ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బంగ్లాదేశ్.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 101 పరుగుల వెనుకంజలో ఉంది.
బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లాం (1), మొమినుల్ హక్ (0), నజ్ముల్ హసన్ షాంటో (23) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (38), ముష్ఫికర్ రహీం (31) క్రీజ్‌లో ఉన్నారు. రబాడ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. నాలుగు పరుగుల వద్ద రబాడ.. షద్మాన్ ఇస్లాం, మొమినుల్ హక్ వికెట్లు పడగొట్టాడు. షాంటో వికెట్ కేశవ్ మహారాజ్‌కు దక్కింది.
అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వెర్రిన్‌కు వియాన్ ముల్దర్ (54), డీన్ పైడిట్ (32) సహకరించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జీ (30), ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీయగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. సఫారీ బౌలర్ల ధాటికి 106 పరుగులకే ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.
చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment