ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి దిశగా సాగుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 307 పరుగులకు ఆలౌటైంది. తద్వారా సౌతాఫ్రికా ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొంత సేపటికే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఓవర్‌నైట్ బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ తన వ్యక్తిగత స్కోర్‌కు మరో 10 పరుగులు జోడించి 97 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు (283/7) బంగ్లాదేశ్ మరో 24 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. రబాడ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. కేశవ్ మహారాజ్ 3, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ముల్దర్ హాఫ్ సెంచరీతో (54) రాణించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 106 పరుగులకు ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment