Srilanka vs Afghanistan
-
హసరంగపై సస్పెన్షన్ వేటు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్‌ను దూషించినందుకు గాను ఐసీసీ హసరంగపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనతో ఐదు డీ మెరిట్ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్‌ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. హసరంగతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్‌లో అంపైర్ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్ మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించింది. కాగా, శ్రీలంకతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా (ఆఖరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ).. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వఫాదర్ మొమంద్ నడుము కంటే ఎత్తులో బంతి వేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో హసరంగ ఫైరయ్యాడు. అంపైర్ నిర్ణయంతో చిర్రెతిపోయిన హసరంగ కోపంగా అతని వైపు దూసుకొచ్చి దూషణను దిగాడు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ బంతిని నో బాల్‌గా ప్రకటిస్తారు.. కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. నువ్వు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు పనికిరావు.. వెళ్లి వేరే ఏదైనా పని చూసుకో అంటూ అంపైర్‌పై దూషణ పర్వానికి దిగాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
రాణించిన రహ్మానుల్లా గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
శ్రీలంక పర్యటనలో చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (43 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్ జట్టు శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ సాధించడంలో అజ్ముతుల్లా ఒమర్జాయ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు) తన వంతు పాత్ర పోషించాడు. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 10, మొహమ్మద్ నబీ 16 నాటౌట్, మొహమ్మద్ ఇషాక్ 16 నాటౌట్ పరుగులు చేయగా.. కరీం జనత్ డకౌటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మతీశ పతిరణ, అఖిల ధనంజయ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ వనిందు హసరంగ ఓ వికెట్ దక్కించకున్నాడు. ఏంజెలో మాథ్యూస్ (2-0-21-0), నువాన్ తుషార (4-0-48-0) భారీగా పరుగులు సమర్పించుకోగా.. దసున్ షనక (2-0-16-0) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక 2-0 తేడాతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంక పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ ఆడింది. తొలుత జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటన ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మూడో టీ20లో భారీ స్కోర్ చేయడంతో విజయావకాశాలు ఉన్నాయి. -
రాణించిన సమరవిక్రమ.. చెలరేగిన హసరంగ, మాథ్యూస్
డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు సమరవిక్రమ (42 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (11 బంతుల్లో 25; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్‌లకు (14 బంతుల్లో 23; 4 ఫోర్లు) శుభారంభం లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధనంజయ డిసిల్వ 14, అసలంక 4 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, మొహమ్మద్ నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (1), ఇబ్రహీం జద్రాన్ (10) ఔట్ కాగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (9), గుల్బదిన్ నైబ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగిన ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
విధ్వంసకర డబుల్ సెంచరీ.. సెహ్వాగ్, క్రిస్ గేల్ రికార్డులు బద్దలు
వన్డే క్రికెట్లో మరో విధ్వంసకర డబుల్ సెంచరీ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక మెరుపు ద్విశతకంతో (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. కేవలం 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును చేరిన నిస్సంక.. వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (138 బంతుల్లో), వీరేంద్ర సెహ్వాగ్ (140 బంతుల్లో) లాంటి అరివీర భయంకరుల రికార్డులను అధిగమించాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కేవలం 126 బంతుల్లోనే డబుల్ బాదాడు. రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (128) పేరిట ఉంది. తాజా డబుల్ సెంచరీతో నిస్సంక మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. వన్డేల్లో డబుల్ నమోదు చేసిన తొలి శ్రీలంక ఆటగాడిగా, ఓవరాల్‌గా 12వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిస్సంకకు ముందు రోహిత శర్మ, మార్టిన్ గప్తిల్, సెమ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మ్యాక్స్‌వెల్, సచిన్ టెండూల్కర్ వన్డేల్లో డబుల్ మార్కును తాకారు. వీరిలో రోహిత్ శర్మ అత్యధికంగా మూడు వన్డే డబుల్‌లు సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిస్సంక విధ్వంసకర ద్విశతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిస్సంకతో పాటు మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (88), సమరవిక్రమ (45) రాణించారు. నిస్సంక ఊచకోత ధాటికి ప్రపంచలోకెల్లా మెరుగైన స్పిన్ అటాక్ కలిగిన ఆఫ్ఘన్లు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
జయసూర్య మాయాజాలం.. పసికూనపై ప్రతాపం చూపించిన శ్రీలంక
కొలొంబో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రభాత్ జయసూర్య తన స్పిన్ మాయాజాలంతో (8/174) ఆఫ్ఘన్ల పని పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జయసూర్య.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించి ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. అషిత ఫెర్నాండో (3/24), విశ్వ ఫెర్నాండో (4/51), ప్రభాత్ జయసూర్య (3/67) ధాటికి 198 పరుగులకు కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఏంజెలో మాథ్యూస్ (141), చండిమల్ (107) సెంచరీలతో కదంతొక్కారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 4, నిజత్ మసూద్, కైస్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత గట్టిగా ప్రతిఘటించింది. ఇబ్రహీం జద్రాన్ (114), రహ్మత్ షా (54) రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆ జట్టు పటిష్ట స్థితికి చేరేలా కనిపించింది. అయితే జయసూర్య ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 213 పరుగులకు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన ఆ జట్టు తమ చివరి తొమ్మిది వికెట్లను 83 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. జయసూర్య (5/107), అషిత ఫెర్నాండో (3/63), రజిత (2/59) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. 56 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. వికెట్ కూడా నష్టపోకుండా సునాయాసంగా విజయం సాధించింది. కరుణరత్నే 32, మధుష్క 22 పరుగులతో శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు. -
ఇదెక్కడి క్రేజీ క్యాచ్ రా సామీ.. నమ్మశక్యంగా లేదు..!
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక వికెట్‌కీపర్ సదీర సమరవిక్రమ నమ్మశక్యంకాని రీతిలో క్రేజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన వాళ్లు 'కలయా నిజమా..' అని అంటున్నారు. సమరవిక్రమ ముందుచూపుకు హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు రెహ్మత్ షా లెగ్‌సైడ్ స్వీప్ షాట్ ఆడాడు. సాధారణంగా అయితే ఈ షాట్ వికెట్‌కీపర్‌కు చాలా దూరంగా (లెగ్ స్లిప్ అనవచ్చు) వెళ్తూ బౌండరీకి చేరుకుంటుంది. అయితే షా ఈ షాట్ ఆడతాడని ముందుగానే పసిగట్టిన సమరవిక్రమ బంతి పిచ్ కాగానే లెగ్‌సైడ్ దిశగా వెళ్లి తక్కువ ఎత్తులో గాల్లోకి లేచిన బంతిని ఇట్టే పట్టేసుకున్నాడు. బ్యాటర్, బౌలర్ సహా ఈ తంతు మొత్తం చూస్తున్న వారు నివ్వెరపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. Crazy catch 😳pic.twitter.com/wQgNRGtSsO — CricTracker (@Cricketracker) February 2, 2024 కాగా, స్వదేశంలో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. అషిత ఫెర్నాండో (14.4-1-24-3), విశ్వ ఫెర్నాండో (12-1-51-4), ప్రభాత్ జయసూర్య (25-7-67-3) విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. రెండో బంతికే ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌ను (0) పెవిలియన్‌కు పంపింది. ఆతర్వాత వన్‌డౌన్ ఆటగాడు రెహ్మత్ షా (91).. మరో ఓపెనర్, అరంగేట్రం ఆటగాడు నూర్ అలీ జద్రాన్‌తో (31) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సమరవిక్రమ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ అయిన రెహ్మత్ షాను పెవిలియన్‌కు పంపిన అనంతరం ఆఫ్ఘన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 17, నసీర్ జమాల్ 0, ఇక్రమ్ అలికిల్ 21, కైస్ అహ్మద్ 21, జియా ఉర్ రెహ్మాన్ 4, నిజత్ మసూద్ 12, మొహమ్మద్ సలీం 0 పరుగులకు ఔటయ్యారు. 44 పరుగుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు (నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మొహమ్మద్ సలీం) టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. నిషాన్ మధుష్క (36), దిముత్ కరుణరత్నే (42) క్రీజ్‌లో ఉన్నారు. -
విజృంభించిన లంక బౌలర్లు.. 198 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్
స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) మొదలైన ఏకైక టెస్ట్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. అషిత ఫెర్నాండో (14.4-1-24-3), విశ్వ ఫెర్నాండో (12-1-51-4), ప్రభాత్ జయసూర్య (25-7-67-3) విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. రెండో బంతికే ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌ను (0) పెవిలియన్‌కు పంపింది. ఆతర్వాత వన్‌డౌన్ ఆటగాడు రెహ్మత్ షా (91).. మరో ఓపెనర్, అరంగేట్రం ఆటగాడు నూర్ అలీ జద్రాన్‌తో (31) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ ఔటైన అనంతరం ఆఫ్ఘన్లు మరోసారి పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 17, నసీర్ జమాల్ 0, ఇక్రమ్ అలికిల్ 21, కైస్ అహ్మద్ 21, జియా ఉర్ రెహ్మాన్ 4, నిజత్ మసూద్ 12, మొహమ్మద్ సలీం 0 పరుగులకు ఔటయ్యారు. 44 పరుగుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం. నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మొహమ్మద్ సలీం తమ కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ ప్లేయర్లు గైర్హాజరయ్యారు. లీగ్ క్రికెట్‌తో ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఆఫ్ఘన్ ప్లేయర్లు లంక పర్యటనకు రాలేకపోయారు. కాగా, ఓ టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. ఫిబ్రవరి 9, 11, 14 తేదీల్లో పల్లెకెలె వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 17, 19, 21 తేదీల్లో డంబుల్లా వేదికగా టీ20 సిరీస్ జరుగుతుంది. -
CWC 2023: ఆఫ్ఘన్ల విజయాల వెనుక మన "అజేయుడు"
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరుస సంచలనాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడిషన్‌లో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఆతర్వాత 1992 వరల్డ్‌కప్ విన్నర్ పాకిస్తాన్‌ను, తాజాగా 1996 వరల్డ్ ఛాంపియన్స్ శ్రీలంకను మట్టికరిపించారు. పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో లంకేయులను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆఫ్ఘన్లు.. మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేయాలని ఆశిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్ ఆఫ్ఘన్లు ఈ తరహాలో రెచ్చిపోవడం వెనుక ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆఫ్ఘన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ కాగా.. రెండవ వ్యక్తి ఆ జట్టు మెంటార్ ఆజయ్ జడేజా. గతంలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన జడేజా.. ఆఫ్ఘన్లకు క్రికెట్‌తో పాటు క్రికెటేతర విషయాల్లోనూ తోడ్పడుతూ వారి విజయాలకు దోహదపడుతున్నాడు. వాస్తవానికి జట్టులో మెంటార్ పాత్ర నామమాత్రమే అయినా జడేజా మాత్రం ఆఫ్ఘన్లకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. వన్ టు వన్ కోచింగ్‌తో పాటు జట్టు వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తన టైమ్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా చలామణి అయిన జడేజా.. ఆఫ్ఘన్లకు ఫీల్డింగ్ మెళకువలు కూడా నేర్పుతున్నాడు. అలాగే భారత్‌లో స్థితిగతులపై అవగాహన లేని చాలామంది ఆఫ్ఘన్ క్రికెటర్లకు తోడ్పాటునందిస్తున్నాడు. జడేజా మెంటార్షిప్లో ఆఫ్ఘన్లు మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది. కాగా, 52 ఏళ్ల జడేజా 1992-2000 మధ్యలో టీమిండియా తరఫున 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డేలు ఆడాడు. జడేజా టీమిండియాకు 13 వన్డేల్లో నాయకత్వం వహించాడు. 15 టెస్ట్‌ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 576 పరుగులు చేసిన జడేజా.. 196 వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5359 పరుగులు చేశాడు. -
లెజెండ్ కిల్లర్ ఆఫ్ఘనిస్తాన్.. ముగ్గురు జగజ్జేతలు బలి.. నెక్స్ట్ టార్గెట్ ఆసీస్
ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఏడిషన్‌లో ఇప్పటికే ఇద్దరు జగజ్జేతలను (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, 1992 వరల్డ్‌కప్ విన్నర్ పాకిస్తాన్) మట్టికరిపించిన ఆ జట్టు.. తాజాగా మరో వరల్డ్ ఛాంపియన్‌కు షాకిచ్చింది. పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు.. 1996 వరల్డ్‌కప్ విజేత శ్రీలంకను చిత్తు చేశారు. నెక్స్ట్ టార్గెట్ ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా.. వరుస సంచలనాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘన్లు తమ తదుపరి లక్ష్యం ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా అంటున్నారు. నవంబర్ 7న ఆఫ్ఘనిస్తాన్ టీమ్ పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘన్లతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు ఆస్ట్రేలియాకు షాకిస్తే ప్రపంచకప్ చరిత్రలోనే పెను సంచలనమవుతుంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ ఆటగాళ్ల ఫామ్, వారిలో ఉన్న కసి చూస్తే ఆసీస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది. మరి నవంబర్ 7న ఏం జరుగుతుందో చూడాలి. ఎంత లెజెండ్ కిల్లర్ అయినా నెదర్లాండ్స్‌తో జాగ్రత్తగా ఉండాలి.. దీనికి ముందు ఆఫ్ఘన్లు తమకంటే చిన్న జట్టు, మరో సంచనాల అడ్డా నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనున్నారు. నవంబర్ 3న ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ఏమైనా జరగవచ్చు. అయితే ఇరు జట్ల ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఆఫ్ఘన్కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆఫ్ఘన్లు నెదర్లాండ్స్, ఆతర్వాత ఆస్ట్రేలియాను ఓడిస్తే సెమీస్‌కు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత ఆఫ్ఘన్లు నవంబర్ 10న మరో పటిష్టమైన జట్టు సౌతాఫ్రికాతో తలపడతారు. ఈ లెక్కన ఆఫ్ఘనిస్తాన్ మరో రెండు సంచలన విజయాలవైపు చూసే అవకాశం ఉంటుంది. ఆసీస్, సౌతాఫ్రికాతో అంత ఈజీ కాదు.. అయితే ఆసీస్, సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్లను ఓడించడం అంత ఆషామాషీ విషయం కాదు. పెద్దగా ఫామ్‌లో లేని ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించినంత ఈజీ కాదు ఈ రెండు జట్లను ఓడించడం. ఒకవేళ ఆఫ్ఘన్లు.. ఆసీస్, సౌతాఫ్రికాల్లో ఏ జట్టును ఓడించినా, సెమీస్ రేసు సంక్లిష్టంగా (భారత్ మినహా) మారే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ మరింత రసవత్తరంగా సాగాలంటే ఆఫ్ఘన్లు మరిన్ని సంచలనాలు సృష్టించాలనే ఆశిద్దాం. లంకపై విజయం తర్వాత ఆఫ్ఘన్లు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకారు. భారత్ (12), సౌతాఫ్రికా (10), న్యూజిలాండ్ (8), ఆస్ట్రేలియా (8) తర్వాత ఆఫ్ఘనిస్తాన్ (6) ఉంది. లంకను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిని ఆఫ్ఘన్లు.. ఇదిలా ఉంటే, నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు 7 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆఫ్ఘన్లు 45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. హష్మతుల్లా షాహిది (58 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (73 నాటౌట్) ఆఫ్ఘన్లను విజయతీరాలకు చేర్చారు. రహ్మత్ షా (62) అర్ధసెంచరీతో రాణించాడు. 4 వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాశించిన ఫజల్ హక్ ఫారూఖీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. Afghanistan players thanking the Pune crowd and fans chanting their names. Lovely moments!pic.twitter.com/fzvrkOrUn1 — Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2023 -
CWC 2023: ఆఫ్ఘనిస్తాన్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ (అక్టోబర్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక, ఆతర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లు భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేయడంలో ఆఫ్ఘన్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (46), కుశాల్ మెండిస్ (39), సమరవిక్రమ (36) మంచి ఆరంభాలు లభించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తీక్షణ (29), ఏంజెలో మాథ్యూస్ (23), అసలంక (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. దిముత్ కరుణరత్నే (15), ధనంజయం డిసిల్వ (14), చమీర (1), రజిత (5) నిరాశపరిచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 4, ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హాక్ ఫారూఖీ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక -
CWC 2023: లంకతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇవాళ శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌ల్లో తమకంటే చాలా రెట్లు మెరుగైన జట్లపై విజయాలు సాధించి జోరుమీదున్నాయి. ఆఫ్ఘనిస్తాన్.. పాక్‌పై, శ్రీలంక.. ఇంగ్లండ్‌పై సంచలన విజయాలు సాధించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఐదో స్థానంలో ఉండగా.. 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఆఫ్ఘనిస్తాన్ ఏడో స్థానంలో కొనసాగుతుంది. తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హాక్ ఫారూఖీ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక -
శ్రీలంక ఘోర పరాజయం.. సెమీఫైనల్లో ఆఫ్గానిస్తాన్
ఏషియన్ గేమ్స్ 2023 పురుషల క్రికెట్లో శ్రీలంకకు ఆఫ్గానిస్తాన్‌కు బిగ్ షాకిచ్చింది. హాంగ్జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్ జట్టు అడుగుపెట్టింది. కాగా 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆఫ్గాన్ బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ నైబ్, కైస్ అహ్మద్ తలా మూడు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు జహీర్ ఖాన్, జనత్, ఆష్రాప్ తలా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్.. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో 116 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్ బ్యాటర్లలో నూర్ అలీ జద్రాన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో నువాన్ తుషారా 4 వికెట్లు పడగొట్టగా.. సహన్ అరాచ్చిగే రెండు, సమరాకూన్ తలా, విజయ్‌కాంత్ చెరో వికెట్ సాధించారు. చదవండి: Asian Games 2023: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్ -
శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం
గువహటి వేదికగా శ్రీలంకతో జరిగిన వామప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 158 పరుగులు మెండిస్ చేశాడు. అతడితో పాటు సమరవిక్రమ(39), నిసాంక(30) పరుగులతో పర్వాలేదనపించారు. ఆఫ్గాన్ బౌలర్లలో నబీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్, నవీన్ ఉల్-హక్, రషీద్ ఖాన్, ఫరూఖీ తలా వికెట్ సాధించారు. అనంతరం వర్షం కారణంగా అఫ్గానిస్తాన్ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. అఫ్గాన్ 38.1 ఓవర్లలో 4 వికెట్లకు 261 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆఫ్గాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్(119), రెహామత్ షా(93) పరుగులతో అదరగొట్టారు. చదవండి: ODI WC 2023: ఆసీస్‌దే విజయం.. వరుసగా రెండో మ్యాచ్‌లో పాక్ ఓటమి -
Asia Cup 2023: మొహమ్మద్ నబీ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో నబీ విధ్వంసకర అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు ఈ రికార్డు ముజీబ్ పేరిట ఉండేది. ముజీబ్ ఇదే ఏడాది పాక్‌పై 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. అంతకుముందు రషీద్ ఖాన్ (27 బంతుల్లో), మొహ్మమద్ నబీ (28), షఫీకుల్లా షిన్వారి (28) ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేశారు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా ట్రాక్ మార్చుకుని గెలుపుబాట పట్టింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. కుశాల్ మెండిస్ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (41), అసలంక (36), దునిత్ వెల్లెలెగె (33 నాటౌట్), కరుణరత్నే (32), తీక్షణ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బదిన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్ 2, ముజీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నబీ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకపడటంతో 31 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసి, విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. -
పడి లేచిన శ్రీలంక.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం
ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కోల్పోయిన లంకేయులు, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 7) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో లంక బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు తలవంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. చమీర (4/63), హసరంగ (3/7), లహీరు కుమార (2/29), తీక్షణ (1/16) చెలరేగడంతో 22.2 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో నబీ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (51), దిముత్ కరుణరత్నే (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కేవలం 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ తరుపు ముక్క రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాటింగ్‌లో 8 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రషీద్.. 4 ఓవర్లు బౌల్ చేసి వికెట్ లేకుండా 21 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, ఈ సిరీస్ అనంతరం ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. అక్కడ వీరు ఓ టెస్ట్, 3 వన్డేలు, 2 టీ20లు ఆడనున్నారు. చదవండి: WTC Final: ఏం ప్రాక్టీస్ చేశారని గెలవడానికి .. గెలుపు ఆస్ట్రేలియాదే..! -
ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు.. భారీ విజయం
తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి శ్రీలంక ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 4) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్‌లో ఆతర్వాత బౌలింగ్‌లో రెచ్చిపోయిన లంకేయులు.. పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గెలుపొందారు. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. ఓ దశలొ (146/2) విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినప్పటికీ.. స్పిన్నర్ ధనంజయ డిసిల్వ (10-0-39-3) ఆ జట్టును భారీగా దెబ్బకొట్టాడు. సెట్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (54), హస్మతుల్లా షాహిది (57)లను ఔట్ చేసి ఆఫ్ఘన్ల ఓటమికి బీజం వేశాడు. అనంతరం హసరంగ (9-2-42-3) వారి పతనాన్ని శాశించాడు. వీరితో పాటు చమీరా (2/18), తీక్షణ (1/35), షనక (1/29) తలో చేయి వేయడంతో ఆఫ్ఘన్లు 42.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. ఫలితంగా 132 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్, షాహిది హాఫ్ సెంచరీలతో రాణించగా.. రహ్మత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (28) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. -
తొలి వన్డేలో పరాభవం ఎఫెక్ట్.. రెండో వన్డేలో లంక బ్యాటర్ల ఉగ్రరూపం
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 4) రెండో వన్డే ఆడుతుంది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం (ఓటమి) నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. భారీ స్కోర్ చేశారు. ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 11 పరుగులకే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ధాటిగా ఆడే రహ్మానుల్లా గుర్భాజ్ 12 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి చమీర బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 28/1గా ఉంది. రహ్మత్ షా (9), ఇబ్రహీమ్ జద్రాన్ (14) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, అంతకుముందు తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్.. తమ కంటే మెరుగైన శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేదనలో ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. -
ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. తమ కంటే మెరుగైన జట్టుపై ఘన విజయం
SL VS AFG 1st ODI: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోటలో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. రషీద్ ఖాన్ లాంటి స్టార్ స్పిన్నర్ లేకపోయినా ఆఫ్ఘన్లు.. లంకేయులకు భారీ షాకిచ్చారు. యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, తమ కంటే పటిష్టమైన లంకేయులను 6 వికెట్ల తేడాతో మట్టికరించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆది నుంచే అద్భుతంగా ఆడి, మరో 19 బంతులుండగానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (14) విఫలమైనా.. ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించి, ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని ఖరారు చేశారు. ఆఖర్లో కెప్టెన్ హస్మతుల్లా షాహిది (38), మహ్మద్ నబీ (27 నాటౌట్) బాధ్యతగా ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు. ఐపీఎల్-2023లో సీఎస్కే తరఫున ఇరగదీసిన పేసర్ మతీష పతిరణ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టిన పతిరణ.. 8.5 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ మాత్రమే పడగొట్టాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహీరు కుమార ఓ వికెట్ దక్కించుకున్నారు. పతిరణతో పాటు అరంగేట్రం చేసిన స్పిన్నర్ దుషన్ హేమంత (9-0-50-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 46.5 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి. చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..! -
SL VS AFG 1st ODI: రాణించిన అసలంక, డిసిల్వ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 2) తొలి వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్-2023లో సీఎస్కే తరఫున సత్తా చాటిన మతీష పతిరణ.. ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. పతిరణతో పాటు లెగ్ బ్రేక్ బౌలర్ దుషన్ హేమంత కూడా ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్, ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్ను సమస్య కారణంగా లంకతో సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉండగా.. ఐపీఎల్ సహచర ఆటగాడు (గుజరాత్ టైటాన్స్) నూర్ అహ్మద్ నేటి మ్యాచ్ బరిలో నిలిచాడు. ఐపీఎల్ సెంటర్ పాయింట్ అయిన మరో ఆఫ్ఘన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో పాల్గొంటున్నాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి. -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. శ్రీలంక జట్టులో చోటు కొట్టేశాడు!
స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఆఫ్గాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే ప్రస్తుతం తొలి రెండు వన్డేలకు మాత్రమే జట్టును శ్రీలంక సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ జట్టుకు దాసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఇక ఈ జట్టులో ఐపీఎల్-2023లో అదరగొట్టిన పేసర్ మతీషా పతిరానాను చోటుదక్కింది. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచడంతో పతిరానాకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన జూనియర్ మలింగా.. 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆఫ్గాన్ సిరీస్‌తో పతిరానా వన్డేల్లో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది ఆగస్టులో ఇదే ఆఫ్గాన్ జట్టుపై టీ20ల్లో పతిరానా డెబ్యూ చేశాడు. మరోవైపు లంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ఛానాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కింది. దిముత్ కరుణరత్నే 2021లో చివరిసారిగా వన్డేల్లో లంక తరపున ఆడాడు. అదేవిధంగా స్టార్ పేసర్ దుష్మంత చమీర కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. చమీర గాయం కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫియర్స్ సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 శ్రీలంక లేకపోవడంతో క్వాలిఫియర్స్ ఆడనుంది. ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుషాన్ హేమంత, చమిక కరుణరత్నే, పతిరున హేమంత, చమిక కరుణరత్నే, చమీరా, మతీషా పతిరానా, కుమారా, రజితా చదవండి: IPL 2023: సీఎస్కే గెలవగానే.. జడేజా భార్య రివాబా ఏం చేసిందంటే? వీడియో వైరల్ -
Asia Cup 2022 Final: అలా అయితేనే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! లేదంటే మనం ఇంటికే!
Asia Cup 2022 - How India Can Qualify Final: ఆసియా కప్-2022 టీ20 సూపర్-4 దశను టీమిండియా ఓటమితో ఆరంభించింది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 4) దాయాది పాకిస్తాన్‌తో పోరులో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రోహిత్ సేన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ముందుకు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. మరి ఫైనల్ రేసులో టీమిండియా నిలిచేందుకు అవసరమైన సమీకరణాలు ఏమిటో గమనిద్దాం. అప్పుడు భారత్.. ఇప్పుడు పాకిస్తాన్ లీగ్ దశలో తమ మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్స్ బాదడంతో రోహిత్ సేన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, సూపర్-4 మొదటి మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయింది. గత మ్యాచ్ తరహాలోనే ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో గెలుపు పాక్‌ను వరించింది. యాధృచ్చికంగా టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధిస్తే.. పాకిస్తాన్ సైతం ఐదు వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలి ఉండగా గెలుపును సొంతం చేసుకుంది. అందుకే మనకంటే మెరుగ్గా పాకిస్తాన్ ఇదిలా ఉంటే లీగ్ దశలో హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో గెలుపొందితే.. పాకిస్తాన్ ఏకంగా 155 పరుగుల తేడాతో పసికూనపై జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్(0.126).. టీమిండియా(-0.126) కంటే రన్‌రేట్ పరంగా మెరుగైన స్థితిలో ఉంది. రెండేసి పాయింట్లతో శ్రీలంక, పాకిస్తాన్ ఆసియా కప్-2022 టీ20 టోర్నీ లీగ్ దశలో అఫ్గనిస్తాన్ చేతిలో పరాభవానికి శ్రీలంక.. సూపర్-4 తొలి మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. చివరి ఓవర్ మొదటి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో అఫ్గన్‌ను ఓడించి లంక విజయం సాధించింది. ఈ క్రమంలో రెండు పాయింట్లు సాధించి సూపర్-4 టాపర్‌గా ఉంది. పాకిస్తాన్ సైతం టీమిండియాపై గెలుపుతో రెండు పాయింట్లు సాధించగా.. రన్‌రేటు పరంగా శ్రీలంక(0.589) పటిష్ట స్థితిలో ఉంది. ఇక ఇప్పటికే సూపర-4 దశలో ఒక్కో మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా, అఫ్గనిస్తాన్ సున్నా పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ముందు దసున్ షనక బృందాన్ని, తర్వాత అఫ్గన్‌ను చిత్తు చేస్తేనే.. సూపర్-4 స్టేజ్‌లో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడనుంది. దుబాయ్ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 6) రాత్రి ఏడున్నర గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబరు 8(గురువారం)న భారత్- అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లలో ఒక్కటి ఓడినా.. టీమిండియా ఇంటిబాట పట్టక తప్పదు. ఎందుకంటే శ్రీలంక, పాకిస్తాన్‌లు ఇప్పటికే ఒక్కో విజయంతో పటిష్ట స్థితిలో ఉన్నాయి. లంక టీమిండియాను ఓడించి, అఫ్గన్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడితే చాలు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఇతర జట్ల పరిస్థితి? ఇక పాకిస్తాన్.. అఫ్గనిస్తాన్ లేదంటే శ్రీలంకను ఓడిస్తే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. అదే విధంగా.. ఒకవేళ శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్లను భారత్ ఓడించినట్లయితే.. ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్ పోరును మరోసారి వీక్షించే అవకాశం అభిమానులకు దక్కుతుంది. అలా కాకుండా.. ఏ రెండు ఇతర జట్లు వరుసగా భారీ విజయాలు నమోదు చేసినా.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ సైతం భారత్, పాకిస్తాన్‌ను ఓడిస్తే ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. చదవండి: Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్ నేలపాలు.. అర్ష్‌దీప్‌పై మండిపడ్డ రోహిత్! వైరల్ Asia Cup 2022 - Ind Vs Pak: పంత్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. ఎందుకంటే..? -
ఆఫ్గానిస్తాన్‌పై శ్రీలంక ప్రతీకారం తీర్చుకోనుందా..?
ఆసియాకప్-2022లో లీగ్ దశ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి. గ్రూపు-ఎ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఆఫ్గానిస్తాన్, శ్రీలంక సూపర్-4లో అడుగు పెట్టాయి. ఇక ఈ మెగా టోర్నీలో సూపర్-4 దశకు శనివారం తెరలేవనుంది. సూపర్-4లో భాగంగా తొలి మ్యాచ్‌లో గ్రూపు-బి నుంచి ఆఫ్గానిస్తాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ షార్జా వేదికగా శనివారం(సెప్టెంబర్-3) సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా అంతకుముందు ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 27న శ్రీలంకను ఆఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. ఆఫ్గానిస్తాన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన నబీ సేన.. అన్నింటిల్లోనూ విజయం సాధించి గ్రూప్-బి నుంచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక శ్రీలంక విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్ చేతిలో ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. అయితే తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిడం ఆ జట్టుకు కాస్త ఊరటను కలిగించింది. హాట్ ఫేవరేట్‌గా ఆఫ్గానిస్తాన్ ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆఫ్గానిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు నజీబుల్లా జద్రాన్ కూడా దుమ్ము రేపుతున్నాడు. కాగా ప్రస్తుత ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా ఆఫ్గానిస్తాన్ కొనసాగిస్తే.. సూనయసంగా విజయం సాధించడం ఖాయం. బౌలర్లు చేలరేగితే! ఇక శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిల్లోనూ విఫలమైన లంక, రెండు మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ పరంగా అదరగొట్టింది. అయితే ఆ జట్టులో అనుభవం ఉన్న బౌలర్ ఒక్కరు కూడా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హాసరంగా ఉన్నప్పటికీ అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు రాణిస్తే ఆఫ్గాన్‌కు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం. బ్యాటింగ్‌లో కుశాల్ మెండిస్, కెప్టెన్ శనక మంచి టచ్‌లో ఉన్నారు. ఇక తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై ఓటమికి లంక బదులు తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి. చదవండి: Ind Vs Pak: హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరూ తుది జట్టులో ఉండాల్సిందే! -
Asia Cup 2022: శ్రీలంక జట్టుకు ఊహించని షాక్!
Asia Cup 2022 Sri Lanka Squad: ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కీలక బౌలర్ దుష్మంత చమీర ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. టీమ్ ప్రాక్టీసు సందర్భంగా అనుకోకుండా అతడికి గాయమైంది. ఎడమ కాలి నొప్పి తీవ్రతరం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆంటన్ రక్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ధ్రువీకరించాడు. ఈ మేరకు చమీరతో దిగిన ఫొటోను షేర్ చేసిన ఆంటన్.. ‘‘నేను ఇప్పటి వరకు కలిసి మంచి వ్యక్తులలో తనూ ఒకడు. ఆట పట్ల అంకితభావం కలవాడు. తను గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, దుషీ కచ్చితంగా రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తాడని నమ్మకం ఉంది. అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ నాటికి తను తిరిగి వస్తాడు. క్రీడాకారులు గాయాలపాలు కావడం సహజమే. అయితే, కోలుకునే క్రమంలో మనల్ని మనం దృఢంగా ఉంచుకోవాలి. త్వరలోనే నిన్ను కలుస్తాము దుషీ’’ అని పేర్కొన్నాడు. దుష్మంత చమీర త్వరగా కోలుకుని జట్టులోకి తిరిగి రావాలని ఆకాంక్షించాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్-2022 టోర్నమెంట్ ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగా జరుగనున్న ఈవెంట్ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక.. అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇక కీలక పేసర్ చమీర దూరం కావడం లంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. చమీర స్థానంలో నువాన్ తుషార జట్టులోకి రానున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చమీర.. అదే ఏడాది పాకిస్తాన్‌తో సిరీస్‌తో టెస్టుల్లో, విండీస్‌తో మ్యాచ్‌తో టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 44, టెస్టుల్లో 32, టీ20లలో 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహా హర్షల్ పటేల్.. పాకిస్తాన్ కీలక బౌలర్ షాహిన్ ఆఫ్రిది సైతం ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. చదవండి: IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్ Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక View this post on Instagram A post shared by Anton Roux (@_anton_roux) -
అఫ్గాన్ లక్ష్యం 187
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 201 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరీరా(78) హాఫ్ సెంచరీ సాధించగా, కెప్టెన్ దిముత కరుణరత్నే(30), లహిరు తిరుమన్నే(25)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌కు వరుణడు ఆటంకం కల్గించడంతో 41 ఓవర్లకు కుదించారు. దాంతో డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం అఫ్గాన్‌కు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీలంక జట్టు 33 ఓవర్లులో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల వద్ద ఉండగా ఆకస్మాత్తుగా వర్షం పడింది. దాంతో మ్యాచ్‌కు దాదాపు మూడు గంటల అంతరాయం కల్గింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికి లసిత్ మలింగా తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరగా, నువాద్ ప్రదీప్ డకౌట్ అయ్యాడు. దాంతో శ్రీలంక 36.5 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్ దిముత్ కరుణరత్నే- కుశాల్ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా, తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్ స్పిన్నర్ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై స్వల్ప సమయాల్లో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. అఫ్గాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ వేసిన 22 ఓవర్లో లంకేయులు మూడు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ ఓవర్ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్ చేసిన నబీ.. నాల్గో బంతికి కుశాల్ మెండిస్(2), ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆపై హమిద్ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్ కాగా, తిషారా పెరీరా(2) కూడా నిరాశపరిచాడు. ఇక బాధ్యతాయుతంగా ఆడిన కుశాల్ పెరీరా(78) ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. కుశాల్ పెరీరా ఔటైన తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ ఆరంభమయ్యాక లంక మరో 19 పరుగులు చేసి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ నాలుగు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, దావ్లాత్ జద్రాన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. హమిద్ హసన్‌కు వికెట్ దక్కింది. -
శ్రీలంక-అఫ్గాన్ల మ్యాచ్‌కు వర్షం అంతరాయం
కార్డిఫ్: వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంక-అఫ్టానిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అకస్మాత్తుగా వర్షం రావడంతో అంపైర్లు ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు. పిచ్‌ను, ఔట్ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి శ్రీలంక 33 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 182పరుగులు చేసింది. క్రీజులో లక్మల్(2) మలింగ (0) ఉన్నారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్ దిముత్ కరుణరత్నే- కుశాల్ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా, తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్ స్పిన్నర్ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై స్వల్ప సమయాల్లో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. ది. అఫ్గాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ వేసిన 22 ఓవర్లో లంకేయులు మూడు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ ఓవర్ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్ చేసిన నబీ.. నాల్గో బంతికి కుశాల్ మెండిస్(2), ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆపై హమిద్ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్ కాగా, తిషారా పెరీరా(2) కూడా నిరాశపరిచాడు. ఇక బాధ్యతాయుతంగా ఆడిన కుశార్ పెరీరా(78) ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ నాలుగు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, దావ్లాత్ జద్రాన్, హమిద్ హసన్‌లు తలో వికెట్ తీశారు.