ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఉగాండతో ఇవాళ (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో ఫజల్ హక్ 4 ఓవర్లు బౌల్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవి రెండో అత్యుత్తమ గణాంకాలు.
2009లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ న్యూజిలాండ్‌పై కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు శ్రీలంక స్పిన్నర్ అజంత మెండిస్ పేరిట నమోదై ఉన్నాయి. 2012 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెండిస్ 8 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
మెండిస్ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు కూడా లంక బౌలర్ పేరిటే నమోదై ఉన్నాయి. 2014 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక స్పిన్నర్ రంగన హెరాత్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, ఉగాండతో జరిగిన నేటి మ్యాచ్‌లో ఫజల్ హక్ ఫారూఖీ విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (76), ఇబ్రహీం జద్రాన్ (70) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. ఉగాండ బౌలర్లలో కోస్మాస్ క్యేవుటా, మసాబా తలో 2 వికెట్లు పడగొట్టారు.
184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ.. ఫజల్ హక్‌తో పాటు నవీన్ ఉల్ హక్ (2-0-4-2), రషీద్ ఖాన్ (4-0-12-1), ముజీబ్ (3-0-16-1) విజృంభించడంతో 16 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. ఉగాండ ఇన్నింగ్స్‌లో రియాజత్ అలీ షా (11), రాబిన్సన్ ఒబుయా (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment