చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా ఈనెల 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడలు 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు 15 మంది సభ్యుల బృందాన్ని ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్ నాయకత్వం వహించనున్నాడు. ఆఫ్ఘన్ సెలెక్టర్లు ఈ జట్టుకు ఆఫ్ఘన్‌అబ్దల్యన్ అని పేరు పెట్టారు. ఈ జట్టులో మొహమ్మద్ షెహజాద్, కరీమ్ జన్నత్, సెదీఖుల్లా అటల్, ఫరీద్ అహ్మద్ మలిక్, ఖైస్ అహ్మద్, అఫ్సర్ జజాయ్ లాంటి జాతీయ జట్టు ప్లేయర్లు ఉన్నారు.
ఆసియా క్రీడల రూల్స్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అక్టోబర్ 3 లేదా 4వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్లో నేరుగా ఆడుతుంది. క్వార్టర్స్ అనంతరం అక్టోబర్ 6న సెమీఫైనల్, 7న ఫైనల్ జరుగుతుంది. ఈ క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.
కాగా, ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌కు చోటు దక్కింది. తొలిసారి జరుగుతున్న పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా భారత్ రెండు విభాగాల్లో పోటీపడుతుంది. ఈ క్రీడల కోసం బీసీసీఐ పటిష్టమైన పురుషుల జట్టును ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా.. అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్ 1) ఆడుతుంది.
టీమిండియా క్వార్టర్స్‌లో గెలిస్తే.. అక్టోబర్ 6న సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. సెమీస్‌లో గెలిస్తే అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో స్వర్ణం కోసం పోటీపడుతుంది. భారత్ ఆడే క్వార్టర్ ఫైనల్, సెమీస్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది.
ఆసియా క్రీడల్లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు.. గుల్బదిన్ నైబ్, మొహమ్మద్ షెహజాద్, సెదీఖుల్లా అటల్, జుబ్దైద్ అక్బరీ, నూర్ అలీ జద్రాన్, షహీదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, వఫీవుల్లా తరాఖిల్, కరీం జన్నత్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్, నిజత్ మసౌద్,సయ్యద్ అహ్మద్ షిర్జాద్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు.. రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్
Comments
Please login to add a commentAdd a comment