
జోహాన్స్‌బర్గ్: ప్రముఖ భారతీయ స్నాక్ సమోసాకు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ కాంటెస్ట్‌లో నోరూరించే మన వంటకం చిల్లీ చికెన్ సమోసా నెగ్గింది. భారతీయ సంతతి కోసం నిర్వహించే పత్రిక వీక్లీ పోస్ట్ నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో చాక్లెట్, జీడిపప్పు, ఇతర నోరూరించే వంటకాలతో పోటీ పడి చిల్లీ చికెన్ సమోసా భోజనప్రియుల మన్ననలు పొందింది. బాదంపప్పు, జీడిపప్పులు సహా పలు రుచులతో చిల్లీ చికెన్ సమోసాను తయారు చేశారు.
ట్రెడిషనల్ పంజాబీ స్నాక్‌గా పేరొందిన సమోసా వంటకాన్ని పోటీకి నిలిపిన సల్మా అజీ కాంటెస్ట్‌లో గెలుపొందారు. తాను వంట చేయడాన్ని ఇష్టపడతాననీ, ప్రతి వంటకానికీ మరింత మెరుగులు దిద్ది మరింత రుచికరంగా చేస్తానని సల్మా చెప్పారు. తాను మొదట పిల్లల కోసం చికెన్ శాండ్‌విచ్ చేశానని ఆ తర్వాత చిల్లీ చికెన్ సమోసాను కనిపెట్టానన్నారు. కాశ్మీరీ కారం పొడితో చికెన్‌ను వండినట్టు చెప్పారు. ఇదే కాంటెస్ట్ మరో క్యాటగిరీలో ఒకే నిమిషంలో పది సమోసాలు తిన్న ఇబ్రహీం బక్స్ ఫాస్టెస్ట్ సమోసా ఈటర్ టైటిల్ గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment