శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌! | Mitchell Starc a doubt for Australias match against Sri Lanka | Sakshi
Sakshi News home page

SL VS AUS: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌!

Published Thu, Oct 28 2021 2:38 PM | Last Updated on Thu, Oct 28 2021 6:44 PM

Mitchell Starc a doubt for Australias match against Sri Lanka - Sakshi

Mitchell Starc a doubt for Australias match against Sri Lanka: టీ20 ప్రపంచకప్‌2021 సూపర్‌-12లో భాగంగా నేడు దుబాయ్‌ వేదికగా  శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌  మిచెల్ స్టార్క్  గాయం కారణంగా దూరమయ్యే అవకాశం ఉంది. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ చేస్తుండగా స్టార్క్ కాలికి గాయమైంది. అయితే అతడిని వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

దీంతో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు స్టార్క్‌ అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. ఒక వేళ మ్యాచ్‌కు ముందు  స్టార్క్‌  ఫిట్‌నెష్‌ సాధించకపోతే  అతడి స్ధానంలో కేన్ రిచర్డ్సన్ లేక అష్టన్ అగర్‌కు అవకాశం దక్కనుంది. కాగా తమ మెదటి మ్యాచ్‌లోనే విజయం సాధించిన కంగారులు.. హాట్‌ ఫేవరెట్‌గా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు.

చదవండి: కోహ్లి అలా మాట్లడతాడని అనుకోలేదు.. నిరాశ చెందాను: టీమిండియా మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement