చేతులు ఊపుతూ సెండాఫ్ సిగ్నల్ ఇస్తున్న క్రికెటర్ రబాడా
సాక్షి స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పాస్ట్ బౌలర్ కగిసో రబాడాకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. భారత్‌తో జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఔటైన సమయంలో అభ్యంతకరంగా సెండ్ ఆఫ్ సిగ్నల్స్‌కు ఇచ్చినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో జమైంది. ఇప్పటికే రబాడా డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంది.
డీమెరిట్ పాయింట్లు 4కు చేరితే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రబాడా ఇప్పటికే ఒక టెస్టు మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు. 2019, ఫిబ్రవరి లోపు రబాడా డీమెరిట్ పాయింట్లు 8కి చేరితే రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం కానీ, ఒక టెస్టు లేదా రెండు వన్డేలు/టీ20 లేదా నాలుగు వన్డేలు/టీ20లు నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. రబాడా తన నేరాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు ఒప్పుకున్నాడు. ధావన్ ఔటైనపుడు రబాడా అతని వైపు చూస్తూ చేతులు ఊపుతూ పెవిలియన్ వెళ్లాలని చూపించినట్లు వీడియో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment