ipl 2021 match referee manu nayyar leaves bio bubble - Sakshi
Sakshi News home page

IPL 2021: తల్లి హఠాన్మరణం..ఇంటికి వెళ్లిపోయిన రిఫరీ

Published Fri, Apr 30 2021 8:12 AM | Last Updated on Fri, Apr 30 2021 3:18 PM

IPL 2021 MAtch Referee Manu Nayyar Leaves Bio Bubble - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరిస్తున్న మను నయ్యర్‌ బయో బబుల్‌ను వీడి స్వస్థలం న్యూఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయన తల్లి హఠాన్మరణమే అందుకు కారణం. అయితే ఆమె మృతి గల కారణాలు తెలియరాలేదు. కాగా మంగళవారం అహ్మదాబాద్‌లో ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌కు నయ్యర్‌ రిఫరీగా వ్యవహరించారు. గతంలో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ కూడా ఆడారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మను నయ్యర్‌ మళ్లీ టోర్నీకి తిరిగి వస్తారా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇక తన తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకడంతో అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఇప్పటికే లీగ్‌ను వదిలేయగా...ఆసీస్‌ అంపైర్‌ రీఫెల్‌ కూడా వెళ్లాలని ప్రయత్నించినా విమానాలపై ఆంక్షల వల్ల అది సాధ్యం కాలేదు.

చదవండి: IPL 2021: ఐపీఎల్‌ నుంచి ఇద్దరు అంపైర్లు ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement