Cardiff
-
ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఇంగ్లండ్‌దే టి20 సిరీస్
కార్డిఫ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు -
40 ఏళ్లు చీకటి గుహలో..60 ఏళ్లు కప్‌బోర్డులో..
కార్డిఫ్ : అది 1919 సంవత్సరం! వేల్స్‌కు చెందిన మామి స్టువర్ట్ అనే 26 ఏళ్ల యువతి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమెకోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇటు బంధువులు అటు పోలీసులు ఆమె గురించి వెతకటం దండగనుకున్నారు. సండర్లాండ్కు చెందిన మామి 1918లో జార్జ్ శాటన్ అనే ఓ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత వేల్స్‌కు వచ్చేశారు. ఓ ఏడాదికి.. 1919లో ఆమె కనపించకుండాపోయింది. పోలీసులు ఆమె భర్తపై అనుమానంతో అతడ్ని విచారించారు. అయితే అతడే హత్య చేశాడనటానికి ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో వదిలేశారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత 1961లో వేల్స్‌లోని ఓ గనిలో ఆమె అస్తి పంజరం దొరికింది. దుండగులు ఆమెను దారుణంగా చంపి, మూడు భాగాలుగా చేసి గనిలోని ఓ చీకటి గుహలో పడేశారు. ఆమె అస్తిపంజరంపై ఉన్న నగల ఆధారంగా అది మామి స్టువర్ట్ అని గుర్తించారు. ఆ తర్వాత దాన్ని కార్డిఫ్‌లోని ఫోరెన్సిక్ లాబరేటరీకి తరలించారు. ఆ అస్తిపంజరాన్ని లాబరేటరీలోని ఓ కప్‌బోర్డులో ఉంచారు. అలా 60 సంవత్సరాల పాటు మామి అస్తిపంజరం ఆ కప్బోర్టులోనే ఉండిపోయింది. కొద్దిరోజుల క్రితం మామి బంధువొకరు ఆమె అస్తిపంజరాన్ని బయటకు తెప్పించింది. మామి చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత ఆమె తల్లిదండ్రులను సమాధి చేసిన సండర్లాండ్ స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
77 ఏళ్ల వ్యక్తి దొంగకు చుక్కలు చూపించాడు
-
బాక్సింగ్‌తో దొంగకు చుక్కలు చూపించాడు
కార్డిఫ్ : అమెరికాలో ఒక వృద్దుడు తన బాక్సింగ్ పంచ్‌లతో ఒక దొంగకు చుక్కలు చూపెట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. యూకేలో కార్డిఫ్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో 77 ఏళ్ల వ్యక్తి తన కారును పార్క్ చేసి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ముసలాయన తిరిగి కారు వద్దకు వెళుతుండగా ఒక వ్యక్తి ముసుగు వేసుకొని అతనికి అడ్డు వచ్చి డబ్బులు ఇవ్వమంటూ దౌర్జన్యం చేశాడు. అయితే అసలు మలుపు ఇక్కడే చోటుచేసుకుంది. దీనికి తాత భయపడక పోగా దొంగపై తన బాక్సింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. దొంగకు తన పంచ్‌లతో ముచ్చెమటలు పట్టించాడు. ఆ దొంగ ఈ తాతతో అనవసరంగా పెట్టుకున్నానంటూ అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. కానీ తాత అతన్ని అంత తేలిగ్గా ఏం వదల్లేదు. చివరకు ఎలాగోలా తాత పంచ్‌ల నుంచి బతుకుజీవుడా అనుకుంటూ దొంగ అక్కడినుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయింది. దీనిని కాస్త కార్డిఫ్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తాత చేసిన పనికి పొగడ్తలతో ముంచెత్తారు. తాత ప్రదర్శించిన ధైర్య సాహసాలు అదుర్స్ అని.. తాత తన స్కూల్లో నేర్చుకొన్న బాక్సింగ్ స్కిల్స్ ఇప్పుడు పనికివచ్చాయంటూ.. తాతయ్య చేసిన సాహసం మా కుర్రకారుకు ఇన్స్పిరేషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. -
దక్షిణాఫ్రికా బోణీ కొట్టేనా?
కార్డిఫ్: వరల్డ్‌కప్‌లో వరుసగా ఇంగ్లండ, బంగ్లాదేశ్, భారత చేతిలో ఓడిన సఫారీ జట్టు బోణీ కోసం ఆరాటపడుతోంది. విండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని సెమీస్ అవకాశాల్ని దాదాపు కోల్పోయిన దక్షిణాఫ్రికా.. అఫ్గానిస్తాన్‌పై గెలిచి ఖాతా తెరవాలని యోచిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్ కూడా ఇప్పటివరకూ మ్యాచ్ గెలవలేదు. ఫ్గానిస్తాన్ కూడా వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఆసీస్, లంక, కివీస్‌లను ఎదుర్కోలేకపోయింది. అయితే దక్షిణాఫ్రికాలాంటి పటిష్ట జట్టును ఓడిస్తుందన్న నమ్మకం లేకపోయినా... రోజు కలిసొస్తే, సఫారీకి దురదృష్టం వెంటాడితే మాత్రం అఫ్గాన్ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇరు జట్లు బోణీ కొట్టాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతుండటంతో ఆసక్తికర సమరం జరగవచ్చు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు అఫ్గాన్ గుల్బదిన్ నైబ్(కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, నూర్ అలీ జద్రాన్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, అఫ్తాబ్ అలం, హమిద్ హసన్ దక్షిణాఫ్రికా డుప్లెసిస్(కెప్టెన్), డీకాక్, హషీమ్ ఆమ్లా, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వోయో, క్రిస్ మోరిస్, కగిసో రబడ, ఇమ్రాన్ తాహీర్, హెండ్రిక్స్ -
ఇంగ్లండ్ చితక్కొట్టేసింది..
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరుగుల మోత మోగించింది. జేసన్ రాయ్(153; 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకానికి తోడు బెయిర్ స్టో(51; 50 బంతుల్లో 6 ఫోర్లు), జోస్ బట్లర్(64; 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ 387 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. దాంతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను జేసన్ రాయ్-బెయిర్ స్టోల జోడి ఆరంభించింది. తొలుత పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకున్నాక బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ జోడి 128 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత బెయిర్ స్టో తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో జేసన్ రాయ్‌కు జత కలిసిన జో రూట్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 77 పరుగుల్ని జత చేసిన తర్వాత రూట్(21) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరగా,ఆపై మరో 30 పరుగుల వ్యవధిలో రాయ్ కూడా ఔటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ 235 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో జోస్ బట్లర్-ఇయాన్ మోర్గాన్‌లు బంగ్లా బౌలర్లపై మరోసారి ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 95 పరుగులు జత చేసిన పిదప బట్లర్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై కాసేపటికి మోర్గాన్(35), స్టోక్స్(6)లు కూడా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ 341 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను నష్టపోయింది. స్కోరును పెంచే క్రమంలో వీరిద్దరూ భారీ షాట్లకు యత్నించి పెవిలియన్ చేరారు. చివర్లో క్రిస్ వోక్స్(18 నాటౌట్; 8 బంతుల్లో 2 సిక్సర్లు), ప్లంకెట్(27 నాటౌట్; 9 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇది వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు అత్యుత్తమ స్కోరు కాగా, ఓవరాల్‌గా మెగా టోర్నీలో ఏడో అత్యుత్తమ స్కోరుగా నమోదైంది. ఇక వన్డేల్లో బంగ్లాపై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యుత్తమం. తాజా మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, మెహిదీ హసన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్తజా, ముస్తాఫిజుర్‌లకు చెరో వికెట్ లభించింది. -
అంపైర్‌ను పడేసిన రాయ్!
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 30 ఓవర్లు ముగిసే సరికి వికెట్ మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ శతకంతో మెరిశాడు. 93 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో జేసన్ రాయ్ సెంచరీతో మెరిశాడు. కాగా, రాయ్ సెంచరీని పూర్తి చేసే క్రమంలో అంపైర్‌ను కిందపడేశాడు. ముస్తాఫిజుర్ వేసిన 27 ఓవర్ ఐదో బంతిని డీప్ స్వేర్ లెగ్ వైపు ఆడాడు. అది బంగ్లా ఫీల్డర్ చేతుల్లోంచి మిస్ కావడంతో బౌండరీ లైన్‌ను తాకింది. ఈ క్రమంలోనే బంతిని చూస్తూ నాన్ స్టైకింగ్ ఎండ్‌లోకి వస్తున్న రాయ్.. అమాంతం అంపైర్ జోయల్ విల్సన్‌ను ను ఢీకొట్టాడు. అదే సమయంలో అంపైర్ కూడా బంతినే చూస్తుండటంతో అనుకోకుండా ఇద్దరు ఢీకొన్నారు. దాంతో అంపైర్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అంపైర్‌కు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాన్ని గ్యాలరీ నుంచి చూసిన ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం పడి పడి నవ్వుకున్నారు. బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ చేసి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. -
అంపైర్‌ను కిందపడేసిన జేసన్ రాయ్
-
జేసన్ రాయ్ దూకుడు
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ తనదైన బ్యాటింగ్ శైలితో దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఆదిలో నెమ్మదిగా ఆడిన రాయ్..ఆపై బంగ్లా బౌలర్లపై దాడికి దిగాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించాడు. జేసన్ రాయ్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా సైఫుద్దీన్ వేసిన 12 ఓవర్ రెండో బంతిని సిక్స్ కొట్టిన రాయ్.. ఆ మరుసటి బంతికి ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. దాంతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను జేసన్ రాయ్-బెయిరన్ స్టోల జోడి ఆరంభించింది. తొలుత పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకున్నాక బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒకవైపు రాయ్ ధాటిగా బ్యాటింగ్ చేయగా, బెయిర్ స్టో మాత్రం స్టైక్ రోటేల్ చేస్తూ సింగిల్స్ తీయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఫలితంగా 15 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా వంద పరుగుల మార్కును చేరింది. -
ఇంగ్లండ్‌పై బంగ్లా ‘హ్యాట్రిక్’ సాధించేనా?
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో హాట్ పేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బంగ్లాదేశ్‌తో పోరుకు సన్నద్ధమైంది. గత రెండు ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్ దానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. మరొకవైపు ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ వరల్డ్‌కప్ విజయం సాధించాలనే పట్టుదలతో బంగ్లా బరిలోకి దిగింది. గడిచిన నాలుగేళ్లలో ఈ రెండు జట్లు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్ భీకరంగా పురోగతి సాధించగా... బంగ్లా అన్ని పెద్ద జట్లకూ దీటుగా నిలుస్తోంది. ముఖాముఖి పోరులో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 వన్డేలు జరగ్గా 16 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది. నాలుగింటిలో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో మాత్రం బంగ్లాదే పైచేయి కావడం విశేషం. ఇక వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచ్‌లాడగా... రెండింటి (2011, 15)లో బంగ్లాదేశ్, ఒకదాంట్లో (2007) ఇంగ్లండ్ నెగ్గాయి. ఈ వికెట్ కొంత నెమ్మదిగానూ ఉంటుంది. మరొకవైపు బౌండరీ పరిధి చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మొర్తజా ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తుది జట్లు ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, జోనీ బెయిర్‌స్టో, జోరూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషిద్, లియామ్ ప్లంకెట్, మార్క్ వుడ్ బంగ్లాదేశ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ మిధున్, మొహ్మదుల్లా, మొసదెక్ హాసన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, ముస్తాఫిజర్ రహ్మాన్ -
అఫ్గాన్ లక్ష్యం 187
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 201 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరీరా(78) హాఫ్ సెంచరీ సాధించగా, కెప్టెన్ దిముత కరుణరత్నే(30), లహిరు తిరుమన్నే(25)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌కు వరుణడు ఆటంకం కల్గించడంతో 41 ఓవర్లకు కుదించారు. దాంతో డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం అఫ్గాన్‌కు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీలంక జట్టు 33 ఓవర్లులో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల వద్ద ఉండగా ఆకస్మాత్తుగా వర్షం పడింది. దాంతో మ్యాచ్‌కు దాదాపు మూడు గంటల అంతరాయం కల్గింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికి లసిత్ మలింగా తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరగా, నువాద్ ప్రదీప్ డకౌట్ అయ్యాడు. దాంతో శ్రీలంక 36.5 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్ దిముత్ కరుణరత్నే- కుశాల్ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా, తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్ స్పిన్నర్ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై స్వల్ప సమయాల్లో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. అఫ్గాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ వేసిన 22 ఓవర్లో లంకేయులు మూడు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ ఓవర్ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్ చేసిన నబీ.. నాల్గో బంతికి కుశాల్ మెండిస్(2), ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆపై హమిద్ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్ కాగా, తిషారా పెరీరా(2) కూడా నిరాశపరిచాడు. ఇక బాధ్యతాయుతంగా ఆడిన కుశాల్ పెరీరా(78) ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. కుశాల్ పెరీరా ఔటైన తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ ఆరంభమయ్యాక లంక మరో 19 పరుగులు చేసి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ నాలుగు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, దావ్లాత్ జద్రాన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. హమిద్ హసన్‌కు వికెట్ దక్కింది. -
శ్రీలంక-అఫ్గాన్ల మ్యాచ్‌కు వర్షం అంతరాయం
కార్డిఫ్: వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంక-అఫ్టానిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అకస్మాత్తుగా వర్షం రావడంతో అంపైర్లు ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు. పిచ్‌ను, ఔట్ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి శ్రీలంక 33 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 182పరుగులు చేసింది. క్రీజులో లక్మల్(2) మలింగ (0) ఉన్నారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్ దిముత్ కరుణరత్నే- కుశాల్ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా, తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్ స్పిన్నర్ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై స్వల్ప సమయాల్లో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. ది. అఫ్గాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ వేసిన 22 ఓవర్లో లంకేయులు మూడు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ ఓవర్ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్ చేసిన నబీ.. నాల్గో బంతికి కుశాల్ మెండిస్(2), ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆపై హమిద్ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్ కాగా, తిషారా పెరీరా(2) కూడా నిరాశపరిచాడు. ఇక బాధ్యతాయుతంగా ఆడిన కుశార్ పెరీరా(78) ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ నాలుగు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, దావ్లాత్ జద్రాన్, హమిద్ హసన్‌లు తలో వికెట్ తీశారు. -
ఆ ఓవర్లో లంకకు ‘మూడింది’
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక మరోసారి తడ‘బ్యాటు’కు గురైంది. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో లంకకు శుభారంభం లభించినా ఆ జట్టు ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అఫ్గాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ వేసిన 22 ఓవర్లో లంకేయులు మూడు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ ఓవర్ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్ చేసిన నబీ.. నాల్గో బంతికి కుశాల్ మెండిస్(2), ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో లంక 146 పరుగుల వద్ద నాల్గో వికెట్‌నష్టపోయింది. లంక కోల్పోయిన తొలి నాలుగు వికెట్లు నబీ ఖాతాలో పడటం మరో విశేషం. సంచనాలకు మారుపేరైన అఫ్గానిస్తాన్ బౌలింగ్‌లో విజృంభిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్ దిముత్ కరుణరత్నే- కుశాల్ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా, తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్ స్పిన్నర్ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై స్వల్ప సమయాల్లో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో లంక ఎదురీదుతోంది. 149 పరుగుల లంక ఐదో వికెట్‌ను కోల్పోయింది. హమీద్ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. -
మూడో శ్రీలంక ఆటగాడిగా..
కార్డిఫ్: శ్రీలంక క్రికెటర్ లహిరు తిరిమన్నే అరుదైన క్లబ్లో చేరాడు. వన్డే ఫార్మాట్లో మూడు వేల పరుగుల మార్కును పూర్తి చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిరిమన్నే మూడు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఆఫ్గాన్ కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ వేసిన 15 ఓవర్ ఐదో బంతిని ఫోర్‌గా మలచడం ద్వారా తిరిమన్నే ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తొలుత ఆ బంతి నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ అవకాశం వచ్చింది. దాన్ని బౌలర్ ఎండ్ వైపు ఫోర్‌గా కొట్టాడు. ఫలితంగా మూడు వేల పరుగుల క్లబ్లో చేరిపోయాడు. మరొకవైపు వేగవంతంగా మూడు వేల వన్డే పరుగుల మార్కును చేరిన మూడో శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. తిరిమన్నే తన వందో ఇన్నింగ్స్‌లో ఈ మార్కును చేరితే, ఈ జాబితా ముందు వరుసలో తరంగా(92 ఇన్నింగ్స్‌లు), ఆటపట్టు(94 ఇన్నింగ్స్‌లు)లు వరుసగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్ దిముత్ కరుణరత్నే- కుశాల్ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా, తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్ స్పిన్నర్ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీ సాధించాడు. -
వరల్డ్‌కప్: బోణీ కొట్టేదెవరో?
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమై ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక రెండో పోరుకు సిద్ధమైంది. సంచలనాల జట్టు అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక తలపడుతోంది.కివీస్ చేతిలో 136 పరుగులకే ఆలౌటైన శ్రీలంక పసికూన కంటే ఘోరంగా విఫలమైంది. ఇక తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడినా అఫ్గాన్ ఆట ఆకట్టుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు షాకిచ్చిన అఫ్గాన్.. ప్రపంచకప్‌లో మరో సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ముఖాముఖి రికార్డులో శ్రీలంక, అఫ్గాన్లు మూడుసార్లు తలపడగా, రెండింట్లో శ్రీలంక.. ఒకదాంట్లో అఫ్గాన్ పైచేయి సాధించాయి. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు శ్రీలంక, అఫ్గాన్ ఒకే ఒక్క మ్యాచ్‌లో తలపడ్డాయి. 2015లో జరిగిన ఆ మ్యాచ్‌లో అఫ్గాన్‌పై శ్రీలంకదే విజయం. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టులో తిషారా పెరీరా, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగాలు కీలక ఆటగాళ్లు కాగా, అఫ్గాన్ జట్టులో షహజాద్, రషీద్ ఖాన్, రహ్మత్ షా, గుల్బదిన్, నబీలు ప్రధాన ఆటగాళ్లు. ఈ రెండు జట్ల తొలి మ్యాచ్ ప్రదర్శన చూస్తే ఎవరైనా ఈ పోరులో శ్రీలంకకు కష్టాలు తప్పవనే అంటారు. గుల్బదిన్ నైబ్ సారథ్యంలోని అఫ్గానిస్తాన్ కూడా తొలి మ్యాచ్‌లో ఓడింది... కానీ ప్రపంచకప్‌లో అద్వితీయమైన రికార్డు ఉన్న ఆసీస్‌ను సమర్థంగా ఎదుర్కొంది. ఓపెనర్లు షహజాద్, హజ్రతుల్లా డకౌట్ కావడం, ఆల్‌రౌండర్ నబీ విఫలమవడంతో తడబడింది. లేదంటే మరింత మెరుగైన స్కోరు చేసేది. ఈ మ్యాచ్‌లో వీళ్లంతా కష్టపడితే మాత్రం అఫ్గాన్ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచి బోణీ కొడతారో చూడాలి. శ్రీలంక దిముత్ కరుణరత్నే(కెప్టెన్), లహిరు తిరుమన్నే, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిషారా పెరీరా, ఇసురు ఉదాన, నువాన్ ప్రదీప్, సురంగా లక్మల్, లసిత్ మలింగా అఫ్గానిస్తాన్ గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), మహ్మద్ షెహజాద్, హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, దావ్లాత్ జద్రాన్, ముజీబ్ ఉర్ రహ్మన్, హమీద్ హసన్ -
మ్యాట్ హెన్రీ విజృంభణ
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ తన పదునైన బంతులతో చెలరేగిపోతున్నాడు. తొలి ఓవర్ రెండో బంతికి లంక ఓపెనర్ లహిరు తిరుమన్నే(4)ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపిన హెన్రీ.. తొమ్మిదో ఓవర్లో మరో రెండు వికెట్లు సాధించి శ్రీలంకకు షాకిచ్చాడు. తొమ్మిదో ఓవర్ మొదటి బంతికి కుశాల్ పెరీరా(29) ఔట్ చేసిన హెన్రీ.. ఆ మరుసటి బంతికి కుశాల్ మెండిస్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. మెండిస్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. హెన్రీ దెబ్బకు శ్రీలంక 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో లంక ఇన్నింగ్స్‌ను తిరుమన్నే, కెప్టెన్ దిముత్ కరుణరత్నేలు ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్ కొట్టి మంచి టచ్‌లో కనిపించిన తిరుమన్నే ఆపై తదుపరి బంతికే వికెట్‌ను చేజార్చుకున్నాడు. దాంతో లంక నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఈ క్రమంలో కరుణరత్నేతో జత కలిసిన కుశాల్ పెరీరా ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకుంటున్నట్లు కనిపించిన సమయంలో పెరీరీ భారీ షాట్‌కు యత్నించి ఔట్ కాగా, అటు తర్వాత కుశాల్ మెండిస్ ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఇక ధనుంజయ డిసిల్వా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఫెర్గ్యుసన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు డిసిల్వా. ఏంజెలో మాథ్యూస్ డకౌట్ కాగా, జీవన్ మెండిస్ పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దాంతో లంకేయులు 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్నారు. -
గెలుపే లక్ష్యంగా న్యూజిలాండ్!
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకు ముఖాముఖి పోరులో లంక, కివీస్‌లు 98 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో లంక 41 గెలిచి, 48 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా, ఎనిమిదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై ఆరుసార్లు నెగ్గిన శ్రీలంక నాలుగుసార్లు పరాజయం పాలైంది. ఇక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఆ జట్టు ఆరుస్లార్లు సెమీస్‌కు చేరగా, గత వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరింది. మరొకవైపు శ్రీలంక ఒకసారి విశ్వవిజేతగా నిలవగా, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఒకసారి సెమీస్‌కు చేరింది. అయితే ప్రస్తుతం లంక పరిస్థితి అంత బాలేదు. చాలాకాలం నుంచి శ్రీలంక ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. రెండేళ్లలో 55 వన్డేలాడి 41 మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసింది శ్రీలంక జట్టు. దాంతో కివీస్‌ను ఎదుర్కోవడం లంకకు సవాల్‌గా చెప్పాలి. ఓపెనర్ గప్టిల్ పెద్దగా రాణించకున్నా, నిలకడగా ఆడే కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌లను నిర్మిస్తున్నాడు. అదే సమయంలో లాథమ్, నికోల్స్, నీషమ్, గ్రాండ్‌హోమ్ చెలరేగితే లంక బౌలర్లకు తిప్పలు తప్పవు. రెండేళ్లుగా రాస్ టేలర్ కూడా నిలకడైన ఆటను ప్రదర్శిస్తున్నాడు. దాంతో కివీస్ బ్యాటింగ్ బలం పటిష్టంగానే కనబడుతోంది. బౌలింగ్ విభాగంలో కూడా కివీస్ మెరుగ్గానే ఉంది. దాంతో కివీస్ గెలుపు లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది. మరొకవైపు లంకేయులు కూడా విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తున్నారు. పిచ్ సీమర్లకు అనుకూలించే అవకాశం ఉంది. తుది జట్లు శ్రీలంక దిముత్ కరుణరత్నే(కెప్టెన్), లహిరు తిరుమన్నే, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిషారా పెరీరా, జీవన్ మెండిస్, సురంగా లక్మల్, ఉసురు ఉదాన, లసిత్ మలింగా న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రో, టామ్ లాథమ్, రాస్ టేలర్, జేమ్స్ నీషమ్, గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంత్నార్, ఫెర్గ్యుసన్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ -
వహ్వా... పాకిస్తాన్
♦ సర్ఫరాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ♦ శ్రీలంకపై అద్భుత విజయం ♦ సెమీస్‌లోకి ప్రవేశం ♦ చాంపియన్స్ ట్రోఫీ కార్డిఫ్: 237 పరుగుల స్వల్ప లక్ష్యం... బరిలోకి దిగిన పాకిస్తాన్ తన ‘సహజ’ ఆటను చూపించడంతో ఓ దశలో స్కోరు 162/7... ఇక శ్రీలంక గెలుపు ఖాయమే అని అంతా భావించినా కెప్టెన్ సర్ఫరాజ్ (79 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు), ఆమిర్ (43 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్) పట్టువదలని పోరాటం ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మరోవైపు శ్రీలంక తమ పేలవ ఫీల్డింగ్‌తోనూ పాక్ విజయానికి సహకరించిందని చెప్పుకోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డిక్వెల్లా (86 బంతుల్లో 73; 4 ఫోర్లు), మ్యాథ్యూస్ (54 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించగలిగారు. పేసర్లు జునైద్ ఖాన్, హసన్ అలీలకు మూడేసి, ఆమిర్, అష్రాఫ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్), అజహర్ అలీ (50 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పేస్‌తో కొట్టారు... నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంకను వణికించింది. నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు ఇచ్చిన జునైద్ ఖాన్ తన మరుసటి ఓవర్లో ఫామ్‌లో ఉన్న గుణతిలక (13)ను అవుట్ చేసి తొలి దెబ్బ తీశాడు. డిక్వెల్లాతో కలిసి కుదురుకుంటున్న దశలో మెండిస్ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు), చండిమాల్ (0) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో జట్టు 83 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాథ్యూస్‌తో కలిసి డిక్వెల్లా ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ ఓపిగ్గా ఆడుతూ స్కోరును పెంచి పాక్‌పై ఒత్తిడి పెంచారు. 52 బంతుల్లో డిక్వెల్లా అర్ధ సెంచరీ చేశాడు. అయితే నాలుగో వికెట్‌కు 78 పరుగులు చేరిన కీలక దశలో లంకకు గట్టి షాక్ తగిలింది. ఆమిర్ తన వరుస ఓవర్లలో మ్యాథ్యూస్, డిక్వెల్లాను అవుట్ చేయగా... డి సిల్వ (1), పెరీరా (1)ను జునైద్ ఖాన్ కూడా అలాగే పెవిలియన్‌కు పంపాడు. దీంతో 3.2 ఓవర్ల వ్యవధిలో కేవలం 6 పరుగులకే లంక 4 వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్లో గుణరత్నే (44 బంతుల్లో 27; 1 ఫోర్), లక్మల్ (34 బంతుల్లో 26; 3 ఫోర్లు) పోరాటం ఫలితంగా జట్టు 200 పరుగులైనా దాటగలిగింది. ఫఖర్, సర్ఫరాజ్ అదుర్స్... స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పాక్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నంతసేపు బ్యాట్‌ను ఝుళిపించాడు. మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాది జోరును ప్రదర్శించిన తను 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. అయితే మరుసటి ఓవర్లోనే అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఒక్కసారిగా లంక బౌలర్లు పట్టు బిగించడంతో మిడిలార్డర్ పూర్తిగా తడబడింది. నిలకడగా ఆడుతున్న అజహర్ కూడా 20వ ఓవర్లో అవుట్ కావడంతో జట్టు మరింతగా ఇబ్బంది పడింది. ఓవైపు కెప్టెన్ సర్ఫరాజ్ క్రీజులో నిలిచినా అవతలివైపు టపటపావికెట్లు నేలకూలాయి. అయితే చివరల్లో ఆమిర్ తమ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. చక్కటి అవగాహనతో వీరు లంక బౌలర్లపై పైచేయి సాధించారు. దీనికి తోడు మలింగ వరుస ఓవర్లలో సర్ఫరాజ్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను పెరీరా, సీకుగే వదిలేయడం లంక విజయాన్ని దూరం చేసింది. ఎనిమిదో వికెట్‌కు ఈ జోడి అజేయంగా 75 పరుగులను జోడించింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి) సర్ఫరాజ్ (బి) ఆమిర్ 73; గుణతిలక (సి) మాలిక్ (బి) జునైద్ 13; మెండిస్ (బి) హసన్ అలీ 27; చండీమల్ (బి) అష్రఫ్ 0; మ్యాథ్యూస్ (బి) ఆమిర్ 39; డి సిల్వా (సి) సర్ఫరాజ్ (బి) జునైద్ 1; గుణరత్నే (సి) ఫఖర్ (బి) హసన్ అలీ 27; తిసారా పెరీరా (సి) బాబర్ ఆజం (బి) జునైద్ 1; లక్మల్ (బి) హసన్ అలీ 26; మలింగ నాటౌట్ 9; ప్రదీప్ (సి అండ్ బి) అష్రఫ్ 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 236. వికెట్ల పతనం: 1–26, 2–82, 3–83, 4–161, 5–162, 6–162, 7–167, 8–213, 9–232, 10–236. బౌలింగ్: ఆమిర్ 10–0–53–2, జునైద్ 10–3–40–3, ఇమాద్ వసీం 8–1–33–0, అష్రఫ్ 6.2–0–37–2, హసన్ అలీ 10–0–43–3, హఫీజ్ 5–0–24–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: అజహర్ అలీ (సి) మెండిస్ (బి) లక్మల్ 34; ఫఖర్ (సి) గుణరత్నే (బి) ప్రదీప్ 50; బాబర్ ఆజం (సి) డిసిల్వా (బి) ప్రదీప్ 10; హఫీజ్ (సి) ప్రదీప్ (బి) పెరీరా 1; మాలిక్ (సి) డిక్వెలా (బి) మలింగ 11; సర్ఫరాజ్ నాటౌట్ 61; ఇమాద్ వసీం (సి) డిక్వెలా (బి) ప్రదీప్ 4; ఫహీమ్ అష్రఫ్ రనౌట్ 15; ఆమిర్ నాటౌట్ 28; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (44.5 ఓవర్లలో 7 వికెట్లకు) 237. వికెట్ల పతనం: 1–74, 2–92, 3–95, 4–110, 5–131, 6–137, 7–162. బౌలింగ్: మలింగ 9.5–2–52–1, లక్మల్ 10–0–48–1, ప్రదీప్ 10–0–60– 3, తిసారా పెరీరా 8–0–43–1, గుణరత్నే 5–0–19 –0, గుణతిలక 1–0–2–0, డి సిల్వా 1–0–3–0. సెమీఫైనల్ షెడ్యూల్ జూన్ 14: తొలి సెమీఫైనల్ ఇంగ్లండ్ గీ పాకిస్తాన్ వేదిక: కార్డిఫ్, మ.గం. 3.00 నుంచి జూన్ 15: రెండో సెమీఫైనల్ భారత్ x బంగ్లాదేశ్ వేదిక: బర్మింగ్‌హామ్, మ.గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
అంత్యక్రియల్లో అశ్లీల వీడియో
నెలలు నిండిన తన భార్యతో కలిసి కారులో బయలుదేరాడు సైమన్ లెవీస్. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నైట్ క్లబ్ వైపునకు దూసుకెళుతున్నవాళ్లకు మరో కారు అడ్డంతగిలింది. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ప్రమాదంలో సైమన్ అక్కడికక్కడే చనిపోయాడు. స్పృహకోల్పోయిన ఆయన భార్యను ఎవరో ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తర్వాత ఆపరేషన్ చేసి కడుపులోనే చనిపోయిన శిశువును బయటికితీశారు డాక్టర్లు. ప్రమాదం జరిగిన రోజే కడుపులో ఉన్న బిడ్డ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. భార్య ఆసుపత్ని నుంచి కోలుకున్న తర్వాత సైమన్, తల్లికడుపులోనే చనిపోయిన అతడి కొడుకుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. వాళ్ల సొంత ఊరు కార్డిఫ్ లోని చర్చికి సమీపంలోగల స్మశానవాటికలో అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. రెండు పార్థివదేహాలను ఉద్దేశించి పాస్టర్ ప్రార్థనలు చేశారు. పూడ్చిపెట్టడానికి ముందు మరోసారి జ్ఞాపకాలను తల్చుకునేందుకు అక్కడ ఏర్పాటుచేసిన స్క్రీన్లపై సైమన్ కు సంబంధించిన గత వీడియాలను ప్లే చేయాల్సిందిగా పాస్టర్ ఆదేశించారు. వీడియో మొదలవుతూనే అక్కడున్నవారి ముఖాల్లో ఆందోళన మిన్నంటింది. సైమన్ జ్ఞాపకాలకు బదులు అక్కడ ప్లే అయింది ఓ హార్డ్ కోర్ పోర్న్ వీడియో! క్షణాల్లో తేరుకున్న కార్యక్రమ నిర్వాహకులు వీడియో ప్రసారాన్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక సమస్యవల్ల దాదాపు ఐదునిమిషాలపాటు ఆ వీడియో అలా ప్లే అవుతూనేఉంది. చివరికి ఓ ఇంజనీర్ వచ్చి సెట్టింగ్స్ మార్చాకగానీ అశ్లీలదృశ్యాల ప్రసారం ఆగిపోలేదు. జనవరి 28న చోటుచేసుకున్న ఈ సంఘటన వేల్స్(యూకే)లో చర్చనీయాంశమైంది. అంత్యక్రియల నిర్వాహకుల తీరుపై సైమన్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేయగా, 30 ఏళ్ల సర్వీసులు ఇలాంటి పొరపాటుజరగటం మొదటిసారని, ఈ ఒక్కసారీ క్షమించాలని వేడుకున్నారు స్మశానవాటిక సిబ్బంది. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
-
ఫార్మాట్ మారింది... పూనకమొచ్చింది!
వీళ్లేనా... మొన్నటిదాకా పరుగులు చేయడానికి వణికిన బ్యాట్స్‌మెన్..! వీళ్లేనా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఆపడానికి ఆపసోపాలు పడ్డ బౌలర్లు..! వీళ్లేనా... ఘోరమైన ఆటతో ఇంటా బయటా తిట్లు తిన్న క్రికెటర్లు..! టెస్టుల్లో ఘోర ఓటమితో కసి పెరిగిందో... లేక ప్రపంచకప్ ఆడాలంటే నిలబడాలని గుర్తొచ్చిందో... కారణం ఏదైనా... ఫార్మాట్ మారగానే భారత క్రికెటర్లు పూనకం వచ్చినట్లు చెలరేగిపోయారు. అటు బ్యాట్స్‌మెన్ కసిదీరా ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడితే... ఇటు బౌలర్లు ప్రత్యర్థిని చుట్టిపారేశారు. ఫలితంగా రెండో వన్డేలో భారత్ 133 పరుగులతో ఘన విజయం సాధించింది. ►ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ ►133 పరుగులతో నెగ్గిన ధోనిసేన ►రైనా సూపర్ సెంచరీ ►రాణించిన ధోని, రోహిత్ ►ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం ►మూడో వన్డే శనివారం కార్డిఫ్: ఇంగ్లండ్ గడ్డపై గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఐదు విజయాలతో భారత్ సత్తా చాటింది. నాటి రికార్డును ఇప్పుడు కొనసాగిస్తూ భారత్ మరోసారి అదే తరహా స్ఫూర్తిదాయక ఆటతీరును కనబర్చింది. అప్పటిలాగే జట్టు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. బుధవారం ఇక్కడ సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 133 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సురేశ్ రైనా (75 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించగా... కెప్టెన్ ధోని (51 బంతుల్లో 52; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (87 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రైనా, ధోని ఐదో వికెట్‌కు 16.5 ఓవర్లలోనే 144 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఇంగ్లండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఆ జట్టు 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ హేల్స్ (63 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జడేజా 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. ఆదుకున్న రోహిత్ ఆరంభంలో ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తన మూడో ఓవర్ తొలి బంతికి ధావన్ (11)ను అవుట్ చేసిన వోక్స్, మరో రెండు బంతులకే కోహ్లి (0)ని డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఎదుర్కొన్న మూడో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన విరాట్, తన టెస్టు సిరీస్ వైఫల్యాన్ని కొనసాగించడంతో స్కోరు 19/2 వద్ద నిలిచింది. అయితే రోహిత్ శర్మ, రహానే (47 బంతుల్లో 41; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. రోహిత్ 82 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరు ట్రెడ్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. భారీ భాగస్వామ్యం ఈ దశలో రైనా, ధోనిల భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. మొదట్లో నెమ్మదిగానే ఆడిన రైనా, ఆ తర్వాత చెలరేగిపోయాడు. 49 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. తర్వాత జోరు మరింత పెంచి 74 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు కెప్టెన్ కూడా తనదైన శైలిలో షాట్లు ఆడి 49 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోరుతో భారత్ రెండో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసింది. తొలి 37 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేస్తే... చివరి 13 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయడం విశేషం. బౌలర్ల జోరు భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ వేగంగా ఆడలేదు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన హేల్స్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ కుక్ (19), బెల్ (1)లను ఒకే ఓవర్లో అవుట్ చేసి షమీ ప్రత్యర్థి జట్టును నియంత్రించాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో రూట్ (4), హేల్స్, బట్లర్ (2) వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) ట్రెడ్‌వెల్ 52; ధావన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 11; కోహ్లి (సి) కుక్ (బి) వోక్స్ 0; రహానే (స్టం) బట్లర్ (బి) ట్రెడ్‌వెల్ 41; రైనా (సి) అండర్సన్ (బి) వోక్స్ 100; ధోని (బి) వోక్స్ 52; జడేజా నాటౌట్ 9; అశ్విన్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 304. వికెట్ల పతనం: 1-19; 2-19; 3-110; 4-132; 5-276; 6-288. బౌలింగ్: అండర్సన్ 10-1-57-0; వోక్స్ 10-1-52-4; జోర్డాన్ 10-0-73-0; స్టోక్స్ 7-0-54-0; రూట్ 3-0-14-0; ట్రెడ్‌వెల్ 10-1-42-2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (ఎల్బీ) (బి) షమీ 19; హేల్స్ (సి) అశ్విన్ (బి) జడేజా 40; బెల్ (బి) షమీ 1; రూట్ (బి) భువనేశ్వర్ 4; మోర్గాన్ (సి) షమీ (బి) అశ్విన్ 28; బట్లర్ (సి) కోహ్లి (బి) జడేజా 2; స్టోక్స్ (సి) రహానే (బి) జడేజా 23; వోక్స్ (స్టం) ధోని (బి) జడేజా 20; జోర్డాన్ (ఎల్బీ) (బి) రైనా 0; ట్రెడ్‌వెల్ (సి) జడేజా (బి) అశ్విన్ 10; అండర్సన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (38.1 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1-54; 2-56; 3-63; 4-81; 5-85; 6-119; 7-126; 8-128; 9-143; 10-161 బౌలింగ్: భువనేశ్వర్ 7-0-30-1; మోహిత్ శర్మ 6-1-18-0; షమీ 6-0-32-2; అశ్విన్ 9.1-0-38-2; జడేజా 7-0-28-4; రైనా 3-0-12-1. అదే వేదిక... అవే పరుగులు మూడేళ్ల క్రితం...ఇదే వేదికపై భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే...ఇరు జట్ల కెప్టెన్లు ధోని, కుక్... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌కు ముందు ఇంగ్లండ్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. ఆ తర్వాత మళ్లీ లక్ష్యం మారి డక్‌వర్త్ లూయీస్ ప్రకారం ఇంగ్లండ్ గెలిచింది. ఇప్పుడూ అదే మైదానం...నాయకులూ వారే. భారత్ సరిగ్గా అదే స్కోరు చేసింది. నాడు కోహ్లి సెంచరీ చేస్తే నేడు రైనా శతకం బాదాడు. ఇంగ్లండ్ లక్ష్యం కూడా సరిగ్గా అదే. ఈ సారి మాత్రం ఫలితం మారింది. 11 బంతుల ఓవర్... ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ ఇంగ్లండ్ కెప్టెన్‌కు అసహనాన్ని మిగల్చగా, భారత్‌కు 13 పరుగులు అందించింది. ఏ మాత్రం నియంత్రణ లేకుండా సాగిన బౌలింగ్‌తో జోర్డాన్ ఆ ఓవర్లో ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. ధోని ఒక ఫోర్ కొట్టగా, మరో నాలుగు సింగిల్స్ వచ్చాయి. మ్యాచ్‌లో మొత్తంగా జోర్డాన్ ఒక్కడే 12 వైడ్లు విసరగా, ఇంగ్లండ్ ఎక్స్‌ట్రాల రూపంలోనే 29 పరుగులు ఇచ్చింది. 1 ఉపఖండం వెలుపల రైనాకు ఇదే తొలి సెంచరీ 4 రైనా కెరీర్లో ఇది నాలుగో సెంచరీ. 2010 జనవరిలో తన మూడో సెంచరీ నమోదు చేసిన రైనా... 95 ఇన్నింగ్స్‌ల తర్వాత మరో సెంచరీ సాధించాడు. 1 వన్డేల చరిత్రలో ఐదో వికెట్‌కు 2000కు పైగా పరుగులు జోడించిన తొలి జోడి ధోని, రైనా.