పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్యాచ్ మిస్ చేశాడాని హారిస్ రౌఫ్ తన సహచర ఆటగాడు కమ్రాన్ గులాంను చెంప దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హారిస్ రౌఫ్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు. కాగా ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ అలీ నఖ్వీ స్పందించాడు. రౌఫ్‌ను అతడు హెచ్చరించనట్లు సమాచారం. అదే విధంగా రౌఫ్‌కు అలీ నఖ్వీ సమన్లు కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే రౌఫ్‌పై లాహోర్ ఖలందర్స్ ఎటువంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం. కాగా రౌఫ్‌పై ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, కేవలం వార్నింగ్‌తోనే విడిచిపెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇంతకీ ఎం జరిగిందంటే..
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా సోమవారం పెషావర్ జల్మీ వర్సెస్ లాహోర్ ఖలాండర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి హజ్రతుల్లా జజయి పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కమ్రాన్ గులామ్ ఈజీ క్యాచ్‌ను జారవేశాడు. అయితే వెంటనే అఖరి బంతికి మహ్మద్ హారిస్‌ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో సెలబ్రేషన్స్‌లో మునిగిపోయయాడు. సహచర ఆటగాళ్లందరూ రౌఫ్‌ను అభినందిస్తుండగా.. కమ్రాన్ గులామ్ కూడా దగ్గరకు వచ్చి అభినందించాడు. ఈ క్రమంలో కోపంగా ఉన్న రౌఫ్ అతడిని చెంప దెబ్బ కొట్టాడు. అయితే ఇదే మ్యాచ్ చివర్లో ఓ రనౌట్ సందర్భంగా హారిస్ రౌఫ్, కమ్రాన్ గులాంను కౌగిలించుకోవడం గమనార్హం.
Wreck-it-Rauf gets Haris! #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/wwczV5GliZ
— PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022
Comments
Please login to add a commentAdd a comment