టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న (జూన్ 29) జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా (టీ20) నిలిచింది.
ఈ టోర్నీలో భారత్ టైటిల్ గెలిచినప్పటికీ.. లీడింగ్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (8 మ్యాచ్‌ల్లో 281 పరుగులు), బౌలింగ్‌లో ఫజల్‌హక్ ఫారూఖీ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 257 పరుగులు) ఉండగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఉన్నారు.
ఈ టోర్నీలో అత్యధిక బ్యాటింగ్ సగటు రిచీ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్. 102), అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ షాయ్ హోప్ (187.72), అత్యధిక హాఫ్ సెంచరీలు రహ్మానుల్లా గుర్బాజ్ (3), అత్యధిక బౌండరీలు ట్రవిస్ హెడ్ (26), అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ (17) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.
బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక బౌలింగ్ సగటు టిమ్ సౌథీ (5.14), అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఫజల్‌హక్ ఫారూఖీ (5-9) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో కేవలం రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. ఫారూఖీతో పాటు అకీల్ హొసేన్ ఐదు వికెట్ల ఘనత (5/11) సాధించాడు. ఫజల్‌హక్, అకీల్ హొసేన్ ఇద్దరూ ఉగాండపైనే ఐదు వికెట్ల ఘనత నమోదు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment