క్రీడల్లో గొడవలు జరగడం సహజం. ఒక్కోసారి అది కొట్టుకునేంత స్థాయికి వెళుతుంది. మితిమీరినప్పుడు క్రమశిక్షణా చర్యల కింద ఆట నుంచి నిషేధించడం జరుగుతుంది. తాజాగా ఒక ఫ్రాన్స్ ఫుట్‌బాలర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మ్యాచ్ సందర్భంగా రిఫరీకి పంచుల వర్షం కురిపించాడన్న కారణంతో అతనిపై 30 ఏళ్ల నిషేధం విధించారు మ్యాచ్ నిర్వాహకులు.
25 ఏళ్ల వయసున్న ఫుట్‌బాలర్ పేరు ప్రస్తావించడానికి నిర్వాహకులు ఇష్టపడలేదు. అయితే ఆ ఆటగాడు ఫ్రాన్స్‌లోని ఎంటెంటే స్పోర్టివ్ గాటినైస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లోరిట్ ఫుట్‌బాల్ డ్రిస్టిక్ట్ ప్రెసిడెంట్ బెనోయిట్ లెయిన్ పేర్కొన్నారు. కాగా లోకల్ కప్‌లో భాగంగా జనవరి 8న జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుందన్నారు.
మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవలో రిఫరీపై పిడిగుద్దులు కురిపించడంతో.. అతను రెండురోజుల బెడ్‌పై నుంచి లేవలేకపోయాడని తెలిపారు. ఘటన జరిగిన రోజే ఆటగాడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించి 30 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు పేర్కొన్నాడు. విచారణ తర్వాత పోలీసులకు అప్పజెప్పామన్నాడు. అంతేకాదు ఆటగాడి చర్యతో సదరు టీమ్‌ను రెండు సీజన్ల పాటు టోర్నీల్లో పాల్గొనకుండా బ్యాన్ చేసినట్లు బెనోయిట్ వెల్లడించాడు.
చదవండి: 'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా'
Comments
Please login to add a commentAdd a comment