దక్షిణాఫ్రికా ఘనవిజయం | South Africa is a great success | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా ఘనవిజయం

Published Tue, Oct 3 2017 12:35 AM | Last Updated on Tue, Oct 3 2017 12:35 AM

 South Africa is a great success

పోష్‌స్ట్రూమ్‌: పేసర్‌ కగిసో రబడ (3/33), స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ (4/25) చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 333 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 424 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 32.4 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆట చివరి రోజు సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 49/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లా కేవలం 41 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయి చిత్తుగా ఓడింది.

మెహదీ హసన్, ముస్తాఫిజుర్‌ రహమాన్‌ నెలకొల్పిన 15 పరుగుల భాగస్వామ్యమే బంగ్లాదేశ్‌ ఐదో రోజు ఆటలో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఈమ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 496/3 పరుగుల వద్ద డిక్లేర్‌ చేయగా, బంగ్లా 320 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 247/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ శుక్రవారం మొదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement