CWC 2023 Final: వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేతగా ఆస్ట్రేలియా.. | CWC 2023 Final Ind vs Aus: Live Updates Toss Playing XIs Highlights | Sakshi
Sakshi News home page

CWC 2023 Final Ind Vs Aus Highlights: వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేతగా ఆస్ట్రేలియా..

Published Sun, Nov 19 2023 1:16 PM | Last Updated on Sun, Nov 19 2023 11:01 PM

CWC 2023 Final Ind vs Aus: Live Updates Toss Playing XIs Highlights - Sakshi

ICC Cricket World Cup 2023- India vs Australia, Final Updates: 

వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేతగా ఆస్ట్రేలియా.. 
12 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌ గెలవాలని కలలు కన్న భారత జట్టుకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచింది.

ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్‌ హెడ్‌ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్‌ హెడ్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్‌ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్‌ లబుషేన్‌(57) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తీవ్ర నిరాశపరిచింది.  నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 47 పరుగులు చేయగా.. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(4) పూర్తిగా నిరాశపరిచాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(54), కేఎల్‌ రాహుల్‌(66) అర్ధ శతకాలతో రాణించారు. మిగతా వాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 4, రవీంద్ర జడేజా 9, సూర్యకుమార్‌యాదవ్‌ 18, మహ్మద్‌ షమీ 6, జస్‌ప్రీత్‌ బుమ్రా 1, కుల్దీప్‌ యాదవ్‌(10- రనౌట్‌), మహ్మద్‌ సిరాజ్‌ 9 పరుగులు చేశారు.
37 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 204/3
37 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 204/3. ఆసీస్‌ విజయానికి ఇంకా 37 పరుగులు కావాలి.

ట్రావిస్‌ హెడ్‌ సెంచరీ..
టీమిండియాతో జరుగుతున్న ఫైనల్లో ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 95 బంతుల్లోనే 14 ఫోర్లు, 1 సిక్స్‌తో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

29 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 165 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్‌ హెడ్‌(85), లబుషేన్‌(36) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఆసీస్‌ విజయానికి 76 పరుగులు కావాలి.

26 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 27 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆసీస్‌ విజయానికి ఇంకా 94 పరుగులు కావాలి.

24 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 127/3

అర్ధ శతకం పూర్తి చేసుకున్న హెడ్‌
21.2: కుల్దీప్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రవిస్‌ హెడ్‌. స్కోరు: 117-3(22)

21 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు:  110-3
హెడ్‌ 49, లబుషేన్‌ 18 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు. 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

19.1: సెంచరీ కొట్టిన ఆస్ట్రేలియా

హాఫ్‌ సెంచరీ దిశగా హెడ్‌
హెడ్‌ 40, లబుషేన్‌ 10 పరుగులతో  ఆడుతున్నారు. స్కోరు: 93/3 (17)

15 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 78/3
హెడ్‌ 28, లబుషేన్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 33 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

 పొదుపుగా బౌలింగ్‌ చేసిన జడ్డూ, కుల్దీప్‌
13, 14 ఓవర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశారు. జడ్డూ రెండు పరుగులు మాత్రమే ఇస్తే.. కుల్దీప్‌ 4 రన్స్‌ ఇచ్చాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ స్కోరు: 74-3

పవర్‌ ప్లేలో ఆసీస్‌ స్కోరు: 60/3 (10)
హెడ్‌ 19, లబుషేన్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బుమ్‌ బుమ్‌ బుమ్రా
241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన స్మిత్‌ను బుమ్రా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు.  8 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 47/3

బుమ్‌ బుమ్‌ బుమ్రా.. మార్ష్‌
41 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మిచెల్‌ మార్ష్‌.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి స్టీవ్‌ స్మిత్‌ వచ్చాడు.

3 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు:29/1


సూపర్‌ షమీ
1.1: షమీ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌(7) అవుట్‌. తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా. మిచెల్‌ మార్ష్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు:  17/1 (1.2)

►తొలి ఓవర్లో ఆసీస్‌ స్కోరు: 15
ఆసీస్‌ ఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌, వార్నర్‌ దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు.

ఆసీస్‌ లక్ష్యం 241
ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 47 పరుగులు చేయగా.. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(4) పూర్తిగా నిరాశపరిచాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(54), కేఎల్‌ రాహుల్‌(66) అర్ధ శతకాలతో రాణించారు. మిగతా వాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 4, రవీంద్ర జడేజా 9, సూర్యకుమార్‌యాదవ్‌ 18, మహ్మద్‌ షమీ 6, జస్‌ప్రీత్‌ బుమ్రా 1, కుల్దీప్‌ యాదవ్‌(10- రనౌట్‌), మహ్మద్‌ సిరాజ్‌ 9 పరుగులు చేశారు.

ఆసీస్‌ బౌలర్లలో పేసర్లు మిచెల్‌ స్టార్క్‌ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. జోష్‌ హాజిల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఆడం జంపా తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

 ►49.2: ఫోర్‌ బాదిన సిరాజ్‌

49 ఓవర్లలో టీమిండియా స్కోరు: 232/9
సిరాజ్‌ 3, కుల్దీప్‌ యాదవ్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

47.3: తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌ అవుటయ్యాడు. దీంతో భారత్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 227/9 (48)

ఎనిమిదో వికెట్‌ డౌన్‌..
214 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో బుమ్రా ఎల్బీగా వెనుదిరిగాడు. 46 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 221/8

షమీ రూపంలో ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
43.4: స్టార్క్‌ బౌలింగ్‌లో ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి షమీ(6) అవుటయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. సూర్య 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

43 ఓవర్లలో స్కోరు: 211/6
41.3: స్టార్క్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ వెనుదిరిగాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ ఔటయ్యాడు. మహ్మద్‌ షమీ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 207/6 (42).

200 పరుగుల మార్కు అందుకున్న టీమిండియా
41 ఓవర్లలో టీమిండియా 200 పరుగులు పూర్తి చేసుకుంది. రాహుల్‌ 66, సూర్య 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

స్లోగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్‌.. 40 ఓవర్లు ముగిసే సరికి స్కోరు: 197/5

సూర్యకు తొలి బౌండరీ
38.6: జంపా బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన సూర్యకుమార్‌ యాదవ్‌. స్కోరు: 192/5 (39). 61 పరుగులతో నిలకడగా ఆడుతున్న రాహుల్‌.

 ►37వ ఓవర్లో కేవలం ఒక్క రన్‌ ఇచ్చిన మాక్స్‌వెల్‌

జడ్డూ అవుట్‌
35.5: హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగిన జడేజా(9).. దీంతో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు:  178-5
35.1: మిస్‌ఫీల్డ్‌ కారణంగా టీమిండియాకు రెండు పరుగులు


రాహుల్‌ హాఫ్‌ సెంచరీ
34.5: స్టార్క్‌ బౌలింగ్లో సింగిల్‌ తీసి 50 పరుగుల మార్కు అందుకున్న కేఎల్‌ రాహుల్‌. స్కోరు: 173/4 (35)

అర్ధ శతకానికి చేరువైన రాహుల్‌
రాహుల్‌ 47, జడేజా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 165/4 (33)

32.1: ఆచితూచి ఆడుతున్న రాహుల్‌, జడ్డూ
కట్టుదిట్టంగా ఆసీస్‌ బౌలింగ్‌.. కష్టపడుతున్న బ్యాటర్లు
టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమవుతోంది. 31 ఓవర్లలో భారత్‌ స్కోరు: 158/4

30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 152/4 (30)
నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
28.3:
కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన కోహ్లి. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 149/4 (29).
►28 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 53, రాహుల్‌ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 146/3

టీమిండియా స్కోరు: 142/3 (27)
26.2: మాక్సీ బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన రాహుల్‌
కోహ్లి అర్ధ శతకం
25.1: జంపా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి అర్థ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.

హాఫ్‌ సెంచరీకి చేరువైన కోహ్లి
24 ఓవర్లలో టీమిండియా స్కోరు: 128/3

 ఆచితూచి ఆడుతున్న కోహ్లి, రాహుల్‌.. స్కోరు:125/3 (23)
కోహ్లి 45, రాహుల్‌ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

22 ఓవర్లలో టీమిండియా స్కోరు:121/3
►19.1: మార్ష్‌తో బౌలింగ్‌ వేయిస్తున్న కమిన్స్‌. స్కోరు: 115/3 (20)

పరుగులకు అవకాశమివ్వని ఆసీస్‌
కమిన్స్‌ 17, మాక్స్‌వెల్‌ 18 ఓవర్లో చెరో మూడు పరుగులు మాత్రమే ఇచ్చారు. స్కోరు: 107-3(18)

సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా
కోహ్లి 34, రాహుల్‌ 10 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 101-3

15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 97/3
కోహ్లి 32, రాహుల్‌ 8 పరుగులతో ఉన్నారు.

  కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న ఆసీస్‌
12 ఓవర్లో ఆసీస్‌ స్పిన్నర్‌ జంపా కేవలం ఐదు పరుగులు ఇవ్వగా.. 13వ ఓవర్లో కమిన్స్‌ మూడు రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. స్కోరు89-3(13). కోహ్లి 27, రాహుల్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
10.2: కమిన్స్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(4) అవుటయ్యాడు. వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కేఎల్‌ రాహుల్‌ క్రీజులోకి వచ్చాడు. భారత్‌ స్కోరు: 82/3 (11)

►పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 80-2
కోహ్లి 23, అయ్యర్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రోహిత్‌ శర్మ అవుట్‌
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఆది నుంచి దూకుడుగా ఆడుతున్న హిట్‌మ్యాన్‌ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పదో ఓవర్‌ నాలుగో బంతికి మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో హెడ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు.
►9.3: బౌండరీ బాదిన రోహిత్‌
►9.2: మాక్సీ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన రోహిత్‌
నిలకడగా ఆడుతున్న కోహ్లి, రోహిత్‌.. టీమిండియా స్కోరు: 66/1 (9)

8 ఓవర్లలో టీమిండియా స్కోరు: 61/1
కోహ్లి 21, రోహిత్‌ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.
 

వరుసగా మూడు ఫోర్లు బాదిన కోహ్లి
ఏడో ఓవర్‌లో స్టార్క్‌ బౌలింగ్‌లో మూడు బంతుల్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన కోహ్లి. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా- స్కోరు: 54/1 (7)

6 ఓవర్లలో టీమిండియా స్కోరు: 40/1
కోహ్లి 3 ,రోహిత్‌ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ డౌన్‌.. గిల్‌ ఔట్‌
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు. 5 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 37/1. క్రీజులొ రోహిత్‌ శర్మ(31), విరాట్‌ కోహ్లి(1) పరుగుతో ఉన్నారు.

4 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 30/0
4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన హిట్టింగ్‌ను మొదలపెట్టాడు. 4 ఓవర్‌ వేసిన హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది బౌలర్‌ను ఒత్తడిలోకి నెట్టాడు.

3 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు:18/0
2.1 స్టార్క్‌ బౌలింగ్‌: స్లిప్‌ తప్పిదంతో బతికిపోయిన గిల్‌. 

2 ఓవర్లలో టీమిండియా స్కోరు: 13/0
రోహిత్‌ 13, గిల్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
►1.3: రోహిత్‌కు మరో బౌండరీ
►1.2: హాజిల్‌వుడ్‌ బౌలింగ్లో ఫోర్‌ బాదిన రోహిత్‌

తొలి ఓవర్లో టీమిండియాకు 3 పరుగులు
►0.1: తొలి బంతికే ఎల్బీకి అప్పీలు చేసిన స్టార్క్‌.. రోహిత్‌ సేఫ్‌

► టీమిండియా- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో ఆడిన జట్లతోనే టైటిల్‌ సమరంలో పోటీపడనున్నాయి. కాగా రోహిత్‌ సేన న్యూజిలాండ్‌ను.. ప్యాట్‌ కమిన్స్‌ బృందం సౌతాఫ్రికాను ఓడించి తుది పోరుకు అర్హత సాధించాయి.

కమిన్స్‌ ఇలా.. రోహిత్‌ అలా
టాస్‌ సందర్భంగా ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్‌ చేయాలనుకుంటున్నాం. వికెట్‌ పొడిగా కనిపిస్తోంది. ఈ పిచ్‌పై డ్యూ(తేమ) ఎలాంటి పాత్ర పోషిస్తుందనేదే కీలకం. బ్యాటింగ్‌ సాగుతున్న కొద్ది వికెట్‌ మెరుగ్గా మారుతుంది. టోర్నీ ఆరంభంలో ఓటములు ఎదురైనా కోలుకుని.. మేము పూర్తి స్థాయిలో మ్యాచ్‌కు సిద్ధమయ్యాం’’ అని తెలిపాడు. ఇక రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. తాము టాస్‌ గెలిస్తే తొలుత బ్యాటింగ్‌ చేయాలనే భావించామని పేర్కొన్నాడు.

తుదిజట్లు
ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్స్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement