ఐసీసీ వరల్డ్‌కప్‌లలో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఎదైనా ఉందంటే మనకు టక్కున గుర్తుచ్చేది దక్షిణాఫ్రికానే. టోర్నీ మొత్తం ఆసాధరణమైన ప్రదర్శన.. వరుసగా విజయాలు. కానీ కీలకమైన సెమీఫైనల్స్‌లో మాత్రం ఒత్తిడికి చిత్తు. ఇప్పటివరకు అటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ, ఇటు టీ20 వరల్డ్‌కప్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.
ప్రతీసారి సెమీస్ లో ఓడిపోతూ చోకర్స్ గా ముద్రపడ్డ సఫారీలు మరోసారి టైటిల్ రేసులో నిలబడ్డారు. పొట్టి వరల్డ్‌కప్‌లలో ముచ్చటగా మూడోసారి సెమీస్‌లో సౌతాఫ్రికా అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 తొలి సెమీఫైనల్లో భాగంగా ట్రినడాడ్ వేదికగా శుక్రవారం సంచలనాల అఫ్గానిస్తాన్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.
ఈ సారైనా గట్టుకెక్కుతుందా?
ఓవరాల్‌గా వన్డే, టీ20 ప్రపంచకప్‌ల నాకౌట్స్‌లో దక్షిణాఫ్రికా 10 సార్లు తలపడింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించింది. అది కూడా క్వార్టర్ ఫైనల్లో కావడం గమనార్హం. ఇక 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు రెండు సార్లు సెమీఫైన్సల్ ఆడిన దక్షిణాఫ్రికా ఓసారి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వగా.. మరోసారి ఇండియా చేతిలో పరాజయం పాలైంది. కానీ ఈసారి మాత్రం తమ పేరిట ఉన్న చోకర్స్ ముద్రను ఎలాగైనా చెరేపేయాలన్న కసితో దక్షిణాఫ్రికా ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా ఉన్న సౌతాఫ్రికా అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
దక్షిణాఫ్రికా బలబలాలు..
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో క్వింటన్ డికాక్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం వారు అంతా మంచి రిథమ్‌లో కూడా ఉన్నారు. అయితే కెప్టెన్ మార్‌క్రమ్ ఫామ్ మాత్రం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
అదేవిధంగా స్పిన్‌ను కూడా ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అఫ్గాన్ ప్రధాన బలం స్పిన్నర్లే. మరి అఫ్గాన్ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సఫారీ బౌలర్లు అదరగొడుతున్నారు. నోర్జే, రబాడ, జానెసన్ వంటి పేసర్లు ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పేస్ త్రయం చెలరేగితే అఫ్గాన్ బ్యాటర్లకు కష్టాల్లు తప్పవు.
అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు..
అయితే ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న అఫ్గానిస్తాన్‌ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వంటి పటిష్టమైన జట్లను ఓడించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్.. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సఫారీలను ఢీ కొట్టనుంది.
అఫ్గాన్ బ్యాటింగ్ పరంగా కాస్త వీక్‌గా కన్పిస్తున్నప్పటకి బౌలింగ్‌లో మాత్రం బలంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అదేవిధంగా పేస్ బౌలింగ్‌లోనూ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ సత్తాచాటుతున్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువగా ఓపెనర్లపైనే అఫ్గాన్ ఆధారపడుతోంది. సెమీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అఫ్గాన్ అదరగొడితే దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment