Australia Provisional Squad For ODI World Cup 2023; Pat Cummins To Lead - Sakshi
Sakshi News home page

World Cup 2023: ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్‌ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ

Published Mon, Aug 7 2023 10:50 AM | Last Updated on Mon, Aug 7 2023 1:35 PM

Australia name preliminary 2023 World Cup squad - Sakshi

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కోసం ఆస్ట్రేలియా తమ సన్నాహాకాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌కు 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ(ప్రాథమిక) జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్‌ కమ్మిన్స్‌ సారధ్యం వహించనున్నాడు. ఇదే జట్టు ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా, భారత పర్యటనలకు వెళ్లనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

ఈ జట్టులో స్టార్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌కు చోటు దక్కక పోవడం గమానార్హం. అదే విధంగా యువ ఆల్‌రౌండర్‌ ఆరోన్ హార్డీ,స్పిన్నర్‌ తన్వీర్‌ సంగాకు తొలిసారి  ఆసీస్‌ జట్టులో చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న వీరిద్దరని వరల్డ్‌కప్‌ ప్రిలిమనరీ జట్టులో సెలక్టర్లు భాగం చేశారు. కాగా వన్డే ప్రపంచకప్‌కు ముందు కంగారు జట్టు 8 వన్డేలు ఆడనుంది.

తొలుత దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనున్న ఆస్ట్రేలియా.. అనంతరం టీమిండియాతో మూడు వన్డేలు ఆడనుంది. . సెప్టెంబర్‌ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత్‌-ఆసీస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది.  కాగా ప్రపంచకప్‌లో భాగమయ్యే జట్లు తమ 15 మంది సభ్యుల వివరాలను సెప్టెంబర్‌5 లోపు ఐసీసీకి సమర్పించాలి.  ఈ నేపథ్యంలో ప్రోటీస్‌ పర్యటనకు వెళ్లే ముందు ఆసీస్‌ 15 మంది సభ్యులను ఖారారు చేసే అవకాశం ఉంది. ఇక ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న టీమిండియాతో తలపడనుంది.

వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు :  పాట్ కమిన్స్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా , ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్.
చదవండి: IND vs WI: ఏంటి బ్రో ఆట మర్చిపోయావా..? ఐపీఎల్‌లోనే ఆడుతాడు! అక్కడ పనికిరాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement