
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ (అక్టోబర్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక, ఆతర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లు భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేయడంలో ఆఫ్ఘన్ బౌలర్లు సఫలమయ్యారు.
ఓపెనర్ పథుమ్ నిస్సంక (46), కుశాల్ మెండిస్ (39), సమరవిక్రమ (36) మంచి ఆరంభాలు లభించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తీక్షణ (29), ఏంజెలో మాథ్యూస్ (23), అసలంక (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. దిముత్ కరుణరత్నే (15), ధనంజయం డిసిల్వ (14), చమీర (1), రజిత (5) నిరాశపరిచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 4, ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ తలో వికెట్ పడగొట్టారు.
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హాక్ ఫారూఖీ
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక
Comments
Please login to add a commentAdd a comment