రబడా సంచలనం | Rabada sensation | Sakshi
Sakshi News home page

రబడా సంచలనం

Published Sat, Jul 11 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

రబడా సంచలనం

రబడా సంచలనం

అరంగేట్రంలోనే హ్యాట్రిక్
బంగ్లాపై తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం

 ఢాకా : ఆడిన తొలి వన్డేలోనే దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబడా సంచలన బౌలింగ్‌తో చెలరేగాడు. హ్యాట్రిక్‌తో పాటు 22 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. దీంతో బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ప్రొటీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.  టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా  36.3 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది.  షకీబ్ (51 బంతుల్లో 48; 5 ఫోర్లు) టాప్ స్కోరర్.   సఫారీ 31.1 ఓవర్లలో రెండు వికెట్లకు 164 పరుగులు చేసి నెగ్గింది. డు ప్లెసిస్ (75 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు), రోసో (53 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement