England vs Srilanka
-
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్‌గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్‌కప్ తర్వాత క్రిస్ సిల్వర్‌వుడ్ తన హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్‌గా నియమించింది.ఆదిలోనే చేదు అనుభవంటీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్‌లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.ఆ తర్వాత వరుస విజయాలుదాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది.ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.టీ20 వరల్డ్‌కప్ వరకూ అతడే!ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్‌కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్‌గానూ పనిచేశాడు. ఇక ఫుల్‌టైమ్ హెడ్‌కోచ్‌గా వెస్టిండీస్‌తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌తో అతడి ప్రయాణం మొదలుకానుంది.చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆసియాలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు ఊరట విజయం దక్కింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన శ్రీలంక.. నామమాత్రపు మూడో టెస్టులో మాత్రం జూలు విధిల్చింది. లండన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను లంక చిత్తు చేసింది. దీంతో వైట్‌వాష్ నుంచి లంకేయులు తప్పించుకున్నారు. 219 పరుగుల విజయ లక్ష్యాన్ని లంక 40.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక(127) ఆజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్ (39 నాటౌట్), ఏంజెలో మాథ్యూస్ (32) రాణించారు.లంక అరుదైన రికార్డు.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2010లో ఆస్ట్రేలియాపై 180 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో పాక్ ఆల్‌టైమ్ రికార్డును లంక బ్రేక్ చేసింది. ఈ జాబితాలో పాక్ తర్వాత టీమిండియా ఉంది. 1971లో ఇంగ్లండ్‌పై 173 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.చదవండి: IND vs AUS: ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
144 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి: నిసాంక ప్రపంచ రికార్డు
శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిసాంక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగి.. వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 144 ఏళ్ల చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అదేమిటంటే...!!లంక అనూహ్య విజయంప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు గెలుపొంది సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే, నామమాత్రపు మూడో టెస్టులో శ్రీలంక అనూహ్య రీతిలో విజయం సాధించింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకునితద్వారా వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. అయితే, ఇంగ్లండ్‌లో మూడో టెస్టులో శ్రీలంక గెలుపొందడంలో ఓపెనర్ పాతుమ్ నిసాంకదే కీలక పాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో 51 బంతుల్లో 64 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లోనే 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.1880 నుంచి ఇదే మొదటిసారిఅయితే, నిసాంక సెంచరీ మార్కు అందుకునే కంటే ముందే అత్యంత అరుదైన ఘనత ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న నిసాంక.. రెండో ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా 26 ఏళ్ల నిసాంక చరిత్రకెక్కాడు.ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వీరులు వీరేకాగా 1880లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 559 మ్యాచ్‌లకు ఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా నిసాంక మాదిరి ఇలా రెండు ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన దాఖలాలు లేవు.ఇదిలా ఉంటే.. టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా యాభై పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్ల జాబితాలో మాత్రం నిసాంక తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ముందున్నది ఎవరంటే..👉మార్క్ గ్రేట్బచ్(న్యూజిలాండ్)- జింబాబ్వే మీద- 1992లో👉నాథన్ ఆస్ట్లే(న్యూజిలాండ్)- వెస్టిండీస్ మీద- 1996లో👉తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- న్యూజిలాండ్ మీద- 2009లో👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- న్యూజిలాండ్ మీద- 2012లో👉జెర్మానే బ్లాక్‌వుడ్(వెస్టిండీస్)- టీమిండియా మీద- 2916లో👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- పాకిస్తాన్ మీద- 2017లో👉జాక్ క్రాలే(ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద- 2022లో👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- న్యూజిలాండ్ మీద- 2023లో👉పాతుమ్ నిసాంక(శ్రీలంక)- ఇంగ్లండ్ మీద- 2024లోచదవండి: Afg vs NZ: నోయిడాలో తొలి రోజు ఆట రద్దు.. కారణం ఇదే! -
నిసాంక సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ్రీలంక
కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌కు పర్యాటక శ్రీలంక ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిసాంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిసాంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిసాంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో దిముల్ కరుణరత్నే (8), కుసాల్ మెండిస్ (39) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
శ్రీలంకకు లభించిన మరో ఆణిముత్యం
టెస్ట్‌ల్లో కుమార సంగక్కర, మహేళ జయవర్దనే లాంటి దిగ్గజ బ్యాటర్లు రిటైరయ్యాక శ్రీలంక బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనపడింది. కొందరు ఆటగాళ్లు అడపాదడపా ప్రదర్శనలు చేస్తున్నా అవంత చెప్పుకోదగ్గవేమీ కాదు. ఇటీవలికాలంలో ఆ జట్టులోకి కమిందు మెండిస్ అనే ఓ యువ ఆటగాడు వచ్చాడు. ఇతను ఆడింది ఐదు టెస్ట్ మ్యాచ్‌లే అయినా దిగ్గజ బ్యాటర్లను మరిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో సెంచరీ, రెండు అర్ద సెంచరీలు చేసిన కమిందు.. తన 10 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్లో ఏకంగా మూడు సెంచరీలు, నాలుగు అర్ద సెంచరీలు చేసి ఔరా అనిపించాడు.ఆస్ట్రేలియాతో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్న కమిందు.. ఆతర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి లంక దిగ్గజం కుమార సంగక్కరను గుర్తు చేశాడు. ఆ మరుసటి టెస్ట్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్న ఇతను.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీతో మెరిశాడు. మళ్లీ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన కమిందు.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.ఇలా కమిందు తన స్వల్ప కెరీర్లో ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. కమిందు టెస్ట్‌ల్లో చేసిన పరుగులు దాదాపుగా విదేశాల్లో చేసినవే కావడం విశేషం. అందులోనూ కమిందు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి చాలా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన కమిందు లోయర్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతాడు. కమిందు గణాంకాలు.. అతని ఆటతీరు చూసిన వారు శ్రీలంకకు మరో ఆణిముత్యం లభించిందని చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇదివరకే (0-2) కోల్పోయిన శ్రీలంక.. మూడో టెస్ట్‌లో మాత్రం విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మరో 125 పరుగులు చేస్తే విజయం సొంతం చేసుకుంటుంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉండటంతో పాటు శ్రీలంక చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. నిస్సంక (53), కుసాల్ మెండిస్ (30) క్రీజ్‌లో ఉన్నారు. -
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. విజయం దిశగా శ్రీలంక
లండన్: ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడిన శ్రీలంక... మూడో మ్యాచ్‌లో విజయం దిశగా సాగుతోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో 219 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక... మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. దిముత్ కరుణరత్నే (8) విఫలం కాగా... నిసాంక (44బంతుల్లో 53 బ్యాటింగ్; 7 ఫోర్లు), కుశాల్ మెండిస్ (25 బంతుల్లో 30 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. చేతిలో తొమ్మిది వికెట్లున్న శ్రీలంక... విజయానికి మరో 125 పరుగులు చేయాల్సి ఉంది.ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 211/5తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 61.2 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (69), కమిందు మెండిస్ (64) హాఫ్ సెంచరీలు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ స్టోన్, జోష్ హాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టాపార్డర్ విఫలమవడంతో... ఆ జట్టు 34 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. జేమీ స్మిత్ (50 బంతుల్లో 67; 10 ఫోర్లు, ఒక సిక్సర్) ఒక్కడే ధాటిగా ఆడగా... బెన్ డకెట్ (7), ఓలీ పోప్ (7), జోరూట్ (12), హ్యారీ బ్రూక్ (3), అట్కిన్సన్ (1) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 4, విశ్వ ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ -
ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్.. 263 పరుగులకు ఆలౌటైన శ్రీలంక
కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ధనంజయ డిసిల్వ 69, కమిందు మెండిస్ 64 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన మిలన్రత్నాయకే 7, విశ్వ ఫెర్నాండో 0, అశిత ఫెర్నాండో 11 పరుగులు చేశారు. లంక ఇన్నింగ్స్‌లో ఓవరల్‌గా ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. రెండో రోజు ఆటలో పథుమ్ నిస్సంక 64 పరుగులు చేశాడు. వీరు మినహా కుసల్ మెండిస్ (14), అశిత ఫెర్నాండో మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ జోష్ హల్, ఓల్లీ స్టోన్ తలో 3, క్రిస్ వోక్స్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 62 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (13), హ్యారీ బ్రూక్ (19), జేమీ స్మిత్ (16), ఓల్లీ స్టోన్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లంక ఇన్నింగ్స్‌లో మిలన్ రత్నాయకే 3, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు.కాగా, శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. -
పోప్ భారీ శతకం.. 325 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. 221/3 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 104 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ చేసిన ఓలీ పోప్ 154 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓవర్‌నైట్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 40 పరుగులు జోడించాక బ్రూక్ ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. ఓలీ పోప్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 86, డాన్ లారెన్స్ 5, జో రూట్ 13, జేమీ స్మిత్ 16, క్రిస్ వోక్స్ 2, గస్ అట్కిన్సన్ 5, ఓల్లీ స్టోన్ 15 (నాటౌట్), జోష్ హల్ 2, షోయబ్ బషీర్ ఒక్క పరుగు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిలన్ రత్నాయకే 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. 147 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే
ఇంగ్లండ్ తాత్కాలిక టెస్టు సారథి ఓలీ పోప్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. లండన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. వర్షం అంతరాయం కలిగించిన తొలి రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను పోప్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. జో రూట్(13) విఫలమైనప్పటకి పోప్ మాత్రం దంచి కొట్టాడు. 103 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అతడితో పాటు క్రీజులో హ్యారీ బ్రూక్(8) ఉన్నాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కాగా పోప్‌కు ఇది 7వ టెస్టు సెంచరీ.సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పోప్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తొలి 7 సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్‌గా పోప్ రికార్డులకెక్కాడు. పోప్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు సాధించిన ప్రతి సెంచరీ ఆరు వేర్వేరు మైదానాల్లో వచ్చినివే కావడం విశేషం. 2020లో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు సెంచరీ చేసిన పోప్.. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, భారత్, వెస్టిండీస్, శ్రీలంకపై శతకాలు నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. -
ఒలీ పోప్ అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
లండన్: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకతో మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్... శుక్రవారం వర్షం అంతరాయం మధ్య ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.తాత్కాలిక కెప్టెన్ ఒలీ పోప్ (103 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... ఓపెనర్ బెన్ డకెట్ (79 బంతుల్లో 86; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.వీరిద్దరూ వన్డే తరహా ఆటతీరుతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం ఏర్పడగా... ఆఖర్లో వెలుతురు లేమితో ఆటను నిర్ణీత సమయం కంటే ముందే నిలిపివేశారు. గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ జో రూట్ (13) తో పాటు డాన్ లారెన్స్ (5) విఫలమయ్యారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2 వికెట్లు పడగొట్టాడు. పోప్‌తో పాటు హ్యారీ బ్రూక్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.చదవండి: Fab Four: ‘అతడే నంబర్ వన్.. కోహ్లికి ఆఖరి స్థానం’ -
ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
రేపటి నుంచి (సెప్టెంబర్ 6) కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. రెండో టెస్ట్ ఆడిన నిషన్ మధుష్క, ప్రభాత్ జయసూర్య స్థానాల్లో కుసల్ మెండిస్, విశ్వ ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చారు. మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెండు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టే ఘన విజయాలు సాధించింది. తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్.. తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో 190 పరుగుల తేడాతో విజయం సాధించింది.మూడో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టు: దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, ధనంజయ డిసిల్వ (కెప్టెన్), కమిందు మెండిస్, మిలన్ రత్నాయకే, లహీరు కుమార, విశ్వ ఫెర్నాండో, అశిత ఫెర్నాండోఇంగ్లండ్ తుది జట్టు: డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, ఓలీ స్టోన్, జోష్ హల్, షోయబ్ బషీర్ -
శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 190 పరుగుల తేడాతో భారీ విజయం
లార్డ్స్ వేదికగా శ్రీలకంతో జరిగిన రెండో టెస్టులో 190 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 483 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 292 పరుగులకు ఆలౌటైంది.లంక బ్యాటర్లలో కరుణ్‌రత్నే(55), చందీమాల్(58), దనుజంయ డి సిల్వా(50) హాఫ్ సెంచరీలతో పోరాడినప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో గౌస్ అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా.. క్రిస్ వోక్స్, స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 251 పరుగులకే ఆలౌటైంది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు 231 పరుగుల భారీ లీడ్ లభించింది. ఈ ఆధిక్యాన్ని కలుపునకుని 483 పరుగుల భారీ టార్గెట్‌ను లంకేయులు ముందు ఇంగ్లీష్ జట్టు ఉంచింది. ఈ కొండంత లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక విఫలమైంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 427 పరుగులు చేయగా.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసిన జో.. రెండో ఇన్నింగ్స్‌లో 103 రన్స్‌తో సత్తాచాటాడు. అదేవిధంగా ఇంగ్లీష్ పేస్ బౌలర్ అట్కిన్సన్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎనిమిదో స్ధానంలో వచ్చి సెంచరీతో చెలరేగిన అట్కిన్సన్.. బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఓవరాల్‌గా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డులు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులతో సత్తాచాటిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగాడు. 121 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్‌కు ఇది 34వ టెస్టు సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..→టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ అవతరించాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పేరిట ఉన్న అత్యధిక శతకాల (33) రికార్డును బ్రేక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కుక్ రికార్డును సమం చేసిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ సెంచరీతో అతడిని అధిగమించాడు.→ఈ సెంచరీతో అతడు మరో ముగ్గురు క్రికెటర్ల అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. యూనిస్ ఖాన్, జయవర్దనే, సునీల్ గవాస్కర్, లారా రికార్డును సమం చేశాడు. వీరిందరూ టెస్టుల్లో 34 సెంచరీలు చేశారు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ఈజాబితాలో ఆరో స్ధానంలో ఎగబాకుతాడు. ఇక టెస్టు అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు.→ఒకే వేదికలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ లార్డ్స్‌లో ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం గ్రాహం గూచ్ పేరిట ఉండేది. గూచ్ లార్డ్స్‌లో 6 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌తో గూచ్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.→50 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ సెంచరీలు చేసిన 9వ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.డేంజర్లో సచిన్ రికార్డు.. కాగా రూట్ జోరును చూస్తుంటే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 15,921 రన్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ జాబితాలో రూట్ 12377 పరుగులతో 7వ స్ధానంలో కొనసాగుతున్నాడు. కాగా రూట్ సచిన్‌కు కేవలం 3,544 పరుగుల దూరంలోనే ఉన్నాడు. సచిన్ 200 టెస్టులు ఆడి తన కెరీర్‌ను ముగించగా.. రూట్ ఇప్పటివరకు 145 టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే 33 ఏళ్ల రూట్ ఫిట్నెస్ పరంగా కూడా మెరుగ్గా ఉండడంతో సచిన్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. -
శతక్కొట్టిన ఇంగ్లండ్ పేసర్.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్
England vs Sri Lanka, 2nd Test Day 2 Report: ఇంగ్లండ్ యువ పేస్ బౌలర్ అట్కిన్సన్ (115 బంతుల్లో 118;14 ఫోర్లు, 4 సిక్సర్లు) లార్డ్స్ ఆనర్ బోర్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అట్కిన్సన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఏళ్ల అట్కిన్సన్కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.లార్డ్స్ ఆనర్ బోర్డులో అట్కిన్సన్ పేరుగత నెలలో వెస్టిండీస్ సిరీస్ ద్వారా లార్డ్స్‌లోనే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన అట్కిన్సన్ ఆడిన మొదటి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మొత్తం 12 వికెట్లు తీసి ఇప్పటికే లార్డ్స్ ఆనర్ బోర్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ ప్రతిభతో మరోసారి అందులో చోటు దక్కించుకున్నాడు.శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్‌కాగా అట్కిన్సన్ దూకుడుతో ఓవర్‌నైట్ స్కోరు 358/7తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 427 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 5, మిలాన్ రత్నాయకే, లహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 55.3 ఓవర్లలో 196 పరుగులు చేసి ఆలౌటైంది.256 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్కమిందు మెండిస్ (120 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒలీ స్టోన్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ (7) ఔట్ కాగా.. కెప్టెన్ ఓలీ పోప్ (2 బ్యాటింగ్), బెన్ డకెట్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఓవరాల్‌గా 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి -
లార్డ్స్‌లో ఊచకోత.. 8వ స్ధానంలో వచ్చి విధ్వంసకర సెంచరీ
