టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా జైత్ర యాత్రకు అఫ్గానిస్తాన్ బ్రేక్‌లు వేసింది. కింగ్స్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ను 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌లో ఓటమికి అఫ్గాన్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 150 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని అఫ్గాన్ బౌలర్లు కాపాడుకున్నారు.
లక్ష్య చేధనలో అఫ్గాన్ బౌలర్ల దాటికి ఆసీస్ 127 పరుగులకే చాపచుట్టేసింది. అఫ్గాన్ మీడియం పేసర్ గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్‌హక్ మూడు వికెట్లు, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నబీ ఒక్క వికెట్ సాధించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఈ విజయంతో అఫ్గాన్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని రషీద్ తెలిపాడు.
"ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం. ఆసీస్ వంటి పెద్ద జట్టుపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా దేశం గర్వించదగ్గ సందర్భం. మాకు కూడా ఒక జట్టుగా చాలా గర్వంగా ఉంది. ప్రత్యర్ది బౌలింగ్ లైనప్‌ను బట్టి మా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తున్నాము.
అందుకే ప్రతీ మ్యాచ్‌లోనూ ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడలేకపోతున్నాము. కింగ్స్ టౌన్ పిచ్‌పై 140 పరుగులు మంచి స్కోర్‌గా భావించవచ్చు. మాకు బ్యాటింగ్‌లో మంచి ఆరంభం వచ్చింది. కానీ మేము ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయాం.
ఆఖరికి ప్రత్యర్ధి ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచాము. ఈ టార్గెట్‌ను ఎలాగైనా డిఫెండ్ చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగాం. అందుకు తగ్గట్టే మా బాయ్స్ అదరగొట్టారు. మా జట్టు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎక్కువ మంది ఆల్‌రౌండర్‌లను కలిగి ఉండటం జట్టుకు కలిసొచ్చింది. ఇక నైబ్ ఒక అద్బుతం.
అతడి వల్లే ఇదింతా. నైబ్‌కు ఉన్న అనుభవాన్ని మొత్తం ఈ మ్యాచ్‌లో చూపించాడు. అదే విధంగా నవీన్,నబీ కూడా అద్బుమైన ప్రదర్శన కనబరిచారు. మా తదుపరి మ్యాచ్‌లో ఇదే జోరును కొనసాగిస్తామని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment