ఆస్ట్రేలియా స్టార్ పేసర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా కింగ్‌స్టౌన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
తొలుత 18వ ఓవర్ వేసిన కమ్మిన్స్ ఆఖరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 20 ఓవర్ వేసిన కమ్మిన్స్.. వరుస బంతుల్లోకరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతకముందు ఇదే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలోనే రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. అదేవిధంగా మరో కొన్ని రికార్డులను కూడా కమ్మిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కమ్మిన్స్ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.
అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాతో లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌతీ (న్యూజిలాండ్), మార్క్ పావ్లోవిక్ (సెర్బియా), వసీం అబ్బాస్ (మాల్టా), పాట్ కమ్మిన్స్ (ఆసీస్) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment