కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమై ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక రెండో పోరుకు సిద్ధమైంది. సంచలనాల జట్టు అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక తలపడుతోంది.కివీస్ చేతిలో 136 పరుగులకే ఆలౌటైన శ్రీలంక పసికూన కంటే ఘోరంగా విఫలమైంది. ఇక తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడినా అఫ్గాన్ ఆట ఆకట్టుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు షాకిచ్చిన అఫ్గాన్.. ప్రపంచకప్‌లో మరో సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ముఖాముఖి రికార్డులో శ్రీలంక, అఫ్గాన్‌లు మూడుసార్లు తలపడగా, రెండింట్లో శ్రీలంక.. ఒకదాంట్లో అఫ్గాన్ పైచేయి సాధించాయి. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు శ్రీలంక, అఫ్గాన్ ఒకే ఒక్క మ్యాచ్‌లో తలపడ్డాయి. 2015లో జరిగిన ఆ మ్యాచ్‌లో అఫ్గాన్‌పై శ్రీలంకదే విజయం. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
శ్రీలంక జట్టులో తిషారా పెరీరా, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగాలు కీలక ఆటగాళ్‌లు కాగా, అఫ్గాన్ జట్టులో షహజాద్, రషీద్ ఖాన్, రహ్మత్ షా, గుల్బదిన్, నబీలు ప్రధాన ఆటగాళ్లు. ఈ రెండు జట్ల తొలి మ్యాచ్ ప్రదర్శన చూస్తే ఎవరైనా ఈ పోరులో శ్రీలంకకు కష్టాలు తప్పవనే అంటారు. గుల్బదిన్ నైబ్ సారథ్యంలోని అఫ్గానిస్తాన్ కూడా తొలి మ్యాచ్‌లో ఓడింది... కానీ ప్రపంచకప్‌లో అద్వితీయమైన రికార్డు ఉన్న ఆసీస్‌ను సమర్థంగా ఎదుర్కొంది. ఓపెనర్లు షహజాద్, హజ్రతుల్లా డకౌట్ కావడం, ఆల్‌రౌండర్ నబీ విఫలమవడంతో తడబడింది. లేదంటే మరింత మెరుగైన స్కోరు చేసేది. ఈ మ్యాచ్‌లో వీళ్లంతా కష్టపడితే మాత్రం అఫ్గాన్ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచి బోణీ కొడతారో చూడాలి.
శ్రీలంక
దిముత్ కరుణరత్నే(కెప్టెన్), లహిరు తిరుమన్నే, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిషారా పెరీరా, ఇసురు ఉదాన, నువాన్ ప్రదీప్, సురంగా లక్మల్, లసిత్ మలింగా
అఫ్గానిస్తాన్
గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), మహ్మద్ షెహజాద్, హజ‍్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, దావ్లాత్ జద్రాన్, ముజీబ్ ఉర్ రహ్మన్, హమీద్ హసన్
Comments
Please login to add a commentAdd a comment