టీ20 వరల్డ్‌కప్-2024లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సూపర్-8 మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో తమ సెమీస్ ఆశలను అఫ్గానిస్తాన్ సజీవంగా ఉంచుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్ బౌలర్ల దాటికి 127 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో క్రీజులో మాక్స్‌వెల్ ఉన్నప్పుడు ఆసీస్‌దే విజయమని అంతా భావించారు.
కానీ అఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్.. మాక్సీని ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నైబ్ తన 4 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. నైబ్‌తో పాటు నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్‌వెల్(59) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్(51) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా రెండు, స్టోయినిష్ ఒక్క వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment