Fazalhaq Farooqi
-
T20 World Cup 2024: కప్ మనోళ్లదే, కానీ..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న (జూన్ 29) జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా (టీ20) నిలిచింది.ఈ టోర్నీలో భారత్ టైటిల్ గెలిచినప్పటికీ.. లీడింగ్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (8 మ్యాచ్‌ల్లో 281 పరుగులు), బౌలింగ్‌లో ఫజల్హక్ ఫారూఖీ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 257 పరుగులు) ఉండగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఉన్నారు.ఈ టోర్నీలో అత్యధిక బ్యాటింగ్ సగటు రిచీ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్. 102), అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ షాయ్ హోప్ (187.72), అత్యధిక హాఫ్ సెంచరీలు రహ్మానుల్లా గుర్బాజ్ (3), అత్యధిక బౌండరీలు ట్రవిస్ హెడ్ (26), అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ (17) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక బౌలింగ్ సగటు టిమ్ సౌథీ (5.14), అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఫజల్హక్ ఫారూఖీ (5-9) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో కేవలం రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. ఫారూఖీతో పాటు అకీల్ హొసేన్ ఐదు వికెట్ల ఘనత (5/11) సాధించాడు. ఫజల్హక్, అకీల్ హొసేన్ ఇద్దరూ ఉగాండపైనే ఐదు వికెట్ల ఘనత నమోదు చేయడం విశేషం. -
T20 World Cup 2024: ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న ఆఫ్ఘన్ బౌలర్లు
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్తాన్ జట్టు అన్ని విభాగాల్లో చెలరేగిపోతుంది. మెగా టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించి సూపర్-8కు అర్హత సాధించింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘన్లకు తిరుగులేకుండా పోయింది. ఆ జట్టు బౌలర్లు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను 100 పరుగులలోపే ఆలౌట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్లో వారి ఆధిపత్యం ఎలా ఉందో ఇట్టే అర్దమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఉగాండను 58 పరుగులకే ఆలౌట్ చేసిన ఆఫ్ఘన్ బౌలర్లు.. ఆతర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను 75 పరుగులకు.. తాజాగా పపువా న్యూ గినియాను 95 పరుగులకు కుప్పకూల్చారు. ఆఫ్ఘన్ బౌలర్లు ఈ తరహాలో చెలరేగడం వెనుక ఆ జట్టు బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌తో ఆఫ్ఘన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రావో ఆ జట్టు సాధిస్తున్న ప్రతి విజయంలో తనదైన మార్కును చూపాడు. బ్రావో ఆధ్వర్యంలో మీడియం ఫాస్ట్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫారూఖీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.ఉగాండతో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన ఫారూఖీ.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై 4 వికెట్లు..తాజాగా పపువా న్యూ గినియాపై 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఫారూఖీ రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్ల వరుస విజయాల్లో ఫారూఖీ ప్రధానపాత్ర పోషించాడు. ఫారూఖీతో పాటు ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ (3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు)య సైతం ఓ మోస్తరుగా రాణిస్తున్నాడు.ఈ టోర్నీలో ఆఫ్ఘన్లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోతున్నారు. ఆ జట్టు బ్యాటర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (167 పరుగులు), ఇబ్రహీం జద్రాన్ (114 పరుగులు) టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఒకటి, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సూపర్-8కు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. సూపర్-8లో భారత్ (జూన్ 20), ఆస్ట్రేలియా (జూన్ 22), బంగ్లాదేశ్/నెదర్లాండ్స్ (జూన్ 24) జట్లను ఢీకొంటుంది. -
T20 WC: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్
వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పపువా న్యుగినియాతో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో అఫ్గన్ జట్టు వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-సిలో ఉంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన రషీద్ ఖాన్ బృందం.. గ్రూప్ దశలో మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడో గెలుపు నమోదు చేసి ఆరు పాయింట్ల(నెట్ రన్‌రేటు +4.230)తో గ్రూప్-సి టాపర్‌గా నిలిచింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫజల్హక్ ఫరూకీ(3/16), నవీన్ ఉల్ హక్(2/4), నూర్ అహ్మద్(1/14) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసి సత్తా చాటారు. తేలికగా తలవంచని ప్రత్యర్థిఈ క్రమంలో 19.5 ఓవర్లలో 95 పరుగులు చేసిన పీఎన్జీ జట్టు ఆలౌట్ అయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ ముందు అంత తేలికగా తలవంచలేదు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ గులాబిదిన్ నయీబ్(36 బంతుల్లో 49 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, మహ్మద్ నబీ(23 బంతుల్లో 16 నాటౌట్) ఆచితూచి ఆడారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఫలితంగా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసిన అఫ్గన్ జయభేరి మోగించింది. తద్వారా సూపర్-8 దశకు అర్హత కూడా సాధించింది. ఇక ఇప్పటికే వెస్టిండీస్ గ్రూప్-సి నుంచి సూపర్-8లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఎలిమినేట్ అయింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
T20 World Cup 2024: అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఉగాండతో ఇవాళ (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో ఫజల్ హక్ 4 ఓవర్లు బౌల్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవి రెండో అత్యుత్తమ గణాంకాలు. 2009లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ న్యూజిలాండ్‌పై కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు శ్రీలంక స్పిన్నర్ అజంత మెండిస్ పేరిట నమోదై ఉన్నాయి. 2012 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెండిస్ 8 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మెండిస్ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు కూడా లంక బౌలర్ పేరిటే నమోదై ఉన్నాయి. 2014 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక స్పిన్నర్ రంగన హెరాత్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే, ఉగాండతో జరిగిన నేటి మ్యాచ్‌లో ఫజల్ హక్ ఫారూఖీ విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (76), ఇబ్రహీం జద్రాన్ (70) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. ఉగాండ బౌలర్లలో కోస్మాస్ క్యేవుటా, మసాబా తలో 2 వికెట్లు పడగొట్టారు.184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ.. ఫజల్ హక్‌తో పాటు నవీన్ ఉల్ హక్ (2-0-4-2), రషీద్ ఖాన్ (4-0-12-1), ముజీబ్ (3-0-16-1) విజృంభించడంతో 16 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. ఉగాండ ఇన్నింగ్స్‌లో రియాజత్ అలీ షా (11), రాబిన్సన్ ఒబుయా (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
నవీన్ సహా ఆ ఇద్దరిపై రెండేళ్ల నిషేధం.. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ అఫ్గన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది. నో ఆబ్జక్షన్ లెటర్ ఇచ్చేదే లేదు వచ్చే ఏడాది వారికి సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, నవీన్ ఉల్ హక్ మురీద్ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వరల్డ్‌కప్-2023లో మెరుగైన ప్రదర్శన అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ! -
CWC 2023: ఆఫ్ఘనిస్తాన్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ (అక్టోబర్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక, ఆతర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లు భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేయడంలో ఆఫ్ఘన్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (46), కుశాల్ మెండిస్ (39), సమరవిక్రమ (36) మంచి ఆరంభాలు లభించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తీక్షణ (29), ఏంజెలో మాథ్యూస్ (23), అసలంక (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. దిముత్ కరుణరత్నే (15), ధనంజయం డిసిల్వ (14), చమీర (1), రజిత (5) నిరాశపరిచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 4, ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హాక్ ఫారూఖీ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్
స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయల నడుమ 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 83/2 (21.4 ఓవర్లు) స్కోర్ వద్ద ఉండగా వర్షం మరోసారి పలకరించింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఎంపైర్లు ఆఫ్ఘనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. సత్తా చాటిన ఆఫ్ఘన్ బౌలర్లు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హాక్ ఫారూఖీ (3/24), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/23), రషీద్ ఖాన్ (2/21), మహ్మద్ నబీ (1/25), అజ్మతుల్లా (1/39) బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హ్రిదోయ్ (51) అర్ధసెంచరీతో రాణించగా.. తమీమ్ ఇక్బాల్ (13), లిటన్ దాస్ (26), షాంటో (12), షకీబ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. అలసట లేకుండా గెలుపొందిన ఆఫ్ఘనిస్తాన్.. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. వరుణుడి పుణ్యమా అని అలసట లేకుండా గెలుపొందింది. 21.4 ఓవర్ల వద్ద (83/2) మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆఫ్ఘనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్ (41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికగా జులై 8న జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. -
వరల్డ్ నంబర్ 1 రషీద్! పాక్‌పై చెలరేగి టాప్-3లో అతడు.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఖుషీ
ICC T20I Bowling Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ సత్తా చాటాడు. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ఈ లెగ్ స్పిన్నర్ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 2018లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన రషీద్ ఖాన్.. మరోసారి వరల్డ్ నంబర్ 1గా నిలిచాడు. కాగా షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి టీ20లో ఒక వికెట్ తీసిన ఈ అఫ్గన్ సారథి.. రెండో మ్యాచ్‌లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఆఖరిదైన మూడో టీ20లోనూ ఒక వికెట్‌తో మెరిశాడు. టాప్-3లో ఇద్దరు.. ఈ క్రమంలో 710 రేటింగ్ పాయింట్లతో హసరంగను అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అఫ్గన్‌కు చెందిన పేసర్ ఫజల్హక్ ఫారూకీ మూడో స్థానంలోకి దూసుకువచ్చాడు. పాక్‌తో సిరీస్‌లో 5 వికెట్లతో చెలరేగిన అతడు టాప్-5లో అడుగుపెట్టాడు. దీంతో ఐపీఎల్-2023కి ముందు మంచి బూస్టప్ లభించిందంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సీజన్లో ఫారూకీ ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన రషీద్ బృందం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఐసీసీ టీ20 బౌలింగ్ తాజా ర్యాంకింగ్స్ 1. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 710 పాయింట్లు 2. వనిందు హసరంగ- శ్రీలంక- 695 పాయింట్లు 3. ఫజల్హక్ ఫారూకీ- అఫ్గనిస్తాన్- 692 పాయింట్లు 4. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 690 పాయింట్లు 5. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 684 పాయింట్లు View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)