
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో రియాన్ బర్ల్ వికెట్ పడగొట్టిన స్టార్క్.. తన వన్డే కెరీర్‌లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను స్టార్క్ తన పేరిట లిఖించుకున్నాడు.
కాగా అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజాగా స్టార్క్ కేవలం 102 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్లు పడగొట్టి ముస్తాక్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టాప్‌లో స్టార్క్ ఉండగా.. రెండు మూడు స్ధానాల్లో వరుసగా సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు), ఆసీస్ దిగ్గజం బ్రెట్‌లీ(112 మ్యాచ్‌లు) ఉన్నారు.
అదే విధంగా వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్‌గా కూడా స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది.
చదవండి: Aus Vs Zim 3rd ODI: సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వే.. సంచలన విజయం
Comments
Please login to add a commentAdd a comment