
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకు ముఖాముఖి పోరులో లంక, కివీస్‌లు 98 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో లంక 41 గెలిచి, 48 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా, ఎనిమిదింట్లో ఫలితం తేలలేదు.
ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై ఆరుసార్లు నెగ్గిన శ్రీలంక నాలుగుసార్లు పరాజయం పాలైంది. ఇక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఆ జట్టు ఆరుస్లార్లు సెమీస్‌కు చేరగా, గత వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరింది. మరొకవైపు శ్రీలంక ఒకసారి విశ్వవిజేతగా నిలవగా, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఒకసారి సెమీస్‌కు చేరింది. అయితే ప్రస్తుతం లంక పరిస్థితి అంత బాలేదు. చాలాకాలం నుంచి శ్రీలంక ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. రెండేళ్లలో 55 వన్డేలాడి 41 మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసింది శ్రీలంక జట్టు.
దాంతో కివీస్‌ను ఎదుర్కోవడం లంకకు సవాల్‌గా చెప్పాలి. ఓపెనర్ గప్టిల్ పెద్దగా రాణించకున్నా, నిలకడగా ఆడే కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌లను నిర్మిస్తున్నాడు. అదే సమయంలో లాథమ్, నికోల్స్, నీషమ్, గ్రాండ్‌హోమ్ చెలరేగితే లంక బౌలర్లకు తిప్పలు తప్పవు. రెండేళ్లుగా రాస్ టేలర్ కూడా నిలకడైన ఆటను ప్రదర్శిస్తున్నాడు. దాంతో కివీస్ బ్యాటింగ్ బలం పటిష్టంగానే కనబడుతోంది. బౌలింగ్ విభాగంలో కూడా కివీస్ మెరుగ్గానే ఉంది. దాంతో కివీస్ గెలుపు లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది. మరొకవైపు లంకేయులు కూడా విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తున్నారు. పిచ్ సీమర్లకు అనుకూలించే అవకాశం ఉంది.
తుది జట్లు
శ్రీలంక
దిముత్ కరుణరత్నే(కెప్టెన్), లహిరు తిరుమన్నే, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిషారా పెరీరా, జీవన్ మెండిస్, సురంగా లక్మల్, ఉసురు ఉదాన, లసిత్ మలింగా
న్యూజిలాండ్
కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రో, టామ్ లాథమ్, రాస్ టేలర్, జేమ్స్ నీషమ్, గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంత్నార్, ఫెర్గ్యుసన్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment