one day match
-
‘ఒక్క సిరీస్‌తో తక్కువ చేయవద్దు’
నాగ్‌పూర్: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు సాగాయి. సీనియర్ల ఆటపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ తరహా విమర్శలను వన్డే టీమ్ వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పు పట్టాడు. నిజానికి తాము ఆసీస్ గడ్డపై కూడా మెరుగ్గానే ఆడామని, కొద్దిలో ఓటమి పాలయ్యామని అతను వివరించాడు. ‘ఒక్క సిరీస్ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గతంలో ఎన్నో టోర్నీల్లో నిలకడగా రాణించారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో మేం అంచనాలకు తగినట్లుగా ఆడలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా విఫలమేమీ కాలేదు. చివరి రోజు బుమ్రా లేకపోవడం దురదృష్టకరం. అతను ఆడితే మేం మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేసేవాళ్లం. ఒక మ్యాచ్ లేదా ఒక రోజు మా ఆటేంటో చెప్పదు. గతంలో అక్కడ రెండుసార్లు సిరీస్ సాధించాం. వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వెళ్లడంతో పాటు టి20 వరల్డ్ కప్ కూడా గెలిచామని మరచి పోవద్దు’ అని గిల్ సమాధానమిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడన్న గిల్... టీమ్‌లో వరుసగా మార్పులు చేర్పులు సరైంది కాదన్నాడు. ‘విజయ్ హజారే వన్డే ట్రోఫీలో కరుణ్ నాయర్ చాలా గొప్పగా ఆడాడు. అందరూ ఇది అంగీకరించాలి. కానీ ఎవరి స్థానంలో తీసుకుంటారు. మేమంతా కూడా ఇక్కడికి రావడానికి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు జట్టులో ఉన్నవాళ్లంతా చాలా బాగా ఆడుతున్నారు. మేం వరల్డ్ కప్‌లో ఒక్కటే మ్యాచ్ ఓడాం. కాబట్టి టీమ్‌లో అనవసరపు మార్పులు చేయవద్దు. కొంతకాలం ఒకే టీమ్‌ను కొనసాగించకపోతే జట్టు బలహీనంగా మారుతుంది’ అని గిల్ విశ్లేషించాడు. వైస్ కెప్టెన్ గా తనపై అదనపు బాధ్యత ఉందని... జట్టుకు అవసరమైనప్పుడల్లా రోహిత్‌కు తన సూచనలు అందిస్తానని గిల్ చెప్పాడు. టి20ల్లో చిత్తుగా ఓడినా... వన్డేల్లో ఇంగ్లండ్ బలమైన జట్టు కాబట్టి గట్టి పోటీ తప్పదని అతను అభిప్రాయపడ్డాడు. -
భారత్-శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ టై
-
వన్డే సమరానికి సై
జొహన్నెస్‌బర్గ్: సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అనూహ్యంగా పరాజయంపాలైన దాదాపు నెల రోజుల తర్వాత భారత జట్టు మరో వన్డే పోరులో బరిలోకి దిగుతోంది. అయితే ఆ టోర్నీలో ఆడినవారిలో పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే రాహుల్ నాయకత్వంలో యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా సిద్ధమైంది. మరో వైపు వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికాకు కూడా ఇదే తొలి మ్యాచ్. సఫారీ టీమ్ కూడా స్వదేశంలో పలువురు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం వాండరర్స్ మైదానంలో తొలి వన్డే జరగనుంది. ‘బ్రెస్ట్ క్యాన్సర్’ అవగాహన కార్యక్రమంలో భాగంగా మైదానం మొత్తం గులాబీమయం కానుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గులాబీ రంగు జెర్సీలతోనే బరిలోకి దిగుతారు. ఎవరెవరికి చాన్స్! వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసిన ఆటగాళ్ల బృందంలో 9 మందికి 10కంటే తక్కువ వన్డేలు ఆడిన అనుభవం ఉంది. దేశవాళీ వన్డేల్లో ప్రదర్శనతో పాటు టి20 టీమ్‌లో సభ్యులుగా సత్తా చాటిన కుర్రాళ్లకు ఇక్కడా అవకాశం దక్కనుంది. రుతురాజ్, తిలక్, రింకూ సింగ్‌లాంటి బ్యాటర్లు దీనిని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మిడిలార్డర్లో సంజు సామ్సన్‌కు మ్యాచ్ దక్కుతుందా అనేది ఆసక్తికరం. వన్డేల కోసమే ఎంపిక చేసిన తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్‌కు కూడా టీమ్ మేనేజ్మెంట్ పరీక్షించవచ్చు. కెప్టెన్‌గా గతంలోనూ మంచి అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ ఈసారి కూడా యువ ఆటగాళ్లతో జట్టును ఎలా నడిపిస్తాడనేది చూడాలి. షమీ, బుమ్రా, సిరాజ్‌లు అందుబాటులో లేరు. దాంతో ముకేశ్, అర్ష్‌దీప్, అవేశ్లపైనే భారం ఉంది. అయితే స్పిన్‌లో మాత్రం పరిస్థితి మెరుగా>్గ ఉంది. ఫామ్‌లో ఉన్న కుల్దీప్తో పాటు అక్షర్, పునరాగమనంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న చహల్‌లను ఎదుర్కోవడం సఫారీలకు అంత సులభం కాదు. బ్యాటింగ్‌పైనే భారం... దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడైన ఆటగాళ్లలో మిల్లర్, క్లాసెన్, కెప్టెన్ మార్క్రమ్లకు పేరుంది. భారత్‌తో టి20 సిరీస్‌లో ఈ ముగ్గురినుంచి చెప్పుకోదగ్గ మెరుపులు రాలేదు. వన్డేల్లోనైనా తమ స్థాయికి తగినట్లుగా ఆడితే సఫారీ జట్టు పైచేయి సాధించగలదు. ఓపెనర్‌గా రీజా హెన్‌డ్రిక్స్‌కు ఇకపై పూర్తి స్థాయిలో అవకాశాలు రానున్నాయి. వాటిని అతను ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టు బౌలింగ్ దళంలో పూర్తిగా అనుభవరాహిత్యం కనిపిస్తోంది. విలియమ్స్, బర్జర్, ముల్దర్ లు టీమిండియాకు కట్టడి చేయగలరా అనేది సందేహమే. జట్ల వివరాలు (అంచనా) భారత్: రాహుల్ (కెప్టెన్ ), రుతురాజ్, సుదర్శన్, తిలక్, శ్రేయస్, రింకూ/సామ్సన్, అక్షర్, అర్ష్ దీప్, అవేశ్, కుల్దీప్, ముకేశ్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్ ), హెన్డ్రిక్స్, డి జోర్జి, వాన్‌డర్ డసెన్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ముల్దర్, బర్జర్, మహరాజ్/ షమ్సీ, విలియమ్స్ పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూల మైదానం. భారీ స్కోర్లు ఖాయం. గత నాలుగు వన్డేల్లో మూడు సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. వర్షసూచన లేదు. -
సిరీస్ సొంతం చేసుకునేందుకు...
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో విజయం భారత్‌కు ఏదైనా మేలు చేసిందా? ఏదైనా కొత్త ప్రయోగానికి పనికొచ్చిందా? అంటే ‘లేదు’ అనే సమాధానమే వినిపిస్తుంది. వరల్డ్‌కప్ నకు ముందు మిగిలిన మ్యాచ్‌ల్లో అన్ని రకాలుగా కూర్పును పరీక్షించుకోవాల్సిన మన జట్టు గత పోరులో అనవసరపు ప్రయత్నం చేసింది. ఎంత చిన్న లక్ష్యమైనా... ఆటగాళ్ల స్థానాలు మార్చడం వల్ల గందరగోళమే తప్ప ఉపయోగం లేదని ఆ మ్యాచ్ చూపించింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో రెండో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. సిరీస్ గెలిచే అవకాశంపై సందేహాలు లేకపోయినా టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరం. బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): వరల్డ్‌కప్‌లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశమే లేదు. సూర్యకుమార్ మూడో స్థానంలో ఎలాగూ ఆడడు. అసలు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కోలుకుంటే వన్డేల్లో అతనికి చోటు కూడా సందేహమే. ఫినిషర్‌గా హార్దిక్ సరైన వ్యక్తి కాగా, నాలుగో స్థానంలో ఆడే చాన్స్ లేదు. వన్డేల్లో హార్దిక్ తొలి ఓవర్ బౌలింగ్ చేయడం అసాధ్యం. కానీ వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ ఈ ప్రయోగాలన్నీ చేసింది. కానీ దానివల్ల ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరలేదు. నిజంగా జట్టులో అందరికీ బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలని భావిస్తే టీమిండియా టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకోవాల్సింది. ఇప్పుడు భారత్ ముందు అలాంటి అవకాశం ఉంది. తొలి మ్యాచ్ జరిగిన కెన్సింగ్టన్ ఓవల్ వేదికపైనే భారత్, విండీస్ మధ్య నేడు రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ గెలిచి రోహిత్ సేన సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా లేక విండీస్ కోలుకొని జవాబిస్తుందా చూడాలి. సామ్సన్ను అవకాశముందా! సాధారణంగా గెలిచిన జట్టులో మార్పులు ఉండవు. అయితే తొలి వన్డే సమయంలోనే కీపర్‌గా సంజు సామ్సన్ను కాకుండా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. రెండేళ్ల వ్యవధిలో అప్పుడప్పుడు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటూ సామ్సన్ 11 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే వరల్డ్‌కప్ టీమ్‌లో ఉంచాలనే ఆలోచన ఉంటే మాత్రం అతనికి తగినన్ని మ్యాచ్‌లు ఇవ్వడం కీలకం. ఇషాన్ అర్ధసెంచరీ సాధించి తన వైపు నుంచి ఎలాంటి సమస్య లేకుండా రుజువు చేసుకున్నాడు. మరోవైపు సామ్సన్ను మేనేజ్మెంట్ ప్రధానంగా మిడిలార్డర్లో చూస్తోంది. కాబట్టి ఇషాన్ రాణించినా సామ్సన్కూ ఒక అవకాశం ఇవ్వవచ్చు. ఆదుకునేదెవరు? భారత్‌పై మంచి రికార్డు ఉన్న హెట్‌మైర్‌పై విండీస్ తొలి మ్యాచ్‌లో ఆశలు పెట్టుకుంది. స్పిన్‌ను సమర్థంగా ఆడగల అతను ఏమాత్రం ప్రభావం చూపకుండా వెనుదిరిగాడు. దాంతో అసలు ప్రత్య ర్థిపై దూకుడు ప్రదర్శించగల బ్యాటర్లే ఆ జట్టులో కరువయ్యారు. హోప్ ఫర్వాలేదనిపించినా అది జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో విండీస్ పోటీలో నిలవాలంటే బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన అయినా ఇవ్వాల్సి ఉంటుంది. పిచ్, వాతావరణం తొలి వన్డేలో పిచ్ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. అదే పిచ్‌పైనే ఈ మ్యాచ్ ఆడితే ఇరు జట్లు అదనపు స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. మరో పిచ్ మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా మంచి స్కోర్లకు అవకాశం కల్పిస్తుంది. మ్యాచ్‌కు వర్షం గండం ఉంది. -
హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్.. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. మంగళవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గుప్తా, మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వివరాలు Ðð ల్లడిస్తున్న రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ► 2,500 మంది పోలీసులు, 250 మందితో సెక్యూరిటీ వింగ్ , 403 మంది ట్రాఫిక్ సిబ్బంది, 1091 మంది లా అండ్ ఆర్డర్, నాలుగు ప్లాటూన్ల టీఎస్ఎస్పీ బృందాలు, ఆరు ప్లటూన్ల ఆర్మ్డ్ సిబ్బంది, రెండు ఆక్టోపస్ టీంలు, మౌంటెడ్ పోలీస్, వజ్రా తదితర సిబ్బందితో భారీ బందోబస్తు. ►అలాగే ఎస్బీ, సీసీఎస్, ఎస్ఓటీ, రెండు ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. స్టేడియం పరిసర ప్రాంతాలు, స్డేడియంలో, ప్రేక్షకులు కూర్చునే చోటు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో కలిసి మొత్తం 300 సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ టీవీలతో గస్తీ.. ►సీసీ టీవీల దృశ్యాలను ఎప్పటికప్పుడు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ రూం. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో నిరంతర గస్తీ. ►పేలుడు పదార్థాలను గుర్తించేలా ప్రత్యేక టీంల ఏర్పాటు. బ్లాక్ టికెట్లను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్‌లకు పాల్పడుతున్నవారిపై ఇప్పటికే 4 కేసులు బుక్ చేశాం. చదవండి: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి ఎక్కడ మహిళలుంటే అక్కడ షీ టీం ►ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి వచ్చే మహిళల భద్రతకు ప్రాధాన్యం. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ షీటీంలు అందుబాటులో ఉంటాయి. వీఐపీలకే గేట్ నంబర్ వన్.. ఈసారి గేట్ నంబర్ వన్ను వీఐపీలకే అనుమతి ఉంటుంది. 12 నంబర్ గేట్‌ను గేట్ 1ఏగా గుర్తించి.. దాని ద్వారా జనరల్ పబ్లిక్‌ను అనుమతి ఇవ్వనున్నాం. భారీ వాహనాల దారి మళ్లింపు ►బుధవారం ఉదయం నుంచే ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు, సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలను దారి మళ్లిస్తాం. ►వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను చెంగిచెర్ల, మల్లాపూర్‌ల మీదుగా దారి మళ్లిస్తాం. సెల్ఫోన్లకు మాత్రమే అనుమతి ప్రేక్షకులు కేవలం సెల్ఫోన్లు తప్ప మరే ఇతర వస్తువులను స్టేడియంలోకి అనుమతి ఉండదు. ►తాగునీరు, తినుబండారాల విక్రయం ►తిను బండారాలు, తాగునీరు.. అన్ని రకాల ఆహార పదార్థాలను హెచ్‌సీఏ ద్వారా స్టేడియంలో విక్రయిస్తారు. ►సూచించిన రేట్లకే స్టాల్స్ నిర్వాహకులు వీటిని విక్రయించాలి. లేనిపక్షంలో పోలీసులు చర్యలు తీసుకుంటారు. సూచించిన స్థలాల్లోనే పార్కింగ్.. ►హబ్సిగూడ చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు, రామంతాపూర్ విశాల్ మార్ట్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు రోడ్డుకిరువైపులా ఎలాంటి వాహనాలను పార్క్ చేయొద్దు. ►కేటాయించిన స్థలాల్లోనే పార్కు చేయాల్సి ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చినవారు టీఎస్ఐఐసీ స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలి. ఏ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో సూచించే బోర్డులను ఏర్పాటు చేశాం. -
హైదరాబాద్‌లో కివీస్‌తో మ్యాచ్.. ఆ కిక్కే వేరు.. టీమిండియాదే పైచేయి! ఈసారి..
India vs New Zealand, 1st ODI - Hyderabad- Head To Head Records: అనగనగా భారత్, కివీస్... క్రికెట్లో ఈ రెండు జట్లు తలపడితే ఆ మజానే వేరు. అదీ భాగ్యనగరంలో అయితే మరింత కిక్కే కిక్కు.... వీటి మధ్య ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. అన్నింటా భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఈ రెండు జట్ల నడుమ జరిగిన పోటీల్లో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో చిరస్మరణీయమైన గుర్తులకు హైదరాబాద్ వేదిక అయింది. పాలిఉమ్రిగర్ నుంచి మొదలుకుంటే విజయ్ మంజ్రేకర్, ఎరాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, ఆబిద్ అలీ, అజహరుద్దీన్, కపిల్ దేవ్, శ్రీకాంత్, అర్షద్ అయూబ్ , నరేంద్ర హిర్వాణీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ,కోహ్లి , పుజారా, అశ్విన్... రిచర్డ్ హ్యాడ్లీ, మార్క్ గ్రేట్ బ్యాచ్, జాన్‌రైట్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియఅమ్సన్.. ఇలా ఎందరో టాప్‌మోస్ట్ ఆటగాళ్లు తమ ఆటతో హైదరాబాద్ ప్రేక్షకులను హుషారెత్తించారు. ఇక నేడు జరగబోయే మ్యాచ్ సైతం భాగ్యనగర ప్రేక్షకులను అలరించనుంది. స్టార్ ప్లేయర్లతో ఇండియా, కివీస్ జట్లు బరిలో దిగనున్నాయి. హైదరాబాదీస్.. లెట్స్ ఎంజాయ్ స్టేడియంలో భారత ఆటగాళ్లు సాక్షి క్రీడా విభాగం: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భాగ్యనగరంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 1955లో తొలిపోరు జరిగింది. చివరిసారి ఈ రెండు జట్లు 2012లో ఇక్కడ తలపడ్డాయి. 1955 నుంచి 2012 మధ్య కాలంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో (ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం) ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. ఐదు టెస్టుల్లో భారత్ రెండు టెస్టుల్లో గెలిచి, మిగతా మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ఇక రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది. తద్వారా హైదరాబాద్ గడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ ఇప్పటి వరకు ఓటమి రుచి చూడలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు భాగ్యనగరంలో ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. 2012 తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ కోసం అడుగుపెట్టిన న్యూజిలాండ్ నేడు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌తో తొలి వన్డే ఆడనుంది. గతంలో ఎల్బీ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన న్యూజిలాండ్ ఉప్పల్ స్టేడియంలో తొలిసారి వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ టిమ్ సౌతీ లేకుండానే భారత్‌తో వన్డే సిరీస్‌లో పోటీపడుతున్న న్యూజిలాండ్ తాత్కాలిక కెపె్టన్ టామ్ లాథమ్ సారథ్యంలో ఈసారైనా తమ రికార్డును మెరుగుపర్చుకుంటుందా లేక భారత్‌కు దాసోహమంటుందా అనే విషయం నేడు తేలిపోతుంది. పిచ్‌ను పరిశీలిస్తున్న రోహిత్, అజహర్ ఇప్పటి వరకు హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలా.. ►ఎప్పుడు: 1955, నవంబర్ 19– 24 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 498/4 డిక్లేర్డ్ (పాలీ ఉమ్రిగర్ 223, విజయ్ మంజ్రేకర్ 118, కృపాల్ సింగ్ 100 నాటౌట్); న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 326 ఆలౌట్ (జాన్ గయ్ 102, సుభాష్ గుప్తే 7/128); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 212/2 (బెట్ సట్‌క్లిఫ్ 137 నాటౌట్). ► ఎప్పుడు: 1969, అక్టోబర్ 15–20 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 181 ఆలౌట్ (బ్రూస్ ముర్రే 81, ఎరాపల్లి ప్రసన్న 5/51), భారత్ తొలి ఇన్నింగ్స్: 89 ఆలౌట్ (వెంకట్రాఘవన్ 25 నాటౌట్, బిషన్ సింగ్ బేడీ 20, డేల్ హ్యాడ్లీ 4/30, బాబ్ కునిస్ 3/12), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 175/8 డిక్లేర్డ్ (డౌలింగ్ 60, సయ్యద్ ఆబిద్ అలీ 3/47, ప్రసన్న 3/58), భారత్ రెండో ఇన్నింగ్స్: 76/7 (భారత విజయ లక్ష్యం 268). ►ఎప్పుడు: 1988, డిసెంబర్ 2–6 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ 10 వికెట్లతో విజయం సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 254 ఆలౌట్ (మార్క్గ్రేట్బ్యాచ్ 90 నాటౌట్, ఇయాన్ స్మిత్ 79, అర్షద్ అయూబ్ 4/55, సంజీవ్ శర్మ 3/37), భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ (కృష్ణమాచారి శ్రీకాంత్ 69, అజహరుద్దీన్ 81, కపిల్ దేవ్ 40, మార్టిన్ స్నెడెన్ 4/69), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 124 ఆలౌట్ (జాన్ రైట్ 62, రిచర్డ్ హ్యాడ్లీ 31, కపిల్ దేవ్ 3/21, అర్షద్ అయూబ్ 3/36, నరేంద్ర హిర్వాణీ 3/43), భారత్ రెండో ఇన్నింగ్స్: 22/0 (భారత విజయ లక్ష్యం 21). న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రాక్టీస్ ►ఎప్పుడు: 2010, నవంబర్ 12–16 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 350 ఆలౌట్ (టిమ్ మెకింటోష్ 102, మార్టిన్ గప్టిల్ 85, జెస్సీ రైడర్ 70, జహీర్ ఖాన్ 4/69, హర్భజన్ సింగ్ 4/76), భారత్ తొలి ఇన్నింగ్స్: 472 ఆలౌట్ (వీరేంద్ర సెహ్వాగ్ 96, గౌతమ్ గంభీర్ 54, వీవీఎస్ లక్ష్మణ్ 74, హర్భజన్ సింగ్ 111 నాటౌట్, డానియల్ వెటోరి 5/135), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 448/8 డిక్లేర్డ్ (బ్రెండన్ మెకల్లమ్ 225, కేన్ విలియమ్సన్ 69, శ్రీశాంత్ 3/121, సురేశ్ రైనా 2/38), భారత్ రెండో ఇన్నింగ్స్: 68/0 (భారత విజయ లక్ష్యం 327). ►ఎప్పుడు: 2012, ఆగస్టు 23–26 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్ (చతేశ్వర్ పుజారా 159, విరాట్ కోహ్లి 58, ఎమ్మెస్ ధోని 73, జీతన్ పటేల్ 4/100), న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్ (జేమ్స్ ఫ్రాంక్లిన్ 43 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ 6/31, ప్రజ్ఞాన్ ఓజా 3/44), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 164 ఆలౌట్ (కేన్ విలియమ్సన్ 52, రవిచంద్రన్ అశ్విన్ 6/54, ప్రజ్ఞాన్ ఓజా 3/48). మరుపురాని వన్డే మ్యాచ్ ఎప్పుడు: 1999, నవంబర్ 8 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 174 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 376/2 (50 ఓవర్లలో) (సచిన్ టెండూల్కర్ 186 నాటౌట్, రాహుల్ ద్రవిడ్ 153), న్యూజిలాండ్: 202 ఆలౌట్ (33.1 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 43, వెంకటేశ్ ప్రసాద్ 2/38, అనిల్ కుంబ్లే 2/39). సచిన్, సెహ్వాగ్‌ల వీర విహారం ఎప్పుడు: 2003, నవంబర్ 15 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 145 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 353/5 (50 ఓవర్లలో) (వీరేంద్ర సెహ్వాగ్ 130, సచిన్ టెండూల్కర్ 102, రాహుల్ ద్రవిడ్ 50 నాటౌట్), న్యూజిలాండ్: 208 ఆలౌట్ (47 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 54, జహీర్ ఖాన్ 3/30, అజిత్ అగార్కర్ 2/28, అనిల్ కుంబ్లే 2/36, మురళీ కార్తీక్ 2/38). ఉప్పల్‌లో భారత్ ఇలా.. 2005 నుంచి 2022 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు వివిధ జట్లతో అన్ని ఫార్మాట్లలో కలిపి 13 మ్యాచ్‌లు (6 వన్డేలు, 5 టెస్టులు, 3 టి20) ఆడింది. 9 మ్యాచ్‌ల్లో (4 టెస్టులు, 3 వన్డేలు, 2 టి20) గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో (వన్డేలు) ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’ (టెస్ట్) అయింది. -
హైదరాబాద్‌లో భారత్- న్యూజిలాండ్ తొలి వన్డే.. ఆన్లైన్లో టికెట్స్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జనవరి18న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేకు సంబంధించిన టికెట్లను పేటీఎంలో అందుబాటులో ఉంచినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తెలిపింది. ఓవరాల్‌గా 29 వేల టికెట్స్‌ను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు హెచ్‌సీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే తొలి రోజు (జనవరి13) కేవలం 6వేల టికెట్స్‌ను మాత్రమే హెచ్సీఎ అందుబాటులో ఉంచింది. ఈ నెల 16 వరకు ఆన్లైన్లో టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారు క్యూ ఆర్ కోడ్ చూపించి ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. కాగా ఫిజికల్ టికెట్లు జనవరి 15 నుంచి 18 వరకు పొందవచ్చు. కాగా గతేడాది జింఖానా గ్రౌండ్లో టికెట్లు కోసం జరిగిన తొక్కిసలాట ను దృష్టిలో పెట్టుకున్న హెచ్సీఎ ఈసారి మొత్తం టికెట్లను ఆన్లైన్లోనే విక్రయించనుంది. చదవండి: మహిళా క్రికెటర్ అనుమానస్పద మృతి.. అడవిలో మృతదేహం! -
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా..!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో రియాన్ బర్ల్ వికెట్ పడగొట్టిన స్టార్క్.. తన వన్డే కెరీర్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను స్టార్క్ తన పేరిట లిఖించుకున్నాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజాగా స్టార్క్ కేవలం 102 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్లు పడగొట్టి ముస్తాక్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టాప్‌లో స్టార్క్ ఉండగా.. రెండు మూడు స్ధానాల్లో వరుసగా సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు), ఆసీస్ దిగ్గజం బ్రెట్‌లీ(112 మ్యాచ్‌లు) ఉన్నారు. అదే విధంగా వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్‌గా కూడా స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. చదవండి: Aus Vs Zim 3rd ODI: సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వే.. సంచలన విజయం -
శ్రీలంకతో భారత్ తొలి పోరు..
ప్రపంచ కప్ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి దిగబోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ నేడు జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. మిథాలీరాజ్ రిటైర్మెంట్ తర్వాత టీమ్‌కు ఇదే తొలి వన్డే కావడం విశేషం. లంకతో జరిగిన టి20 సిరీస్‌ను 2–1తో భారత్ గెలుచుకుంది. గతంలో 5 వన్డేల్లో భారత్‌కు సారథిగా వ్యవహరించిన హర్మన్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్. శ్రీలంకతో ఇప్పటి వరకు తలపడిన 29 వన్డేల్లో భారత్ 26 గెలిచి 2 మాత్రమే ఓడింది. చదవండి: SL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం -
గర్జించిన సఫారీ ఓపెనర్లు.. పసికూనపై భారీ స్కోర్ నమోదు
డబ్లిన్: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సఫారీ బ్యాట్స్‌మెన్ గర్జించారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో పసికూన చేతిలో ఎదురైన పరాభవంతో సఫారీలు అలర్ట్ అయ్యారు. పరువు పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), జన్నెమన్ మలాన్ (177 బంతుల్లో 169 నాటౌట్; 16 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మలాన్ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కెరీర్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ వాన్ డర్ డుసెన్(28 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 2, క్రెయిగ్ యంగ్, సిమి సింగ్ తలో వికెట్ పడగొట్టారు. కడపటి వార్తలందేసరికి ఐర్లాండ్ 3 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 12 పరుగులు సాధించింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకపోగా, రెండో వన్డేలో ఆతిధ్య ఐర్లాండ్ సఫారీలపై 43 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. వన్డే క్రికెట్లో ఐర్లాండ్‌కు సఫారీలపై ఇదే తొలి విజయం కావడం విశేషం. -
10 మంది డకౌట్.. 2 పరుగులకే ఆలౌట్
లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ఓ వన్డే జట్టు అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేసి, క్రికెట్ చరిత్రలో అత్యంత ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. హంటింగ్‌డాన్‌షైర్ కౌంటీ లీగ్‌లో భాగంగా ఫాల్కన్ జట్టుతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో బక్డెన్క్రికెట్ క్లబ్ జట్టు అత్యంత చెత్త బ్యాటింగ్‌తో కేవలం రెండంటేరెండు పరుగులు మాత్రమే నమోదు చేసి ఆలౌటైంది. బక్డెన్ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా సింగిల్ రన్ తీయలేకపోయారు. పది మంది ప్లేయర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. ప్రత్యర్ధి బౌలర్లు అమన్‌దీప్‌సింగ్, హైదర్ అలీ దెబ్బకు బక్డెన్ ప్లేయర్లు ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోయారు. అమన్‌దీప్ నాలుగు ఓవర్లను మెయిడిన్ చేసి 6 వికెట్లు పడగొట్టగా, అలీ 4.3 ఓవర్లలో రెండు మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. స్కోర్ బోర్డుపై నమోదైన ఆ రెండు పరుగులు కూడా వైడ్, బై రూపంలో వచ్చినవే. వివరాల్లో వెళితే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఫహీమ్ సబీర్ భట్టి (65), మురాద్ అలీ (67) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 261 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బక్డెన్ జట్టు.. అమన్‌దీప్‌సింగ్(6/0), హైదర్ అలీ(2/0) ధాటికి 8.3 ఓవర్లలో 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.దీంతో ఫాల్కన్ జట్టు 258 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. హంటింగ్‌డాన్‌షైర్ కౌంటీ లీగ్‌లో భాగంగా జూన్ 19న జరిగిన ఈ మ్యాచ్ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ బోర్డు వైరల్‌గా మారింది.కాగా, ఈ మ్యాచ్‌లో దారుణ పరాభవం అనంతరం బక్డెడ్ జట్టు కెప్టెన్ జోయల్ మీడియాతో మాట్లాడాడు. జట్టులోని 15 మంది ప్రధాన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు గైర్హాజయ్యారని, వ్యక్తిగత కారణాల వల్ల వారంతా మ్యాచ్‌లో ఆడలేకపోయారని, చేసేదేమీ లేక రెండో జట్టుతో బరిలోకి దిగామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల ముందు ఇదే ఫాల్కన్‌తో జరిగిన మ్యాచ్‌లో బక్డెన్ జట్టు కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: పాక్ క్రికెట్లో ముసలం.. బాధ్యతల నుంచి తప్పుకున్న యూనిస్ ఖాన్ -
నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్..
ఇండోర్: దేశవాళీ మహిళల క్రికెట్లో ముంబై జట్టు అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసింది. సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా ముంబై, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తయింది. తొలుత నాగాలాండ్ జట్టును 17 పరుగులకే ఆలౌట్ చేసిన ముంబై మహిళా జట్టు.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నాగాలాండ్ జట్టు.. ముంబై కెప్టెన్, మీడియం పేసర్ సయాలీ సత్ఘరె (8.4 ఓవర్లలో 7/5) ధాటికి 17.4 ఓవర్లలో 17 పరుగలకే చాపచుట్టేసింది. సయాలీ ధాటికి నాగాలాండ్‌కు చెందిన ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్‌ని నమోదు చేయలేకపోయారు. సయాలీకి తోడుగా దాక్షిణి (2/12), ఎస్. థాకోర్ (1/0) రాణించారు.అనంతర స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై కేవలం 4 బంతుల్లోనే విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ ఇషా ఓజా, వృషాలీ భగత్ వరుసగా మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదడంతో మరో 49.2 ఓవర్లు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సయాలికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. -
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లో ఉన్న వారంతా పడుకున్నారు..
ఆంటిగ్వా: విండీస్, శ్రీలంక జట్ల మధ్య సోమవారం జరిగిన మూడో వన్డేలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో హఠాత్తుగా తేనెటీగలు రంగప్రవేశం చేయడంతో గ్రౌండ్లో ఉన్న వారంతా నేలపై బోర్లా పడుకున్నారు. ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్38వ ఓవర్లో చోటు చేసుకుంది. విండీస్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ బౌలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది. ఇది గమనించిన ఆటగాళ్లు, అంపైర్లు వాటి నుంచి రక్షణ కోసం ఫీల్డ్‌పై పడుకున్నారు. కాసేపటికి తేనెటీగల గుంపు ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోవడంతో గ్రౌండ్లో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనుకోని ఈ పరిణామానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. Bee 🐝 attack in #WIvSri#INDvENGt20 #Cricket pic.twitter.com/KgA5as5myR — Cricket Scorecards (@MittiDaPutla) March 14, 2021 కాగా, మ్యాచ్ మధ్యలో తేనెటీగలు అంతరాయం కలిగించడం ఇదే తొలిసారేమీ కాదు. 2019 ప్రపంచకప్సందర్భంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా శ్రీలంక, విండీస్ జట్ల మధ్య తాజాగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ జట్టు 5 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. -
తొలి వన్డేలో టీమిండియా ఓటమి
లక్నో: 5 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు శుభారంభం లభించింది. లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక జట్టు 8 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మిథాలి రాజ్ (85 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్), వైస్ కెప్టెన్ హర్మాన్‌ప్రీత్‌కౌర్ (41 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత జట్టులో దీప్తి శర్మ (46 బంతుల్లో 27; 3 ఫోర్లు), మంధాన (20 బంతుల్లో 14; 3 ఫోర్లు), పూనమ్ రౌత్ (29 బంతుల్లో 10; ఫోర్)లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సఫారీ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (10-3-28-3) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు మ్లాబా(2/41), కాప్ (1/25), ఖాకా (1/29), కెప్టెన్ లస్ (1/23)లు రాణించారు. ఆనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు.. లిజెల్ లీ (122 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), వొల్‌వార్డ్డ్ (110 బంతుల్లో 80; 12 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో 40.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామికి (2/38) మాత్రమే వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 కీలకమైన వికెట్లు తీసుకున్న షబ్నిమ్ ఇస్మాయిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా (మార్చి 9) మంగళవారం జరుగనుంది. -
తొలి వన్డేలో టీమిండియా ఓటమి
-
వరుణుడే ఆడుకున్నాడు
వెస్టిండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ రౌండ్ ద వికెట్‌గా వచ్చి తొలి బంతిని వేయగా ఇంగ్లండ్ ఎడంచేతి వాటం ఓపెనర్ రోరీ బర్న్స్ దానిని సమర్థంగా డిఫెన్స్ ఆడాడు... దాదాపు నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఇలా మళ్లీ మొదలైంది. ప్రేక్షకుల చప్పట్లు, ఉత్సాహపు హోరు ఏమీ కనిపించకుండా ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తమ ఆటను మొదలు పెట్టేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన క్రికెట్‌ను వరుణుడు మాత్రం కరుణించలేదు. భయపడినట్లుగానే తొలి రోజు ఆటలో చాలా భాగం వర్షం బారిన పడింది. తొలి రోజు సంఘీభావం, సంతాపం మినహా రోజ్ బౌల్లో ఎలాంటి విశేషాలు లేకుండానే క్రికెట్ సాగింది. సౌతాంప్టన్: సీజన్‌కు తగినట్లుగానే ఇంగ్లండ్‌లో వాన తన ప్రతాపం చూపించడంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నిరాశాజనకంగా మొదలైంది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది. రెండో ఓవర్లోనే... సుమారు పది నెలల తర్వాత వెస్టిండీస్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న పేసర్ షెనాన్ గాబ్రియెల్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. అతను వేసిన నాలుగో బంతిని ఆడకుండా చేతులెత్తేసిన సిబ్లీ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత పదే పదే వచ్చిన అంతరాయాల మధ్య బర్న్స్, డెన్లీ జట్టు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత ఆగిన ఆట మళ్లీ మొదలు కాలేదు. మళ్లీ మళ్లీ... తొలి టెస్టు ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు. బ్రాడ్ అవుట్... ఇంగ్లండ్ తుది జట్టులో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు దక్కలేదు. సొంతగడ్డపై జరిగిన ఒక టెస్టులో బ్రాడ్ ఆడకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మోకాళ్లపై కూర్చోని... అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు. రూట్‌కు రెండో అబ్బాయి... ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్‌కు మరో బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా రూట్ అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య ప్రసవం కారణంగానే రూట్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ‘ఇంగ్లండ్ జట్టుకు బెస్టాఫ్ లక్. మేం మ్యాచ్ చూస్తూ మీకు మద్దతునిస్తాం’ అంటూ కొత్తగా పుట్టిన అబ్బాయి, తన పెద్ద కొడుకు ఆల్ఫ్రెడ్ విలియమ్‌తో కలిసి ఉన్న ఫోటోను అతను పోస్ట్ చేశాడు. విరామం అనంతరం రూట్ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టు కోసం అతను మాంచెస్టర్‌లో జట్టుతో కలుస్తాడు. రూట్ గైర్హాజరు కారణంగా తొలి టెస్టులో జట్టుకు స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున 81వ కెప్టెన్‌గా స్టోక్స్ నిలిచాడు. -
కివీస్‌తో రెండో వన్డేలో భారత్ ఓటమి
-
బంగ్లా బెబ్బులిలా...
డబ్లిన్: వర్షం వల్ల కుదించిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గర్జించింది. ఛేదనలో విజృంభించింది. 24 ఓవర్లలో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతిలో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. బంగ్లాదేశ్ కెరీర్లోనే తొలి ముక్కోణపు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు హోప్ (74; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంబ్రిస్ (69 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు 144 పరుగులు జోడించారు. విండీస్ స్కోరు 20.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 131 పరుగులతో ఉన్నపుడు వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గాక మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించారు. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 24 ఓవర్లలో 210 పరుగులుగా నిర్ణయించారు. సుమారు ఓవర్‌కు 9 పరుగులు చేయాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (41 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. తర్వాత క్రీజులోకి దిగిన ముష్ఫికర్ రహీమ్ (36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథున్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నంత సేపు వేగంగా ఆడారు. అనంతరం మహ్ముదుల్లా (19 నాటౌట్) అండతో మొసద్దిక్ హొస్సేన్ (24 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. 20 బంతుల్లో మెరుపు అర్ధసెంచరీ సాధించడంతో బంగ్లా 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి జయభేరి మోగించింది. -
హోప్ సెంచరీ వృథా: బంగ్లాదేశ్ చేతిలో విండీస్ ఓటమి
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లో వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన వన్డేలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్ షై హోప్ (109; 11 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో సెంచరీ చేశాడు. రోస్టన్ ఛేజ్ (51; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించాడు. బంగ్లా బౌలర్లలో మొర్తజా (3/49), సైఫుద్దీన్ (2/47) రాణించారు. అనంతరం తమీమ్ (80; 7 ఫోర్లు), సౌమ్య సర్కార్ (73; 9 ఫోర్లు, 1 సిక్స్), షకీబుల్ (61 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీల సాయంతో బంగ్లాదేశ్ 45 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది. -
ప్రపంచకప్ తర్వాత.... వన్డేలకు గేల్ గుడ్‌బై
జమైకా: ఈ ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రకటించాడు. 39 ఏళ్ల గేల్... 1999 సెప్టెంబరులో భారత్‌పై టొరంటోలో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన (2015 ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్ క్రికెటర్ గేల్ కావడం విశేషం. ఈ ఫార్మాట్లో బ్రియాన్ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన విండీస్ బ్యాట్స్‌మన్ గేలే. దాదాపు 20 ఏళ్ల కెరీర్ ఉన్నా... బోర్డుతో విభేదాలు, ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి టి20 లీగ్‌ల్లో పాల్గొంటూ సొంత జట్టుకు తక్కువగా ప్రాతినిధ్యం వహించాడు. పొట్టి ఫార్మాట్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అందరికీ ఇష్టుడయ్యాడు. 20వ శతాబ్దంలో అరంగేట్రం చేసి ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఇద్దరిలో గేల్ ఒకడు. మరొకరు పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్. -
విశాఖ సమరం సమం
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత్‌లో టి20 ప్రపంచకప్ సెమీఫైనల్. విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక మనదే విజయం అనుకున్నారంతా! కానీ, ఒత్తిడిని తట్టుకుని వెస్టిండీస్ భీకర హిట్టింగ్తో లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. ఆనాటి టి20 మ్యాచ్‌ను... వన్డే స్వరూపంలో ఆడిస్తే ఊహకు ఎలా ఉంటుందో అచ్చం అలాగే సాగింది బుధవారం నాటి విశాఖపట్నం మ్యాచ్. కాకపోతే నాడు అలవోక విజయం సాధించిన విండీస్... నేడు త్రుటిలో దానిని చేజార్చుకుని ‘టై’తో సంతృప్తి పడింది. ఛేదనలో తొలుత కొంత తడబడినా... హెట్‌మైర్ మెరుపులు, షై హోప్ నిలకడతో నిలిచిన పర్యాటక జట్టు అందివచ్చిన గెలుపును ఒడిసి పట్టలేకపోయింది. కోహ్లి 10వేల పరుగుల మైలురాయిని దాటిన ఈ మ్యాచ్‌లో భారత్ పరాజయాన్ని తప్పించుకుంది. సాక్షి, విశాఖపట్నం: పరాజయ పరంపర నుంచి వెస్టిండీస్‌కు ఉపశమనం. అయితే, అది గెలుపుతో మాత్రం కాదు! ‘టై’తో దక్కిన ఊరట. బుధవారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానంలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు పోరాడి ఓటమిని తప్పించుకుంది. శతకాల రారాజు, కెప్టెన్ విరాట్ కోహ్లి (129 బంతుల్లో 157 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) రికార్డుల వేటకు వేదికగా నిలిచిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. తెలుగు తేజం అంబటి రాయుడు (80 బంతుల్లో 73; 8 ఫోర్లు) అర్ధ శతకంతో సారథికి అండగా నిలిచాడు. ఛేదనలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ షై హోప్ (134 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌కు, యువ హెట్‌మైర్ (64 బంతుల్లో 94; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) విజృంభణ తోడవడంతో వెస్టిండీస్ దీటుగా బదులిచ్చింది. అయితే, చివర్లో తడబడి ఏడు వికెట్లకు 321 పరుగుల వద్ద ఆగిపోయింది. కుల్దీప్ (3/67) మూడు వికెట్లతో రాణించగా... షమీ, ఉమేశ్, చహల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. కెరీర్లో 37వ శతకం చేసిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండు జట్ల మధ్య మూడో వన్డే శనివారం పుణెలో జరుగుతుంది. వారిద్దరి సమన్వయం భారత ఇన్నింగ్స్ ఆసాంతం కోహ్లి, రాయుడు చుట్టూనే సాగింది. ఆడిన బంతులు (209), కలిపి చేసిన పరుగుల (230) గణాంకాల ప్రకారం చెప్పాలంటే 70 శాతం ఆటను వీరిద్దరే నడిపించారు. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ చేయడం ఎలానో చెబుతూ, స్కోరు బోర్డును నడిపించడం ఎలానో చూపుతూ జట్టుకు పరుగులందించింది ఈ జోడీ. దీనికిముందు టీమిండియాకు మరోసారి శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్ శతక వీరుడు రోహిత్ (4) నాలుగో ఓవర్లోనే వెనుదిరిగ్గా... ధావన్ (30 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు నిలిచాడు. చక్కటి షాట్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన అతడు నర్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే, కోహ్లి, రాయుడు బాధ్యతనంతటినీ భుజాన వేసుకున్నారు. ఓవైపు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, మరోవైపు రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటూపోయారు. వీలున్నప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో మెకాయ్ బౌలింగ్‌లో సింగిల్‌తో తొలుత కోహ్లి (56 బంతుల్లో), అనంతరం బౌండరీతో రాయుడు (61 బంతుల్లో) అర్ధశతకాలు అందుకున్నారు. ఇక్కడినుంచి జోరు చూపిన రాయుడు కోహ్లిని దాటుకుని చకచకా 70ల్లోకి వెళ్లిపోయాడు. కానీ, నర్స్ ఓవర్లో స్వీప్‌నకు యత్నించి బౌల్డయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్‌కు జత కలిసిన ధోని (20) ఓ సిక్స్ బాది అలరించాడు. కానీ, మెకాయ్ స్లో బంతి అతడి వికెట్లను పడగొట్టింది. రిషభ్ పంత్ (17) మెరుపులు మెరిపించలేకపోయాడు. ఈ రెండు వికెట్లు కోల్పోవడానికి మధ్యలోనే 90ల్లోకి వచ్చిన కోహ్లి... 44 ఓవర్లో శామ్యూల్స్ వేసిన బంతిని కవర్స్‌లో బౌండరీకి పంపి 37వ శతకాన్ని (106 బంతుల్లో) సాధించాడు. అంతకుముందు 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను విండీస్ కెప్టెన్ హోల్డర్ వదిలేశాడు. దానికి విండీస్ భారీ మూల్యమే చెల్లించు కుంది. జీవనదానం తర్వాత కోహ్లి మరో 113 పరుగులు చేయడం విశేషం. సెంచరీ తర్వాత చెలరేగి ఆడిన కోహ్లి మెకాయ్, రోచ్ల బౌలింగ్‌లో 9 బంతుల వ్యవధిలో మూడు సిక్స్‌లు, ఫోర్ సహా 32 పరుగులు పిండుకుని జట్టు స్కోరును 300 దాటించాడు. అయితే, 49వ ఓవర్లో మెకాయ్ ఐదు పరుగులే ఇచ్చి జడేజా (13) వికెట్ తీశాడు. ఆఖరి ఓవర్లో స్ట్రయికింగ్ తీసుకున్న కోహ్లి... స్వభావానికి భిన్నంగా స్కూప్ షాట్‌తో బౌండరీ కొట్టి ఆశ్చర్యపరిచాడు. అనంతరం 2 పరుగులతో 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. వెంటనే లాంగాన్ లో సిక్స్ కొట్టాడు. ‘హిట్’మైర్భయపెట్టాడు... ‘హోప్’ నిలిపాడు గత మ్యాచ్‌లో తాము విధించిన లక్ష్యానికి దాదాపు సమానమైన స్కోరును ఛేదించేందుకు దిగిన విండీస్‌కు ఓపెనర్లు కీరన్ పావెల్ (18), హేమ్రాజ్ (32, 6 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. అయితే షమీ... పావెల్‌ను ఔట్ చేసి ప్రమాదం తప్పించాడు. బౌండరీలతో దూకుడు మీదున్న హేమ్రాజ్, శామ్యూల్స్ (13)లను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. 78/3తో నిలిచి... చేతులెత్తేస్తుంద నుకున్న జట్టును హోప్, హెట్‌మైర్ మళ్లీ పోటీలో నిలిపారు. ముఖ్యంగా హెట్‌మైర్ ఎడాపెడా సిక్స్‌లు కొట్టాడు. తనకంటే ముందు దిగిన హోప్‌ను దాటిపోయి అర్ధశతకం (41 బంతుల్లో) పూర్తి చేశాడు. తర్వాత మరింత రెచ్చిపోయి చహల్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదాడు. హోప్ సైతం 64 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జోడీ జోరుతో విండీస్ 30వ ఓవర్లోనే 200 స్కోరు దాటింది. సాధించాల్సిన రన్‌రేట్ 5కు చేరిన నేపథ్యంలో ఆ జట్టు విజయం ఖాయం అనిపించింది. కానీ హెట్‌మైర్ భారీ షాట్‌కు ప్రయ త్నించి కవర్స్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. పావెల్‌ను కుల్దీప్ అవుట్ చేసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. హోప్ శతకం (113 బంతుల్లో) చేసి క్రీజులో ఉన్నా అనవసర పరుగుకు యత్నించి కెప్టెన్ హోల్డర్ (12) ఔటవ్వడం జట్టును మరింత ఇబ్బందుల్లో పడేసింది. చివరి మూడు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో 48, 49వ ఓవర్లలో చహల్ 2, షమీ 6 పరుగులు మాత్రమే ఇచ్చారు. చివరి ఓవర్లో ఉమేశ్ 13 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి విజయం కోసం 5 పరుగులు చేయాల్సి ఉండగా హోప్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టై అయ్యింది. ►2 భారత్, విండీస్ జట్ల మధ్య ‘టై’ అయిన మ్యాచ్‌ల సంఖ్య. తొలి ‘టై’ 1991లో డిసెంబరు 6న పెర్త్‌లో ముక్కోణపు సిరీస్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత భారత్... అనంతరం విండీస్ 121 పరుగులకు ఆలౌటయ్యాయి. -
జెమీమా మెరుపు ఇన్నింగ్స్
కొలంబో: ముందు బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో రెండో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా రెండో టి20 మ్యాచ్ రద్దయింది. ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్ సోమవారం జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసింది. శశికళ సిరివర్ధనే (32 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1సిక్స్), నీలాక్షి డిసిల్వా (20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు విఫలమయ్యారు. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి పొదుపుగా బౌలింగ్ చేసి 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకుంది. ఆమె ఓపెనర్ యశోద మెండిస్, శశికళ సిరివర్ధనేలను ఔట్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రెండు వికెట్లు తీయగా... పూనమ్, అనూజా పాటిల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. 132 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్లు మిథాలీ రాజ్ (13), స్మృతి మంధాన (6) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా... యువతార జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. వీరిద్దరు మూడు పరుగుల తేడాలో పెవిలియన్ చేరినా... వేద కృష్ణమూర్తి (11 నాటౌట్), అనూజా పాటిల్ (8 నాటౌట్) జాగ్రత్తగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. -
ఇంగ్లండ్‌పై పసికూన పంజా
పసికూన స్కాట్లాండ్ ఇంగ్లండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన ఏకైక వన్డేలో 6 పరుగుల తేడాతో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు కళ్లు చెదిరేరీతిలో శుభారంభాన్ని అందించారు. జాసన్ రాయ్(34), బెయిర్ స్టో(105; 59 బంతుల్లో 12ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. మార్క్ వాట్ బౌలింగ్‌లో జాసన్ రాయ్ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన అలెక్స్ హేల్స్(52) అర్థసెంచరీతో రాణించాడు. టాప్ ఆర్డర్ రాణించడంతో భారీ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తారనుకున్న తరుణంలో రూట్(29), కెప్టెన్ మోర్గాన్(20), బిల్లింగ్స్(12) వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో మొయిన్ అలీ(46), ప్లంకెట్(47) పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఇన్నింగ్స్ మొదట్లో ధారాళంగా పరుగులిచ్చిన స్కాట్లాండ్ బౌలర్లు, చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచి వరుసగా వికెట్లు సాధించారు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వ్యాట్ మూడు వికెట్లు సాధించగా.. ఎవాన్స్, బెరింగ్టన్ చెరో రెండు వికెట్లు తీయగా, షరీఫ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన స్కాట్లాండ్కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. బ్యాట్స్‌మెన్ మాథ్యూ క్రాస్ (48; 39 బంతుల్లో 10ఫోర్లు), కెప్టెన్ కైలే కోయెట్జర్ (58; 49బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగడంతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రషీద్ విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కామ్ మెక్లీడ్ (140 నాటౌట్; 94 బంతుల్లో 16ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ నమోదు చేశాడు. చివర్లో జార్జ్ మున్సే(55), బెరింగ్టన్(39) చెలరేగడంతో స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 371 పరుగుల భారీస్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, ప్లంకెట్ తలో రెండు వికెట్లు సాధించగా, మార్క్ వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్: పసికూన భారీ స్కోర్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక వన్డే మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్ 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకు నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన స్కాట్లాండ్కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. బ్యాట్స్‌మెన్ మాథ్యూ క్రాస్ (48; 39 బంతుల్లో 10ఫోర్లు), కెప్టెన్ కైలే కోయెట్జర్ (58; 49బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగడంతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు అయింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రషీద్ విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కామ్ మెక్లీడ్ (140 నాటౌట్; 94 బంతుల్లో 16ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ నమోదు చేశాడు. చివర్లో జార్జ్ మున్సే(55), బెరింగ్టన్(39) చెలరేగడంతో స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 371 పరుగుల భారీస్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, ప్లంకెట్ తలో రెండు వికెట్లు సాధించగా, మార్క్ వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
వీర విహారి
ధర్మశాల: దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీలో భారత్ ‘బి’ శుభారంభం చేసింది. ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి (76 బంతుల్లో 95 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో భారత్ ‘బి’ జట్టు 8 వికెట్లతో భారత్ ‘ఎ’పై నెగ్గింది. మొదట భారత్ ‘ఎ’ 41.2 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. ‘ఎ’ జట్టు స్కోరు 51/4 వద్ద ఉన్నపుడు వర్షంతో ఆటకు అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ‘ఎ’ జట్టులోనూ ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (107 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ధర్మేంద్ర సింగ్ జడేజా 4, ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ ‘బి’ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 175 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని ఆ జట్టు 26.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఈశ్వరన్ (43), కెప్టెన్ అయ్యర్ (28 నాటౌట్) మెరుగ్గా ఆడారు. నేడు జరిగే పోరులో భారత్ ‘బి’తో విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక జట్టు తలపడుతుంది. -
సెంచూరియన్‌లో నేడు చివరి వన్డే
-
ఆఖరి పంచ్ అదరాలి!
అయిదు లేదా అంతకంటే ఎక్కువ వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై ఓడించిన రెండో జట్టు భారత్ మాత్రమే....ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా సాధించిన ఘనతకు ఇదో నిదర్శనం. మూడు టెస్టులతో పాటు అయిదు వన్డేలు కలిపి ప్రొటీస్ తరఫున నమోదైనది ఒకే ఒక్క సెంచరీ. మన ఆటగాళ్లు చేసినవి అయిదు. ...రెండు జట్ల ప్రదర్శన మధ్య ఉన్న తేడాకు, భారత బ్యాట్స్‌మెన్ జోరుకు ఇదో సాక్ష్యం.ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో సఫారీల బ్యాటింగ్ సగటు 22.65. బౌలింగ్ సగటు 50.2. స్వదేశంలో వారికిదే దారుణ ప్రదర్శన....ప్రస్తుతం ప్రత్యర్థిపై భారత్ ఆధిపత్యం ఏ విధంగా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ...ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న కోహ్లి సేన చివరిదైన ఆరో వన్డేకు సమరోత్సాహంతో ఉంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న మన జట్టు మరోసారి దక్షిణాఫ్రికా పని పట్టేందుకు సిద్ధమవుతోంది. సెంచూరియన్ : భారత్‌కు పాతికేళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న సిరీస్ విజయం అయిదో వన్డేతో సాకారమైంది. పనిలో పనిగా రెండు జట్లలో ఐసీసీ వన్డే నంబర్ వన్ ర్యాంక్ ఎవరిదో తేలిపోయింది. అయినా... చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు స్వదేశంలో ఎన్నడూ లేనంతటి పరాభవాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా పరువు దక్కించుకునేందుకైనా విజయం సాధించాలని ఆశిస్తోంది. తద్వారా గణాంకాల్లో ఓటమి అంతరాన్ని తగ్గించుకుని... మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని కోరుకుంటోంది. అయితే... పరిస్థితులన్నీ ఆ జట్టుకు ప్రతికూలంగానే ఉన్నాయి. పైగా ఇదే వేదికపై రెండో వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. ఈ సమీకరణాల రీత్యా చూస్తే ప్రత్యర్థిని నిలువరించాలంటే ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేయాల్సిందే. మార్పులతో భారత్! రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షిస్తామని, అయినా పట్టు విడవకుండా ఆడి సిరీస్‌ను 5–1తో ముగించడమే లక్ష్యమని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టంగా ప్రకటించాడు. దీనిప్రకారం శుక్రవారం ఆరో వన్డేకు భారత్ మార్పులతో బరిలో దిగే అవకాశం ఉంది. లంక పర్యటన నుంచి మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ అలసిపోయిన పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చి మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్లను తుది జట్టులోకి తీసుకోవచ్చు. షమీ మూడేళ్లుగా ఆడింది మూడు వన్డేలే. శార్దూల్ది రెండు వన్డేల అనుభవమే. ఇద్దరు ప్రధాన పేసర్లను ఒకేసారి తప్పించడం ఇబ్బందని భావిస్తే మాత్రం ఒక్కరినే మార్చే ఆలోచన చేయొచ్చు. కుల్దీప్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంచుకోవచ్చు. బ్యాటింగ్‌లో మిడిలార్డర్ నుంచి ఇప్పటివరకు ఒక్కటే అర్ధశతకం (తొలి వన్డేలో రహానే) నమోదైంది. శ్రేయస్ అయ్యర్ మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. టాపార్డర్‌లో ఎవరో ఒకరు 35 ఓవర్లపైగా క్రీజులో ఉంటుండటంతో 4–7 స్థానాల మధ్య ఎవరూ రాణించకున్నా ప్రభావం కనిపించలేదు. అయిన్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా జట్టు యాజమాన్యం మిడిలార్డర్‌ను పరీక్షించే యోచనలో ఉంది. ఈ లెక్కల్లో మనీశ్‌పాండే, దినేశ్ కార్తీక్‌లలో ఎవరివైపు మొగ్గుచూపుతారు..? ఇద్దరినీ ఆడిస్తారా...? అన్నది చూడాలి. కోహ్లినే విశ్రాంతి తీసుకుంటాడని ఊహాగానాలు వస్తున్నా ఆచరణలోకి వస్తేగాని వాటిని విశ్వసించలేం. సఫారీలకు అంతా సవాలే... వచ్చే నెలలో ఆస్ట్రేలియా సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని టి20 సిరీస్‌కు సఫారీ జట్టు ప్రధాన బౌలింగ్ బలగాన్నంతటికీ విశ్రాంతినిచ్చింది. దీంతో మోర్కెల్, రబడ, ఇన్‌గిడి, తాహిర్‌లు ఈ వన్డేలోనైనా తమ ముద్ర చూపాల్సి ఉంది. ఫామ్‌లో ఉన్న భారత టాపార్డర్‌ను వీరు ఎంత తొందరగా పెవిలియన్‌కు పంపితే ఆ మేరకు జట్టు విజయావకాశాలు పెరుగుతాయి. ఓపెనర్లు కెప్టెన్ మార్క్రమ్, ఆపద్బాంధవుడు ఆమ్లా ఫర్వాలేకున్నా... డుమిని, డివిలియర్స్, మిల్లర్ గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నారు. అయిదో వన్డేలో డుమిని, ఏబీ కీలక సమయంలో విఫలమయ్యారు. వీరిలో ఇద్దరైనా భారీ స్కోర్లు చేస్తే చివర్లో మిల్లర్, ఫెలూక్వాయో స్కోరు పెంచేందుకు వీలుంటుంది. సెంచూరియన్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి షమ్సీతో పాటు తాహిర్నూ ఆడించవచ్చు. పేస్ ఆల్‌రౌండర్ మోరిస్‌ను తీసుకోదలిస్తే గత మ్యాచ్ తుది జట్టులోని ఒకరిని పక్కనపెడతారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రహానే/మనీశ్‌పాండే, అయ్యర్/దినేశ్ కార్తీక్, ధోని, పాండ్యా, కుల్దీప్/అక్షర్, చహల్, షమీ, బుమ్రా/శార్దూల్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, మిల్లర్, క్లాసెన్, ఫెలూక్వాయో/మోరిస్, తాహిర్, షమ్సీ, రబడ, మోర్కెల్. పిచ్, వాతావరణం సెంచూరియన్ పిచ్ భారత్‌లోని పిచ్‌ల తరహాలో ఉంటుంది. రెండో వన్డేలో 8 వికెట్లు నేలకూల్చి చహల్, కుల్దీప్ ఆతిథ్య జట్టును 118 పరుగులకే పరిమితం చేసిందిక్కడే. శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉంది. మైదానంలో మంచి డ్రైనేజీ వ్యవస్ధ ఉండటంతో మ్యాచ్‌కు ఎటువంటి ఇబ్బంది తలెత్తకపోవచ్చు. ►సా.గం. 4.30 నుంచి సోనీ–టెన్ 1, 3లలో ప్రత్యక్ష ప్రసారం -
అలా చేసినందుకు రబాడాకు జరిమానా
సాక్షి స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పాస్ట్ బౌలర్ కగిసో రబాడాకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. భారత్‌తో జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఔటైన సమయంలో అభ్యంతకరంగా సెండ్ ఆఫ్ సిగ్నల్స్‌కు ఇచ్చినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో జమైంది. ఇప్పటికే రబాడా డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. డీమెరిట్ పాయింట్లు 4కు చేరితే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రబాడా ఇప్పటికే ఒక టెస్టు మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు. 2019, ఫిబ్రవరి లోపు రబాడా డీమెరిట్ పాయింట్లు 8కి చేరితే రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం కానీ, ఒక టెస్టు లేదా రెండు వన్డేలు/టీ20 లేదా నాలుగు వన్డేలు/టీ20లు నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. రబాడా తన నేరాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు ఒప్పుకున్నాడు. ధావన్ ఔటైనపుడు రబాడా అతని వైపు చూస్తూ చేతులు ఊపుతూ పెవిలియన్ వెళ్లాలని చూపించినట్లు వీడియో ఉంది. -
స్టేడియంలో పరుగుల వరద పారనుంది..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం మరోసారి సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్ జట్టును నిలువరిస్తామంటున్నాడు శ్రీలంక కెప్టెన్ ఫెరీరా. సిరీస్ తొలి వన్డేలో పరాజయానికి ధీటుగానే సమధానమిచ్చిన కెప్టెన్ రోహిత్‌కు ఇక్కడి పిచ్‌పైన చక్కటి ట్రాక్ రికార్డే ఉంది. గతేడాది ఇక్కడే జరిగిన న్యూజిలాండ్ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌కే అనుకూలించేలా ఉన్న ఇక్కడ పిచ్‌పై రోహిత్ చెలరేగితే విశాఖ క్రీడాభిమానులకు పండుగే. అయితే విశాఖలో గడచిన ఏడాది జరిగిన టెస్ట్, వన్డే, టీ20 మ్యా చ్‌ల్లోనూ స్పిన్నర్లు ఆధిపత్యం చాటుకున్నా రు. అయితే ఈసారి అశ్విన్ లేకపోవడంతో అతని స్థానంలో చాహల్, కులదీప్ పాత్ర పోషించే అవకాశాలే మెండు. శనివారం భారత్ జట్టు తొలుత స్టేడియంలో వార్మప్ చేసుకుని అనంతరం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసుకుంది. దారులన్నీ స్టేడియంవైపే.. అసలే ఆదివారం. అందులో ఇండియా..శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్. టికెట్లనీ కేవలం మూడు రోజుల్లోనే ఆన్లైన్లో హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోయాయి. డాక్టర్ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఏసీఏవీడీసీఏ క్రికెట్ స్టేడియంలో డే అండ్ నైట్‌గా సాగే మ్యాచ్ ఒంటిగంటన్నరకు ప్రారంభం కానుండగా ఇరుజట్ల కెప్టెన్లు ఒంటిగంటకే టాస్కు వెళ్లనున్నారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో క్రికెట్ పండుగకు ఎటువంటి ఆటంకం లేదు. వికెట్‌ను సయితం ఆట ఆరంభానికి 24గంటల ముందుగానే గ్రీనిష్‌గా ఉంచడంతో స్టేడియంలో పరుగుల వరద పారనుంది. అయితే స్పిన్‌కు పిచ్ అనుకూలమనే సంకేతాలందుతున్నాయి. గట్టి భద్రత... డీసీపీ పకీరప్ప నేతృత్వంలోని పన్నెండు మంది ఏసీపీలతో సహా 763 మంది పోలీస్ సిబ్బందితో స్టేడియంలోనూ, బయట గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు హోటల్ నుంచి బయలు దేరి తిరిగి చేరేంత వరకు పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. సాయుధులైన పోలీసులు 54 మంది ఉండగా బాంబ్ స్క్వాడ్‌లే వంద వరకు ఉన్నాయి. భారత్ తరఫున... వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నా ప్రాక్టీస్‌కు రాకపోవడంతో ఆడతాడా అనేది సందేహమే. డ్రై అవుతూ స్పిన్‌కు అనుకూలంగా పిచ్ మారుతుండటంతో కులదీప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రోహిత్( కెప్టెన్), శిఖర్‌ధావన్, శ్రేయాస్, దినేష్, మనీష్, హార్దిక్, చాహల్, భువనేశ్వర్, బుమ్రా ఆడనున్నారు. స్టేడియంలోనే బెస్ట్ రికార్డు ఉన్న ధోని వికెట్ల వెనుక నిలవనున్నాడు. శ్రీలంక తరపున... తిరిమన్నే స్థానంలో సమరవిక్రమను తీసుకునే అవకాశాలుండగా వికెట్ల వెనుక డిక్ వెల్లా నిలవనున్నాడు. పెరీరా(కెప్టెన్), తరంగ, గుణరత్నే, పతిరాణా, లక్మల్, ధనుంజయ, ప్ర దీప్‌లతోపాటు రెండో వన్డేలో ప్రతిఘటించి సెంచరీ చేసిన మాథ్యూస్ ఆడనున్నారు. -
ఆసీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు
ముక్కోణపు వన్డే సిరీస్ బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఆదివారం ఆట మొదలు పెట్టిన 9 నిమిషాలకే భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. దీంతో ఇరు జట్ల ఖాతాలో చెరో 2 పాయింట్లు చేరాయి. ప్రస్తుతం 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉండగా... ఆసీస్ (11 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. వెస్టిండీస్ (8) పాయింట్లతో ఉంది. కరీబియన్లు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. -
శ్రీలంకదే సిరీస్
డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 136 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (128 బంతుల్లో 135; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ప్రసన్న (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. గుణతిలక (78 బంతుల్లో 63; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి పెరీరా తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించాడు. ఐర్లాండ్ బౌలర్లలో ముర్తాగ్ మూడు, మెకార్తీ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఐర్లాండ్ జట్టు 45 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. మెక్‌బ్రైన్ (64 బంతుల్లో 79; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
యోధుడికి వీడ్కోలు
చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మెకల్లమ్ ఇక టి20 లీగ్‌ల ద్వారా మాత్రమే అభిమానులకు వినోదం సాక్షి క్రీడావిభాగం యుద్ధానికి వెళుతున్నప్పుడు తన సైన్యం బలహీనంగా ఉందని తెలిస్తే రాజు ఏం చేయాలి..? ముందే వెళ్లి ప్రత్యర్థులు కోలుకోలేనంతగా వీరవిహారం చే యాలి. మిగిలిన సైన్యానికి పెద్దగా పని లేకుండానే గెలవాలి. న్యూజిలాండ్ కెప్టెన్ మెకల్లమ్ కూడా అంతే. సారథిగా తనకు ఎప్పుడూ ప్రపంచంలో ఉత్తమ జట్టు అనిపించుకునే ఆటగాళ్లు లేరు. అయినా ఒంటిచేత్తో న్యూజిలాండ్‌కు విజయాలు అందించాడు. ఆరంభంలో పది ఓవర్లలోనే వన్డే మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకుంటాడు. అదే అతడిని దిగ్గజాల సరసన చేర్చింది. మెకల్లమ్‌కు ముందు ఆటలో అనేక మంది గొప్ప బ్యాట్స్‌మెన్ ఉన్నారు. భవిష్యత్‌లోనూ అంతకు మించిన క్రికెటర్లు రావచ్చు. కానీ ఎంత మంది వచ్చినా మెకల్లమ్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఫ్లాట్ వికెట్లపై చెలరేగే ఎంతోమంది హిట్టర్స్... పచ్చటి పిచ్‌పై బంతిని ఆడటానికి భయపడే చోట మెకల్లమ్ విధ్వంసం సృష్టిస్తాడు. అదే అతని గొప్పతనం. తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ఈ న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ అదే చేసి చూపించాడు. పుష్కరకాలం పాటు బ్రేక్ లేకుండా... ప్రస్తుతం ఉన్న క్రికెట్ షెడ్యూల్లో ఏ ఆటగాడికీ వరుసగా అన్ని మ్యాచ్‌లూ ఆడటం సాధ్యం కాదు. అలాంటిది 12 సంవత్సరాల సుదీర్ఘ టెస్టు కెరీర్లో మెకల్లమ్ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. అరంగేట్రం నుంచి వరుసగా 101 టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి రిటైరయ్యాడు. టెస్టు కెరీర్లో 106 సిక్సర్లతో రికార్డు, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (54 బంతులు) రికార్డులు కెరీర్ చివరి టెస్టులో సాధించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక న్యూజిలాండ్ క్రికెటర్ కూడా మెకల్లమే. 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తర్వాత ఆరేళ్ల పాటు మెకల్లమ్ చాలా సాధారణ ఆటగాడు. 2008 తన కెరీర్‌ను మార్చేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్‌గా ప్రమోట్ కావడంతో కెరీర్లో తొలి వన్డే సెంచరీ సాధించాడు. ఇదే ఏడాది న్యూజిలాండ్‌కు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత తను వెనుదిరిగి చూడలేదు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు రెండు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు. లీగ్‌లలో చూస్తాం ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ద్వారా మెకల్లమ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. అయితే తను ఐపీఎల్‌తో సహా అనేక టి20 లీగ్‌లలో కనిపిస్తాడు. కాబట్టి మెకల్లమ్ మెరుపులను పూర్తిగా మిస్ కాలేదు. అయితే న్యూజిలాండ్ క్రికెట్‌కు తన సేవలు లేకపోవడం పెద్ద లోటు. తన సుదీర్ఘ కెరీర్లో ఆటలో ఎంత దూకుడు చూపించినా ప్రత్యర్థుల పట్ల మాత్రం చాలా స్నేహంగా వ్యవహరించాడు. ఏనాడూ ఏ ప్రత్యర్థినీ దూషించలేదు. కెప్టెన్‌గా చక్కటి క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాడు. అందుకే తనకు మైదానం బయట స్నేహితులు, గౌరవం ఎక్కువ. క్రికెట్ కుటుంబం డునెడిన్‌లో జన్మించిన మెకల్లమ్ ప్రస్తుత వయసు 34 సంవత్సరాలు. ఇంకా విధ్వం సకరంగా ఆడుతూ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. అయినా ఎందుకు రిటైరయ్యాడనేది పెద్ద ప్రశ్న. టి20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపికలోకి తనని పరిగణనలోకి తీసుకోకూడదని 3నెలల ముందే (గత డిసెంబరులో) రిటైర్మెంట్ నిర్ణయా న్ని ప్రకటించాడు. మెకల్లమ్ తండ్రి స్టువర్ట్ మెకల్లమ్ దేశవాళీ క్రికెట్ ఆడారు. తమ్ముడు నాథన్ మెకల్లమ్ కూడా బ్రెండన్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మెకల్లమ్ అంతర్జాతీయ కెరీర్ ఫార్మాట్ మ్యాచ్‌లు పరుగులు సెంచరీలు సగటు టెస్టులు 101 6453 12 38.64 వన్డేలు 260 6083 5 30.41 టి20లు 71 2140 2 35.66 సరైన సమయంలోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా. కెరీర్‌ను చాలా ఆస్వాదించా. కెప్టెన్‌గా జట్టులో మంచి సంస్కృతిని పెంచాను. నాతో కలిసి ఆడిన వాళ్లు, నా ఆటను చూసిన వాళ్లకు ఎప్పుడూ గుర్తుండిపోతానని అనుకుంటున్నాను. నా రిటైర్మెంట్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు చూపించిన గౌరవం చాలు... నేను సాధించిన దానితో తృప్తి చెందడానికి. చివరి మ్యాచ్, సిరీస్ ఓడిపోయి వైదొలగడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది. కానీ చాలా అనుభవాలతో సంతోషంగా వెళుతున్నాను. - మెకల్లమ్ -
రాణించిన రోహిత్, పాండే
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ శనివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధవన్(4), విరాట్ కోహ్లి(7) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రోహిత్ శర్మ-అజింక్యా రహానేల జోడీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. కాగా, రహానే(41) మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో టీమిండియా తడబడినట్లు కనిపించింది. అయితే రోహిత్ శర్మ (67; 82 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) , మనీష్ పాండే(58; 59 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో టీమిండియా గాడిలో పడింది. టీమిండియా మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించినా, ధోని(15), గుర్కీరత్ సింగ్ (6)లు నిరాశపరిచారు. చివరి వికెట్ గా అశ్విన్(4) పెవిలియన్ చేరడంతో టీమిండియా 49.1ఓవర్లలో 249 పరుగులకు పరిమితమైంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో డ్ర్యూ పోర్టర్ ఐదు వికెట్లతో ఆకట్టుకోగా, మూర్ హెడ్ కు రెండు, మూడీ, కానోర్లకు తలో వికెట్ లభించింది. -
సౌతాఫ్రికా 204 ఆలౌట్
సాక్షి, స్పోర్ట్స్: సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ల మధ్య సెన్వెస్ పార్క్ జరుగుతున్న రెండో వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా తరపున బెహర్డీన్ 70 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలువగా.. న్యూజిలాండ్ తరపున బ్రేస్‌వెల్ 3 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ ముందు 205 పరుగుల టార్గెను సౌతాఫ్రికా ఉంచింది. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
మిర్పూర్: భారత్‌తో గురువారం జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం బారిన పడిన టెస్టు తర్వాత ఇప్పుడు ఇరు జట్లు కొత్తగా కనిపిస్తున్నాయి. పలువురు ఆటగాళ్లతో పాటు కెప్టెన్లు కూడా మారారు. ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత భారత్ తొలిసారి వన్డే ఆడబోతుండగా... ఇటీవల పాక్‌ను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్ సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం (నేడు) ఇక్కడ తొలి మ్యాచ్ (డేనైట్) జరగనుంది. అయితే టెస్టులాగే ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటం ఊరటనిచ్చే విషయం. -
భారత విజయలక్ష్యం 215
స్కార్ బారోగ్: భారత్ మహిళలతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ ఆదిలో కాస్త దూకుడిగా ఆడినా 214 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ ఓపెనర్లలో ఎడ్వర్డ్స్ (108) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడింది. అనంతరం ఏ ఒక్కరూ నిలకడగా ఆడలేదు. తొలి వన్డేలో విఫలమైన భారత బౌలర్లు ఈ మ్యాచ్ లో రాణించారు. గైక్వాడ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీయగా, గోస్వామి మూడు వికెట్లతో ఆకట్టుకుంది.ప్రస్తుతం బ్యాటింగ్ దిగిన భారత జట్టు 10.4 ఓవర్లలో వికెట్టు నష్టానికి 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ పై ఓటమి చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఇంమూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ ను వరుణుడు ఎక్కిరించాడు. ఆ మ్యాచ్ లో పదే పదే వర్షం అంతరాయ కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ విజయం సాధించింది. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
స్కార్ బారాగ్: ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళలు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.తొలి వన్డేలో ఇంగ్లండ్ పై ఓటమి చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఎడ్వర్డ్స్, నైట్ లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ ను వరుణుడు ఎక్కిరించాడు. భారత మహిళలు పటిష్టమైన స్థితిలో ఉన్నా.. పదే పదే వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళలు విజయం సాధించి ఇంగ్లండ్ ను కంగుతినిపించిన సంగతి తెలిసిందే. -
భారత మహిళల ఓటమి
ఇంగ్లండ్‌తో తొలి వన్డే స్కార్బోరోగ్ (ఇంగ్లండ్): టెస్టు మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టును తొలి వన్డేలో ఇంగ్లండ్ నిలువరించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ 42 పరుగుల తేడాతో నెగ్గింది. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వర్షం రావడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ఓపెనర్ స్మృతి మందానా (99 బంతుల్లో 74; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సహాయంతో భారత్ 47 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 34; 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు మందానా 64 పరుగులు జోడించింది. నైట్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసిన సమయంలో వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించి 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్లు ఎడ్వర్డ్స్ (64 బంతుల్లో 57; 9 ఫోర్లు), నైట్ (71 బంతుల్లో 53; 6 ఫోర్లు) జోరుతో 30.1 ఓవర్లలో ఇంగ్లండ్ మూడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ సమయంలో మళ్లీ భారీవర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ 30.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోతే 112 పరుగులు చేస్తే గెలిచినట్లు. అప్పటికే 153 పరుగులు చేసినందున... 42 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. -
వయసు...8 వికెట్లు...6
హెచ్‌సీఏ లీగ్‌లో బుడతడి సంచలనం సాక్షి, హైదరాబాద్: ఆ పిల్లాడి వయసు 8 ఏళ్లు... గత మూడేళ్లుగా క్రికెట్ నేర్చుకుంటున్నాడు. తొలి సారి పోటీ క్రికెట్ బరిలోకి దిగాడు. మొదటి వన్డే మ్యాచ్‌లోనే తన లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును చిత్తు చేశాడు. 12.3 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 మెయిడిన్లు కూడా ఉన్నాయి. (లీగ్స్ నిబంధనల ప్రకారం వన్డే మొత్తం ఓవర్లలో ఒక బౌలర్ మూడో వంతు ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు). హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లీగ్స్‌లో పట్టపు రాఘవ అనే చిన్నారి సంచలన ప్రదర్శన ఇది. వివరాల్లోకెళితే...హెచ్‌సీఏ లీగ్స్‌లో భాగంగా ఆదివారం చమ్స్ ఎలెవన్, హైదరాబాద్ వాండరర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చమ్స్ ఎలెవన్ బౌలర్ రాఘవ (6/21) ధాటికి వాండరర్స్ 34.3 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. అనంతరం చమ్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 85 పరుగులు చేసి విజయాన్నందుకుంది. హెచ్‌సీఏ లీగ్ చరిత్రలో పిన్న వయస్కుడైన క్రికెటర్ (8 ఏళ్ల 3 నెలలు)గా రాఘవ రికార్డు సృష్టించాడు. మాజీ ఆటగాడు ఎస్ఆర్ సురేశ్ వద్ద అతను శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నారాయణగూడలోని శ్రీ ఇంటర్నేషనల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న రాఘవకు కరాటేలోనూ మంచి నైపుణ్యం ఉంది. అండర్-9 కేటగిరీలో అతను అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. -
50-50 ఒక్కసారే...
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి వైజాగ్ అభిమానులకు పూర్తి ఓవర్ల వన్డే మ్యాచ్‌ను ఆస్వాదించే అవకాశం పెద్దగా దక్కడం లేదు. వర్షంతో విరామం... స్లో ఓవర్ రేట్... ముందే లక్ష్యం పూర్తి... ఇలా కారణమేదైనా వైజాగ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లలో ఒక్కసారి మినహా (ఆస్ట్రేలియా-కెన్యా) ఇరు జట్లు చెరో 50 ఓవర్లు పూర్తిగా ఆడలేదు. నగరంలో ఇప్పటి వరకు 9 వన్డే మ్యాచ్‌లు జరగ్గా... 8 మ్యాచ్‌లు ముందే ముగిశాయి. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో గతంలో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియాతో 2010లో జరిగిన మ్యాచ్‌లో 7 బంతులు... విండీస్‌తో 2011 లో జరిగిన మ్యాచ్‌లో 11 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యం ఛేదించింది. అంతకుముందు 2007లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు. ధోని ధమాకా చూపించిన 2005 వన్డేలో పాకిస్థాన్ 23 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయింది. కొత్త స్టేడియం నిర్మించకముందు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో ఐదు వన్డే మ్యాచ్‌లు నిర్వహించారు. వీటిలో ఆసీస్, కెన్యా వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే ఇరుజట్లు పూర్తిగా 50-50 ఓవర్లు ఆడాయి. 1988లో భారత్‌తో ఆడుతూ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 22 బంతుల ముందే ముగిసింది. 1999లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు ఓవర్ల జరిమానా విధించడంతో పాకిస్థాన్ 48 ఓవర్లకే ఆడాల్సి వచ్చింది. వాతావరణం సరిగా లేకపోవడంతో 2001లో భారత్, ఆసీస్ మ్యాచ్‌ను 45 ఓవర్లకే కుదించి నిర్వహించారు. వీటన్నింటికీ భిన్నమైన ఘటన 1994 భారత్, వెస్టిండీస్ మ్యాచ్ సందర్బంగా జరిగింది. వెస్టిండీస్ జట్టు కిట్‌ను పొరపాటున వైజాగ్‌కు కాకుండా చెన్నైకి పంపిం చారు. అది వచ్చేసరికి ఆలస్యమైంది. దాంతో మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించారు. ఇందులోనూ... విండీస్ స్లో ఓవర్ రేట్‌తో 43 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. హోటల్లో ధోని ‘ప్రాక్టీస్’... వైజాగ్ చేరాక వాతావరణం చూడగానే శనివారం ప్రాక్టీస్ ఉండదని భారత కెప్టెన్ ధోనికి అర్థమైనట్లుంది. అందుకే ప్రాక్టీస్ లేకపోతేనేం... ప్లే స్టేషన్ ఉంది కదా అని ట్వీట్ చేస్తూ వీడియో గేమ్స్ ఆడేందుకు సిద్ధమైపోయాడు. శనివారం గేమ్స్‌తో టైమ్‌పాస్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్లో వాటి గురించి చర్చిస్తూ ధోని గడిపాడు. చాలా రోజుల తర్వాత గేమ్ ఆడుతున్నానని చెప్పిన ధోని, తాను ఇష్టపడే క్యాండీ రష్ గేమ్‌లో స్కోరు కూడా వెల్లడించాడు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్
కొచ్చి : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కొచ్చిలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటింగ్ బలానికి... కరీబియన్ ఆల్‌రౌండర్ల జోరుకు వన్డే సిరీస్ వేదిక కానుంది. సచిన్ టెండూల్కర్ ‘ఫేర్వెల్ టెస్టు సిరీస్’ను క్లీన్‌స్వీప్ చేసిన ధోనిసేన వన్డేలలోనూ అదే ఆధిపత్యాన్ని కనబర్చాలని భావిస్తుండగా... పోయిన పరువును కొంతైనా కాపాడుకోవాలని బ్రేవో సేన ప్రయత్నిస్తోంది. జట్లు: భారత్: ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, ఎస్ ధావన్, ఆర్ఏ జడేజా, విరాట్ కోహ్లి, బి కుమార్, ఏ మిశ్రా, మహ్మద్ షమీ, ఎస్కె రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, ఆర్జీ శర్మ, ఉనాద్కట్, ఆర్ వినయ్ కుమార్, యువరాజ్ సింగ్ వెస్టిండీస్: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), గేల్, చార్లెస్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, దేవ్‌నారాయణ్, సిమ్మన్స్, స్యామీ, నరైన్, రాంపాల్, హోల్డర్.