
కార్డిఫ్: వరల్డ్‌కప్‌లో వరుసగా ఇంగ్లండ, బంగ్లాదేశ్, భారత చేతిలో ఓడిన సఫారీ జట్టు బోణీ కోసం ఆరాటపడుతోంది. విండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని సెమీస్ అవకాశాల్ని దాదాపు కోల్పోయిన దక్షిణాఫ్రికా.. అఫ్గానిస్తాన్‌పై గెలిచి ఖాతా తెరవాలని యోచిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్ కూడా ఇప్పటివరకూ మ్యాచ్ గెలవలేదు. ఫ్గానిస్తాన్ కూడా వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఆసీస్, లంక, కివీస్‌లను ఎదుర్కోలేకపోయింది.
అయితే దక్షిణాఫ్రికాలాంటి పటిష్ట జట్టును ఓడిస్తుందన్న నమ్మకం లేకపోయినా... రోజు కలిసొస్తే, సఫారీకి దురదృష్టం వెంటాడితే మాత్రం అఫ్గాన్ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇరు జట్లు బోణీ కొట్టాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతుండటంతో ఆసక్తికర సమరం జరగవచ్చు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
అఫ్గాన్
గుల్బదిన్ నైబ్(కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, నూర్ అలీ జద్రాన్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, అఫ్తాబ్ అలం, హమిద్ హసన్
దక్షిణాఫ్రికా
డుప్లెసిస్(కెప్టెన్), డీకాక్, హషీమ్ ఆమ్లా, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వోయో, క్రిస్ మోరిస్, కగిసో రబడ, ఇమ్రాన్ తాహీర్, హెండ్రిక్స్
Comments
Please login to add a commentAdd a comment