ఈ ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ మూడు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే ఆల్ ఫార్మాట్ టూర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును శుక్రవారం ప్రకటించింది. ఆ జట్టు స్టార్ బౌలర్, టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు శ్రీలంకతో టీ20 సీరీస్‌కు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మరో వైపు టెస్టు జట్టులో ఓపెనర్ మార్కస్ హారిస్, పేసర్ మార్క్ స్టెకెటీకి చోటు దక్కలేదు.
అదే విధంగా మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు పరిమిత ఓవర్ల జట్టులోకి తిరిగి రావడంతో ఆసీస్ చాలా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే పాక్ పర్యటనలో అద్భుతంగా రాణించిన బెన్ మెక్‌డెర్మాట్‌కు పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక కొలంబో వేదికగా జూన్ 7న శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరగనుంది.
ఆస్ట్రేలియా టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వీప్సన్, డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోనినిస్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్
చదవండి: IPL 2022: ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ 11 ప్రకటించిన కైఫ్.. రైనాకు చోటు..!
Comments
Please login to add a commentAdd a comment