T20 World Cup 2022: Afghanistan Opener Hazratullah Zazai Ruled Out Due To Injury - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: శ్రీలంకతో మ్యాచ్‌.. ఆఫ్గాన్‌కు భారీ షాక్‌!

Published Tue, Nov 1 2022 7:46 AM | Last Updated on Tue, Nov 1 2022 9:33 AM

Afghanistan batter Hazratullah Zazai ruled out T20 World Cup 2022 - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌ ముందు ఆఫ్గానిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ జట్టు విధ్వంసకర ఓపెనర్‌ హజ్రతుల్లా జజాయ్ పొత్తికడుపు కండరాల గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు స్థానంలో రిజార్వ్‌ జాబితాలో ఉన్న గుల్బాదిన్ నైబ్‌ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌ ఎంపిక చేసింది.

నైబ్‌ ఎంపికను టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమెదించింది. కాగా ఈ టోర్నీలో ఆటగాడి స్తానాన్ని భర్తీ చేసే ముందు ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం తప్పనిసరి. కాగా సూపర్‌-12లో భాగంగా మంగళవారం గబ్బా వేదికగా శ్రీలంకతో ఆఫ్గాన్‌ తలపడనుంది. కాగా ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్‌లో ఆఫ్గాన్‌ కేవలం ఒకే ఒక మ్యాచ్‌ ఆడింది.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్‌ పోరాడి ఓడింది. అనంతరం వరుసగా న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. గ్రూప్‌-2 నుంచి పాయింట్ల పట్టికలో ఆఫ్గానిస్తాన్‌ ఐదో స్థానంలో ఉంది. ఇక నైబ్‌ విషయానికి వస్తే.. అతడు బ్యాట్‌, బాల్‌తో రాణించగలడు. నైబ్‌ చివరి సారిగా 2021లో న్యూజిలాండ్‌పై టీ20 మ్యాచ్‌ ఆడాడు.
చదవండి: T20 World Cup 2022: చెలరేగిన ఫించ్‌.. ఐర్లాండ్‌పై ఆసీస్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement