ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 308 పరుగులకు ఆలౌటైంది. 140/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ప్రోటీస్ అదనంగా 168 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది.
దీంతో ప్రోటీస్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగుల భారీ ఆధిక్యంలో లభించింది. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటకి వెర్రెయిన్నే మాత్రం బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని తన జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 144 బంతులు ఎదుర్కొన్న వెర్రెయిన్నే 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్(54), పైడట్(32), టానీ డీజోరి(30) పరుగులతో రాణించారు. కాగా అంతకుముందు బంగ్లా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్?
Comments
Please login to add a commentAdd a comment