Dream would be to win gold medal, stand on podium and sing national anthem: Ruturaj Gaikwad - Sakshi
Sakshi News home page

Asian Games 2023: బీసీసీఐకి థాంక్స్‌.. కచ్చితంగా స్వర్ణ పతకం గెలుస్తాం: టీమిండియా కొత్త కెప్టెన్‌

Published Sat, Jul 15 2023 6:16 PM | Last Updated on Sat, Jul 15 2023 9:14 PM

Dream Would Be To Win Gold Medal Ruturaj Wants to Stand On Podium - Sakshi

Asian Games 2023- Team India: ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు మహారాష్ట్ర క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి పాల్గొంటున్న జట్టుకు తాను నాయకుడిని కావడం గర్వంగా ఉందన్నాడు. తనతో పాటు జట్టులోని ఇతర సభ్యులు కూడా ఈ ఈవెంట్లో ఆడేందుకు ఎంతో ఉత్సుకతో ఉన్నారని తెలిపాడు. 

కాగా చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి పురుష, మహిళా క్రికెట్‌ జట్లను పంపేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 28 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌ నేపథ్యంలో జట్లను ప్రకటించింది. ఇక అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి పురుష జట్టును చైనాకు పంపనుంది.

గోల్డ్‌ మెడల్‌ గెలిచి
ఈ టీమ్‌కు టీమిండియా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ విషయంపై స్పందించిన రుతు.. ‘‘ఆసియా క్రీడల్లో పాల్గొననుండటం ఎంతో సంతోషంగా ఉంది. దేశం కోసం ఆడే మ్యాచ్‌లో కచ్చితంగా స్వర్ణ పతకం గెలుస్తామనే నమ్మకం ఉంది.

గోల్డ్‌ మెడల్‌ గెలిచి పోడియం వద్ద నిల్చుని జాతీయ గీతం పాడాలనే కల నెరవేర్చుకునేందుకు శాయశక్తులా కృషి​ చేస్తాం. ఈ జట్టుకు నన్ను సారథిగా ఎంపిక చేసినందుకు బీసీసీఐ సెలక్టర్లకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ప్లేయర్లు:
యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement