బంగ్లాదేశ్‌ విలవిల | Senior players put their stamp on Proteas domination | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ విలవిల

Published Sun, Oct 8 2017 1:30 AM | Last Updated on Sun, Oct 8 2017 5:46 AM

Senior players put their stamp on Proteas domination

బ్లూమ్‌ఫాంటీన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్‌ పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజే ఫాలోఆన్‌ ఆడుతోంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 428/3తో శనివారం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 573 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

ఆమ్లా (132; 17 ఫోర్లు), కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (135 నాటౌట్‌; 15 ఫోర్లు) సెంచరీలు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలింది. లిటన్‌ దాస్‌ (70) రాణించాడు. రబడా 5, ఒలివియర్‌ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీకి 426 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన బంగ్లా ఆట నిలిచే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 7 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement