Gulbadin Naib
-
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్-2024ను ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఘనంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం సాల్ట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం షేక్ జాయెద్ స్టేడియంలో అజ్మాన్ బోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు.80 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా అజ్మాన్ బోల్ట్స్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్‌ను ఓ ఆటఆడేసుకున్నాడు. అతడి వేసిన 5వ ఓవర్లో సాల్ట్.. 5 సిక్స్‌లు, ఓ ఫోరుతో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతులను మిడ్-వికెట్ మీదగా సిక్సర్లగా మలిచిన సాల్ట్.. ఆ తర్వాత మూడో బంతిని బౌండరీకి తరలించాడు.అనంతరం ఆఖరి మూడు బంతులను రెండు లాంగ్-ఆన్, లాంగ్-ఆఫ్ మీదగా సిక్స్‌లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా టీమ్ అబుదాబి లక్ష్యాన్ని కేవలం 5.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి చేధించింది.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు Salt makes it spicy! 🌶️🥵The swashbuckling English opener smacked 34 runs in an over and finished with 53* (19) leading Team Abu Dhabi to a thumping win in the #AbuDhabiT10 opener! 👊#ADT10onFanCode pic.twitter.com/V0ZiTNjldp— FanCode (@FanCode) November 21, 2024 -
అఫ్గాన్ ఆల్‌రౌండర్ చీటింగ్.. ఐసీసీ సీరియస్!? రూల్స్ ఇవే
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలిపించిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 8 పరుగులతో తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. తొలి సారి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమైంది.అసలేం ఏం జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే బౌలింగ్‌లో మాత్రం అఫ్గానిస్తాన్ సత్తాచాటింది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 11.4 ఓవర్లు ముగిసే సరికి 81/7 పరుగులు చేసింది.అయితే అప్పుడే చినుకులు ప్రారంభం అయ్యాయి. వర్షం మొదలయ్యే సమయానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గాన్ రెండు పరుగులు ముందు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే అఫ్గానిస్తాన్ 2 పరుగుల తేడాతో గెలవనుంది.అయితే వర్షం మొదలైనప్పటికి అంపైర్లు మాత్రం ఆ ఓవర్‌ను ఫినిష్ చేయాలని భావించారు. ఈ క్రమంలో అపట్టికే నాలుగు బంతులు వేసిన నూర్ ఆహ్మద్‌ను అంపైర్లు ఓవర్ పూర్తి చేయమని ఆదేశించారు.అయితే రెండు బంతలు మిగిలుండడంతో బంగ్లా బ్యాటర్ బౌండరీ బాదితే.. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజవేస్తోంది. ఈ తరుణంలో అఫ్గాన్ హెడ్‌కోచ్ ట్రాట్ ఆలస్యం చేయాలని డగౌట్ నుంచి తమ ప్లేయర్లకు సైగలు చేశాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. కండరాలు పట్టేశాయంటూ నొప్పితో విలవిలలాడినట్లు కన్పించాడు. సరిగ్గా ఆ సమయంలో ఊపందుకోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశాడు. ఫిజియో వచ్చి నైబ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడవరకు అంతబాగానే ఉన్నప్పటకి.. నొప్పితో అంతలా విలవిల్లాడిన నైబ్ 10 నిమిషాల్లో మళ్లీ ఫిట్‌గా కనిపించి బౌలింగ్ చేసేశాడు.దీంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది మాజీలు సైతం అతడి తీరును తప్పుబడుతున్నారు. అస్కార్ అవార్డు ఇవ్వాలని పోస్ట్‌లు చేస్తున్నారు.రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?కాగా నైబ్ వ్యవహరాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా సమయం వృదా చేయకూడదు. అలా చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తాడు. ఈ క్రమంలో లెవల్ 1 నేరానికి 100 శాతం మ్యాచ్-ఫీజు జరిమానా, రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో 41.9 ప్రకారం.. బౌలర్ లేదా ఫీల్డర్ కావాలనే సమయం వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించే అధికారం అంపైర్లకు ఉంటుంది. కానీ బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్‌లో అంపైర్లు ఎటువంటి పెనాల్టీ విధించలేదు. ఇక నైబ్ వ్యవహరంపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి గానీ మ్యాచ్ రిఫరీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు. -
అఫ్గనిస్తాన్ చీటింగ్ చేసి గెలిచిందా? ఏంటీ డ్రామా? ఫ్యాన్స్ ఫైర్
ఐసీసీ టోర్నీలో తొలిసారి సెమీస్ చేరిన అఫ్గనిస్తాన్ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో అండర్‌డాగ్స్‌గా అడుగుపెట్టి టాప్-4లో నిలిచినందుకు రషీద్ ఖాన్ బృందాన్ని క్రికెట్ ప్రపంచం కొనియాడుతోంది.అయితే, అదే సమయంలో అడ్డదారిలో గెలిచారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి.. బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.ఆ ఇద్దరిపై ఆగ్రహంఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కోచ్ జొనాథన్ ట్రాట్, బౌలింగ్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..వరల్డ్‌కప్-2024 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్‌తో తలపడింది. సెయింట్ విన్సెంట్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది.రహ్మనుల్లా గుర్బాజ్ రైజ్ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 43 పరుగులతో రాణించగా.. కెప్టెన్ రషీద్ ఖాన్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 18 రన్స్ తీయగా.. వేరెవరు కనీసం పది పరుగుల స్కోరు దాటలేదు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు స్కోరు చేసింది అఫ్గన్ జట్టు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు అఫ్గన్ పేసర్లు.ఓపెనర్ తాంజిద్ హసన్ డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో ఐదు పరుగులకే నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు.పట్టుదలగా లిటన్ దాస్ఇలాంటి క్లిష్ట సమయంలో ఓపెనర్ లిటన్ దాస్(54 నాటౌట్) పట్టుదలగా నిలబడ్డాడు. అయితే, బంగ్లా ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.లిటన్ దాస్‌తో కలిసి తంజీమ్ హసన్ సకీబ్ క్రీజులో ఉన్న సమయంలో వర్షం పడే సూచనలు కనిపించాయి. పన్నెండో వోర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో నాలుగో బంతికి తంజీమ్ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు.అదే సమయంలో అఫ్గన్ కోచ్ జొనాథన్ ట్రాట్ వాన పడే అవకాశం ఉందని తమ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చాడు. కాస్త స్లోగా ఆడండని సైగలు చేశాడు.తొడ కండరాల్లో నొప్పి అంటూఅప్పటికి బంగ్లాదేశ్ స్కోరు 81/7.. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ అఫ్గనిస్తాన్ కంటే కేవలం రెండు పరుగులే వెనుకబడి ఉంది. అంటే.. ఆ సమయంలో వర్షం పడి.. ఆ తర్వాత మ్యాచ్ గనుక రద్దైపోతే ఫలితం అఫ్గనిస్తాన్‌కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదు.ఈ నేపథ్యంలో కోచ్ సైగల మేరకు స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నైబ్.. ఒక్కసారిగా చేతి పైకెత్తి.. తొడ కండరాల్లో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. అతడి చేష్టలు చూసి కెప్టెన్ రషీద్ ఖాన్ సైతం అసహనంగా కదిలాడు. అసలేమైంది అన్నట్లుగా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.This has got to be the most funniest thing ever 🤣 Gulbadin Naib just breaks down after coach tells him to slow things down 🤣😂 pic.twitter.com/JdHm6MfwUp— Sports Production (@SportsProd37) June 25, 2024 ఇంతలో నైబ్కు సబ్‌స్టిట్యూట్‌గా నజీబుల్లా మైదానంలోకి రాగా.. ఫిజియోలతో పాటు నైబ్ మైదానం వీడాడు. అప్పటికి వర్షం పడలేదు. కానీ నైబ్ వల్ల మ్యాచ్ కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాతి బంతికి బంగ్లా ఒక పరుగు చేసింది. ఓవర్లో మొత్తంగా రెండు పరుగులే వచ్చాయి.ఒకవేళ నైబ్ డ్రామా చేయకపోయి ఉంటే.. మరుసటి రెండు బంతుల్లో గనుక బంగ్లా రెండు పరుగులు చేసి.. ఆ తర్వాత వర్షం పడి మ్యాచ్ రద్దైతే కచ్చితంగా బంగ్లానే గెలిచేది.సెమీస్ రేసు నుంచి అవుట్అయితే, నైబ్ గాయం వల్ల ఆలస్యానికి తోడు వరణుడు కూడా అప్పటికి కరుణించడంతో మ్యాచ్ కొనసాగింది. ఇక పదమూడవ ఓవర్లో బంగ్లాదేశ్ కేవలం ఆరు పరుగులే చేయగా.. గ్రూప్-1 సమీకరణలకు అనుగుణంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.అప్పుడు సెమీస్ బెర్తు కోసం ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లా ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లకు కుదించి విజయ లక్ష్యాన్ని 114 పరుగులుగా విధించారు అంపైర్లు. అయితే, అఫ్గన్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ 17.5 ఓవర్లలో కేవలం 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చిఫలితంగా అఫ్గనిస్తాన్ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టగా.. ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది. అయితే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. అంతకుముందు గాయంతో విలవిల్లాడిన గుల్బదిన్ నైబ్.. కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి ఓ వికెట్ తీయడంతో పాటు.. గెలుపు సంబరాల్లో అందరికంటే వేగంగా పరిగెత్తడం.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌కాగా గుల్బదిన్ నైబ్ ‘లీల’ల గురించి చర్చ మొదలైంది. కామెంటేటర్ సైమన్ డౌల్ అయితే.. ‘‘ఆస్కార్ గెలుచుకునే నటన.. ఆ ఫిజియోలు సూపర్.. మరీ ఇంత త్వరగా గాయం నుంచి కోలుకోవడం నిజంగా ఆశ్చర్యమే’’ అంటూ సెటైర్లు వేశాడు.టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం గుల్బదిన్కు రెడ్‌కార్డ్ ఇవ్వాలంటూ సరదాగా కామెంట్ చేయగా.. అతడు బదులిస్తూ ఒక్కోసారి సంతోషం.. ఒక్కోసారి దుఃఖం అంతే అంటూ అంతే లైట్‌గా తీసుకున్నాడు.No words.... @ICC shouldtake action on this pic.twitter.com/61n3N2SuhG— Hassan Abbasian (@HassanAbbasian) June 25, 2024 -
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం.. ఆఫ్ఘన్ల సంబురాలు మామూలుగా లేవుగా..!
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే పెద్దగా జట్టుగా పేరు తెచ్చుకుంటున్న ఆప్ఘనిస్తాన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. సూపర్-8 సమరంలో మాజీ జగజ్జేత ఆస్ట్రేలియాకు జీర్ణించుకోలేని ఓటమిని రుచి చూపించింది. Dwayne Bravo 'Champion' celebrations in Afghanistan team bus. 🇦🇫 pic.twitter.com/PQEmnexV4f— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024సూపర్-8 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. పటిష్టమైన ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించి పెను సంచనలం సృష్టించింది. ఈ విజయం అనంతరం ఆఫ్ఘన్ ప్లేయర్లు, ఆ జట్టు అభిమానుల సంబురాలు అంతా ఇంతా కాదు. వారి విజయోత్సవాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. బహుశా వారు స్వాతంత్ర్యం పొందినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. THE DRESSING ROOM CELEBRATION OF AFGHANISTAN. 🥶pic.twitter.com/rzVztmrUTp— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024ఆసీస్‌పై చారిత్రక విజయం అనంతరం ఆఫ్ఘన్ హీరో గుల్బదిన్ నైబ్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి మోసుకెళ్లి సంబురాలు చేసుకోగా.. ఆఫ్ఘన్ వీధుల్లో ఆ దేశ పౌరుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని కాబుల్ వీధుల్లో జనాలు రోడ్లపైకి వచ్చి టపాసులు కాలుస్తూ.. కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు. ఈ సంబురాలు ఒక్క కాబుల్కే పరిమితం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఈ విజయాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే బహుశా ఇంతమంది జనాలు బయటికి వచ్చి సమూహిక సంబురాలు చేసుకుని ఉండరు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆఫ్ఘన్లు సంబరపడిపోతున్నారు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది చిరస్మరణీ విజయంగా మిగిలిపోనుంది.Celebrations in Afghanistan. 🇦🇫- A historic victory! pic.twitter.com/wHA1Xl9CgL— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024రాణించిన గుర్బాజ్, జద్రాన్.. వరుసగా రెండో మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్కింగ్స్టౌన్లోని ఆర్నోస్ వేల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు.. ఓపెనర్లు గుర్భాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3, జంపా 2, స్టోయినిస్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించలేదు.రెచ్చిపోయిన ఆఫ్ఘన్ బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 19.2 ఓరవ్లలో 127 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ (4-0-24-4) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. నవీస్ ఉల్ హక్ 3, ఒమర్జాయ్, నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ (59) ఒంటిరి పోరాటం చేయగా.. మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు (మార్ష్ (12), స్టోయినిస్ (11)) చేశారు. ఆసీస్ బ్యాటర్ల ఈ దుస్థితిని క్రికెట్ అభిమానులు ఇప్పటివరకు చూసి ఉండరు. -
టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. ఆసీస్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్
టీ20 వరల్డ్‌కప్-2024లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సూపర్-8 మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో తమ సెమీస్ ఆశలను అఫ్గానిస్తాన్ సజీవంగా ఉంచుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్ బౌలర్ల దాటికి 127 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో క్రీజులో మాక్స్వెల్ ఉన్నప్పుడు ఆసీస్‌దే విజయమని అంతా భావించారు. కానీ అఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్.. మాక్సీని ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నైబ్ తన 4 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. నైబ్‌తో పాటు నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్వెల్(59) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్(51) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా రెండు, స్టోయినిష్ ఒక్క వికెట్ సాధించారు. -
IPL 2024: కండల వీరుడిని ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ నుంచి అర్దంతరంగా వైదొలిగిన మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్, కండల వీరుడు గుల్బదిన్ నైబ్‌ను ఎంపిక చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నైబ్‌ను డీసీ మేనేజ్మెంట్ 50 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. త్వరలో నైబ్ జట్టుతో చేరతాడని డీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నైబ్కు ఇది తొలి ఐపీఎల్.ఆఫ్ఘనిస్తాన్ తరఫున 82 వన్డేలు, 62 టీ20లు ఆడిన నైబ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 99 వికెట్లు పడగొట్టి, 2038 పరుగులు చేశాడు. నైబ్ ఖాతాలో ఓ ఐదు వికెట్ల ఘనత, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 33 ఏళ్ల నైబ్ 2019లో ఆఫ్ఘన్ వన్డే జట్టుకు సారధిగా కూడా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నైబ్ విశేషంగా రాణించాడు. ఈ సిరీస్‌లో బంతితో పర్వాలేదనిపించిన నైబ్.. బ్యాటింగ్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.మార్ష్ విషయానికొస్తే.. ఈ ఐపీఎల్ సీజన్లో మార్ష్ తొలి నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత అతను గాయపడటంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ సీజన్లో మార్ష్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. డీసీ యాజమాన్యం మార్ష్‌ను ఈ ఏడాది వేలంలో 6.5 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.ఢిల్లీ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు..ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ఇందులో తప్పక గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఢిల్లీ ఏప్రిల్ 27న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 26) కేకేఆర్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. -
Ind vs Afg: రీఎంట్రీలో కోహ్లి మార్కు .. జైస్వాల్, దూబే దంచికొట్టారు!
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్‌లో అఫ్గన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్ ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్‌కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్‌లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్‌మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది. -
ఏషియన్ గేమ్స్ 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
చైనాలోని హాంగ్ఝౌ వేదికగా ఈనెల 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడలు 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు 15 మంది సభ్యుల బృందాన్ని ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్ నాయకత్వం వహించనున్నాడు. ఆఫ్ఘన్ సెలెక్టర్లు ఈ జట్టుకు ఆఫ్ఘన్అబ్దల్యన్ అని పేరు పెట్టారు. ఈ జట్టులో మొహమ్మద్ షెహజాద్, కరీమ్ జన్నత్, సెదీఖుల్లా అటల్, ఫరీద్ అహ్మద్ మలిక్, ఖైస్ అహ్మద్, అఫ్సర్ జజాయ్ లాంటి జాతీయ జట్టు ప్లేయర్లు ఉన్నారు. ఆసియా క్రీడల రూల్స్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అక్టోబర్ 3 లేదా 4వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్లో నేరుగా ఆడుతుంది. క్వార్టర్స్ అనంతరం అక్టోబర్ 6న సెమీఫైనల్, 7న ఫైనల్ జరుగుతుంది. ఈ క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. కాగా, ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌కు చోటు దక్కింది. తొలిసారి జరుగుతున్న పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా భారత్ రెండు విభాగాల్లో పోటీపడుతుంది. ఈ క్రీడల కోసం బీసీసీఐ పటిష్టమైన పురుషుల జట్టును ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా.. అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్ 1) ఆడుతుంది. టీమిండియా క్వార్టర్స్‌లో గెలిస్తే.. అక్టోబర్ 6న సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. సెమీస్‌లో గెలిస్తే అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో స్వర్ణం కోసం పోటీపడుతుంది. భారత్ ఆడే క్వార్టర్ ఫైనల్, సెమీస్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు.. గుల్బదిన్ నైబ్, మొహమ్మద్ షెహజాద్, సెదీఖుల్లా అటల్, జుబ్దైద్ అక్బరీ, నూర్ అలీ జద్రాన్, షహీదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, వఫీవుల్లా తరాఖిల్, కరీం జన్నత్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్, నిజత్ మసౌద్,సయ్యద్ అహ్మద్ షిర్జాద్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు.. రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ -
T20 World Cup 2022: శ్రీలంకతో మ్యాచ్.. ఆఫ్గాన్‌కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్ ముందు ఆఫ్గానిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ జట్టు విధ్వంసకర ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ పొత్తికడుపు కండరాల గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు స్థానంలో రిజార్వ్ జాబితాలో ఉన్న గుల్బాదిన్ నైబ్‌ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎంపిక చేసింది. నైబ్ ఎంపికను టీ20 ప్రపంచకప్ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమెదించింది. కాగా ఈ టోర్నీలో ఆటగాడి స్తానాన్ని భర్తీ చేసే ముందు ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం తప్పనిసరి. కాగా సూపర్-12లో భాగంగా మంగళవారం గబ్బా వేదికగా శ్రీలంకతో ఆఫ్గాన్ తలపడనుంది. కాగా ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్లో ఆఫ్గాన్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్ పోరాడి ఓడింది. అనంతరం వరుసగా న్యూజిలాండ్, ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. గ్రూప్-2 నుంచి పాయింట్ల పట్టికలో ఆఫ్గానిస్తాన్ ఐదో స్థానంలో ఉంది. ఇక నైబ్ విషయానికి వస్తే.. అతడు బ్యాట్, బాల్‌తో రాణించగలడు. నైబ్ చివరి సారిగా 2021లో న్యూజిలాండ్‌పై టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: T20 World Cup 2022: చెలరేగిన ఫించ్.. ఐర్లాండ్‌పై ఆసీస్ ఘన విజయం -
‘మీ బాగోతం బయటపెడతా.. స్టే ట్యూన్డ్’
కాబూల్: అఫ్గానిస్తాన్ క్రికెట్లో ఇప్పుడు పెద్ద దుమారమే రేపాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ గుల్బదీన్ నైబ్. అఫ్గాన్ క్రికెట్ బోర్డులో ఎంతటి రాజకీయాలు నడుస్తున్నాయో, అంతే స్థాయిలో అవినీతి కూడా జరుగుతుందంటూ నైబ్ ఒక్కసారిగా కలకలం సృష్టించాడు. దీనిలో భాగంగా వరుస ట్వీట్లు చేస్తూ బోర్డులోని పెద్దల్ని కలవరపాటుకు గురి చేశాడు. ‘ డియర్ అఫ్గాన్ ఫ్యాన్స్. నేను నేను బయటకు రావడానికి కారణం ఏ ఒక్కరి మీదో వ్యక్తిగత కక్ష కాదు. అదే సమయంలో క్రికెట్ బోర్డుపై కూడా నాకు ద్వేషం లేదు. అఫ్గాన్ బోర్డులోని పెద్దలు అవినీతిలో కూరుకుపోయారు. యాక్షన్ తీసుకుంటానంటే చెప్పండి.. వారి పేర్లు బయటపెడతా. పలువురు క్రికెటర్లు, బోర్డులోని ప్రముఖులు అవినీతికి పెద్ద పీట వేస్తున్నారు’ అంటూ అలజడి రేపాడు. ఇలా వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ కొత్త వివాదానికి తెరలేపాడు. ‘ఇప్పటివరకూ నేషనల్ లీగల్ ఏజెన్సీ అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏమైనా యాక్షన్ తీసుకుంది. ఒకవేళ దానిపై సదరు అథారిటీ ఏమీ యాక్షన్ తీసుకోలేకపోతే నేను వారి పేర్లు బయటకు పెడతా. అప్పుడు చాలా సిగ్గుగా ఉంటుంది. గవర్నమెంట్ అధికారులు దగ్గర్నుంచీ బోర్డు సభ్యులు, ఆటగాళ్లు, మాజీ బోర్డు మెంబర్లు, మేనేజ్మెంట్ సభ్యుల పేర్లు వారి కరప్షన్‌ను బయటపెడతా. నన్ను ప్రేమించే అభిమానులు స్టే ట్యూన్డ్’ అని నైబ్ ఒక ట్వీట్లో పేర్కొన్నాడు. 2019 వరల్డ్‌కప్‌కు నైబ్ అఫ్గాన్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకడైన నైబ్‌ను వరల్డ్‌కప్‌కు అఫ్గాన్ జట్టు వెళ్లే చివరి నిమిషంలో కెప్టెన్‌గా నియమించారు. అస్గార్ అఫ్గాన్‌ను తప్పించి నైబ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే ఆ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పోయింది. దాంతో ఆ తర్వాత రషీద్ ఖాన్‌ను అన్ని ఫార్మాట్లకు అఫ్గాన్ సారథిగా ఎంపిక చేసింది. అయినప్పటికీ అఫ్గాన్ తలరాత మారకపోవడంతో తిరిగి అస్గార్ అఫ్గాన్‌ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమిస్తూ అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) నిర్ణయం తీసుకుంది. My dear Afghans, the main reason why i went public is not because i have personal grudge against player or the board. I am going to reveal every persons identity involved in corruption and other misconducts and betrayals against our Nation cricket and its ppl. — Gulbadin Naib (@GbNaib) December 11, 2019 I know most of you may ask why have i not spoken publicly against these ppl/mafia circle before. I have been sidelined and promised, by the authorities and other stakeholders that they will sort the mess in the cricket team and promised immediate changes & banning of this circle — Gulbadin Naib (@GbNaib) December 11, 2019 Has anything been done about such betrayal? For public interest, if D authorities don’t take appropriate actions, i will publicly name & shame every single one from gov officials to board members, players and ex board and management members. Stay tuned... long life my beloved 🇦🇫 — Gulbadin Naib (@GbNaib) December 11, 2019