ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఐసీసీ మందలించింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బ్యాట్‌ను నేలకేసి కొట్టినందుకు గాను మందలింపుతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను ఫైన్‌గా విధించింది. 24 నెలల వ్యవధిలో రషీద్ చేసిన మొదటి తప్పిదం కావడంతో ఐసీసీ స్వల్ప చర్యలతో సరిపెట్టింది. బ్యాట్‌ను నేలకేసి కొట్టడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని లెవెల్ 1 తప్పిదంగా పరిగణిస్తారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ సందర్భంలో తన బ్యాటింగ్ భాగస్వామి కరీం జనత్ స్ట్రైక్‌ను తిరస్కరించినందుకు (రెండో పరుగు) రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్‌లో ఆ జట్టుకు సౌతాఫ్రికా చేతిలో చుక్కెదురైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.
ఇవాళే (జూన్ 27, రాత్రి 8 గంటలకు) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment