
స్వదేశంలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌లకు ఆ జట్టు స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా సీనియర్ స్పిన్నర్ ఆడమ్ జంపా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక శ్రీలంక పర్యటనలో ఆసీస్ జట్టులో భాగమైన పలువురి ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది.
మిచెల్ స్వెప్సన్, జోష్ ఇంగ్లిస్, ఝే రిచర్డ్‌సన్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్‌లకు జట్టులో చోటు దక్కలేదు. ఇక రెండు సిరీస్‌లు నార్త్ క్వీన్స్‌లాండ్‌లో జరగనున్నాయి. ఆగస్టు 28న జింబాబ్వేతో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 6న న్యూజిలాండ్‌తో సిరీస్ మొదలుకానుంది.
జింబాబ్వే, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లకు ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జాంపా
Rate this Aussie ODI squad out of 10 pic.twitter.com/LRJpqFL9M6
— cricket.com.au (@cricketcomau) July 18, 2022
చదవండి: IND vs WI: టీమిండియాతో సిరీస్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..!