
కార్డిఫ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment