న రౌఫ్ అతడిని చెంప దెబ్బ కొట్టాడు. అయితే ఇదే మ్యాచ్ చివర్లో ఓ రనౌట్ సందర్భంగా హారిస్ రౌఫ్, కమ్రాన్ గులాంను కౌగిలించుకోవడం గమనార్హం. Wreck-it-Rauf gets Haris! #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/wwczV5GliZ — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 -
మ్యాచ్ రిఫరికి కరోనా.. ఆందోళనలో క్రికెటర్లు
సౌతాంఫ్టన్: ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఈ సిరీస్‌కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న ఫిల్ విట్టికేస్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టీ20 సందర్భంగా పలుపురు అధికారులతో పాటు కొందరు క్రికెటర్లు రిఫరితో సన్నిహితంగా మెలిగారు. రిఫరికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో అందరూ సహజంగానే తమ విధులు నిర్వహించారు. అయితే, రోజు వారి పరీక్షల్లో భాగంగా రిఫరికి కరోనా టెస్ట్ నిర్వహించడంతో అసలు విషయం వెలుగుచూసింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు(ఆదివారం) ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. ప్రస్తుతానికి ఆయనతో పాటు ఆయనను కాంటాక్ట్ అయిన వారందరూ సురక్షితంగానే ఉన్నప్పటికీ.. సిరీస్ సజావుగా జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిఫరితో సన్నిహితంగా ఉన్నవారంతా 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండనున్నారు. దీంతో జూన్ 29న ఇరు జట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్ అనంతరం శ్రీలంక జట్టు స్వదేశంలో భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. టీ20 సిరీస్‌ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా, జూన్ 29 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. చదవండి: సచిన్ రికార్డుపై కన్నేసిన మిథాలీ రాజ్ -
IPL 2021: కరోనా విషాదం.. ఇంటికి వెళ్లిపోయిన రిఫరీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న మను నయ్యర్ బయో బబుల్‌ను వీడి స్వస్థలం న్యూఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయన తల్లి హఠాన్మరణమే అందుకు కారణం. అయితే ఆమె మృతి గల కారణాలు తెలియరాలేదు. కాగా మంగళవారం అహ్మదాబాద్‌లో ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌కు నయ్యర్ రిఫరీగా వ్యవహరించారు. గతంలో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ కూడా ఆడారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మను నయ్యర్ మళ్లీ టోర్నీకి తిరిగి వస్తారా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇక తన తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకడంతో అంపైర్ నితిన్ మీనన్ ఇప్పటికే లీగ్‌ను వదిలేయగా...ఆసీస్ అంపైర్ రీఫెల్ కూడా వెళ్లాలని ప్రయత్నించినా విమానాలపై ఆంక్షల వల్ల అది సాధ్యం కాలేదు. చదవండి: IPL 2021: ఐపీఎల్ నుంచి ఇద్దరు అంపైర్లు ఔట్ -
తొలి మహిళా మ్యచ్ రిఫరీగా అరుదైన ఘనత
దుబాయ్ : గతేడాది డిసెంబర్లో పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ గండికోట సర్వ (జీఎస్) లక్ష్మి మరో ఘనతను సాధించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ స్థాయి టోర్నీలో తొలి మహిళా మ్యాచ్ రిఫరీగా ఆమె వ్యవహరించనున్నారు. రాజమండ్రికి (రాజమహేంద్రవరం) చెందిన 51 ఏళ్ల జీఎస్ లక్ష్మి ఈనెల 21న ఆస్ట్రేలియాలో మొదలుకానున్న మహిళల టి20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మెగా టోర్నీకి మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించే ముగ్గురిలో ఏకైక మహిళ జీఎస్ లక్ష్మినే కావడం విశేషం. లక్ష్మితోపాటు స్టీవ్ బెర్నార్డ్, క్రిస్ బ్రాడ్‌లను మ్యాచ్ రిఫరీలుగా ఐసీసీ నియమించింది. మ్యాచ్ అంపైర్లుగా 12 మందిని నియమించగా అందులో ఐదుగురు మహిళలకు (లారెన్ అగెన్‌బాగ్, కిమ్ కాటన్, క్లెయిరీ పొలోసక్, స్యు రెడ్‌ఫెర్న్, జాక్వెలైన్ విలియమ్స్) చోటు దక్కింది. ఏడుగురు పురుష అంపైర్లలో భారత్ నుంచి నితిన్ మీనన్‌కు మాత్రమే అవకాశం లభించింది. లీగ్ మ్యాచ్‌లు ముగిశాకే సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ఎవరు అంపైరింగ్ చేస్తారో ప్రకటిస్తారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8న మెల్బోర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో టి20 వరల్డ్ కప్ ముగుస్తుంది. -
అలా చేసినందుకు రబాడాకు జరిమానా
సాక్షి స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పాస్ట్ బౌలర్ కగిసో రబాడాకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. భారత్‌తో జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఔటైన సమయంలో అభ్యంతకరంగా సెండ్ ఆఫ్ సిగ్నల్స్‌కు ఇచ్చినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో జమైంది. ఇప్పటికే రబాడా డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. డీమెరిట్ పాయింట్లు 4కు చేరితే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రబాడా ఇప్పటికే ఒక టెస్టు మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు. 2019, ఫిబ్రవరి లోపు రబాడా డీమెరిట్ పాయింట్లు 8కి చేరితే రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం కానీ, ఒక టెస్టు లేదా రెండు వన్డేలు/టీ20 లేదా నాలుగు వన్డేలు/టీ20లు నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. రబాడా తన నేరాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు ఒప్పుకున్నాడు. ధావన్ ఔటైనపుడు రబాడా అతని వైపు చూస్తూ చేతులు ఊపుతూ పెవిలియన్ వెళ్లాలని చూపించినట్లు వీడియో ఉంది. -
ఐపీఎల్-10 ఫైనల్ రిఫరీ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: ఐపీఎల్-10 సీజన్లో మే 21న హైదరాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా భారత మాజీ దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రీనాథ్ క్వాలిఫైర్-1, ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక మే 16న జరగబోయే క్వాలిఫైర్-1 మ్యాచ్ కు ఎస్ రవి, శాంషుద్దీన్ లు, ఫైనల్ మ్యాచ్ కు రవి, నిగెల్ లియోంగ్ లను ఫీల్డ్ అంపైర్ లుగా నియమిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఫ్లే ఆఫ్ మ్యాచ్ లకు రిఫరీలుగా శ్రీనాథ్, మనూ నాయర్, చిన్మయా శర్మ లు బాధ్యతలు నిర్వహించనున్నారు. జవగల్ శ్రీనాథ్ భారత్ తరపున 229 వన్డేలు ఆడాడు. భారత తరపున వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ శ్రీనాథ్. 2003 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరిన భారత్ జట్టులో శ్రీనాథ్ కీలక సభ్యుడు.