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ రైజింగ్ స్టార్, యువ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించిన అట్కిన్సన్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అట్కిన్సన్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 103 బంతుల్లోనే అట్కిన్సన్ తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న అట్కిన్సన్.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ సెంచరీతో అతడు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు సంపాదించుకున్నాడు. అదే విధంగా పలు అరుదైన రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. లార్డ్స్‌లో 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా అట్కిన్సన్ నిలిచాడు. లార్డ్స్‌లో 8వ స్ధానంలో వచ్చి సెంచరీలు చేసిన వారు వీరేస్టువర్ట్ బ్రాడ్(169, ఇంగ్లండ్)గుబ్బి అలెన్(122, ఇంగ్లండ్ )బెర్నార్డ్ జూలియన్( 121, వెస్టిండీస్)గస్ అట్కిన్సన్( 118, ఇంగ్లండ్)రే ఇల్లింగ్ వర్త్(113, ఇంగ్లండ్)అజిత్ అగార్కర్(109, భారత్)అదే విధంగా లార్డ్స్‌లో టెస్ట్ సెంచరీ, 10 వికెట్ల ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా కూడా అట్కిన్సన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అట్కిన్సన్‌తో పాటు గుబ్బి అలెన్, కీత్ మిల్లర్ , ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ ఉన్నారు. He's done it! 💪Enjoy the moment Gus Atkinson reaches his first Test match century 👏 pic.twitter.com/lUZ8ECp7G2— Sky Sports Cricket (@SkyCricket) August 30, 2024 -
తనవల్లే ఈ స్ధాయిలో ఉన్నా.. ఆయనకే ఈ సెంచరీ అంకితం: రూట్
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 206 బంతులు ఎదుర్కొన్న రూట్.. 18 ఫోర్లతో 143 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతేకాకుండా టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన అలస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్‌ల్లో 33 సెంచరీలు చేయగా.. రూట్ కేవలం 145 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఆయనకే సెంచరీ అంకితం...ఇక జో రూట్ తన 33వ టెస్ట్ సెంచరీని ఇంగ్లండ్ దివంగత మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్‌కు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా తన కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన మెంటార్ థోర్ప్‌కు నివాళులర్పించాడు. తన సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే రూట్ ఆకాశం వైపు చూస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ క్షణాన ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు."నా కెరీర్లో ఇప్పటివరకు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు, కోచ్‌లు, మెంటార్లతో కలిసి పనిచేశాను. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నా కెరీర్‌ను తీర్చిదిద్దిన వారిలో గ్రాహం థోర్ప్ ఒకరు. ఈ క్షణంలో థోర్ప్‌ను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఆయనను చాలా మిస్ అవుతున్నాను. నేను ఎప్పటికి థోర్ప్‌కు రుణపడి ఉంటాను. నా ఆట, నా కెరీర్ ఎదుగుదలలో ఆయనది కీలక పాత్ర. ఈ స్ధాయిలో నేను ఉన్న అంటే కారణం థోర్ప్ అని గర్వంగా చెబుతున్నాను.బ్యాటింగ్ టెక్నిక్, స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు నాకు చాలా సహాయం చేశాడరు. ఈ రోజు నేను స్వీప్ షాట్లను సులభంగా ఆడుతున్న అంటే కారణం ఆయనే. నా సెంచరీని థోర్పీకి అంకితమివ్వాలనకుంటున్నాను అని తొలి రోజు ఆట అనంతరం రూట్ పేర్కొన్నాడు. కాగా థోర్ప్ ఈ నెల ఆరంభంలో అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 341 మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశారు.గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓటమి చవిచూడటంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ తప్పుకున్నాడు. -
రోహిత్ శర్మను అధిగమించిన జో రూట్.. 44 నెలల్లో 16 సెంచరీలు
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ సెంచరీ రూట్‌కు 33వ టెస్ట్ సెంచరీ. మూడు ఫార్మాట్లలో కలిపితే 49వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో రూట్ రెండో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. తాజా సెంచరీ చేసే క్రమంలో రూట్ రోహిత్ శర్మను (48 సెంచరీలు) అధిగమించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీల రికార్డు విరాట్ కోహ్లి (80) పేరిట ఉంది. రూట్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ అలిస్టర్ కుక్ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో రూట్ (33), కుక్ (33), కెవిన్ పీటర్సన్ (23) టాప్-3లో ఉన్నారు. 2020లో కేవలం 17 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేసిన రూట్.. 44 నెలల వ్యవధిలో ఏకంగా 16 సెంచరీలు బాదాడు. ఫాబ్ ఫోర్‌గా పిలువబడే రూట్, స్మిత్, విరాట్, కేన్లలో రూట్ అత్యధికంగా 33 సెంచరీలు కలిగి ఉన్నాడు. కేన్, స్మిత్ చెరో 32 సెంచరీలు చేయగా.. విరాట్ 29 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే, లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. రూట్ 143 పరుగులు చేసి ఔట్ కాగా.. గస్ అట్కిన్సన్ (74), మాథ్యూ పాట్స్ (20) క్రీజ్‌లో ఉన్నారు. బెన్ డకెట్ (40), హ్యారీ బ్రూక్ (33), జేమీ స్మిత్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, లహీరు కుమార తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
జో రూట్ సూపర్ సెంచరీ.. కుక్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ తన అద్బుత సెంచరీతో ఆదుకున్నాడు.162 బంతుల్లో 13 ఫోర్లతో రూట్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్‌కు ఇది 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తన సొంత గడ్డపై 20వ టెస్టు సెంచరీ కాగా.. లార్డ్స్‌లో ఆరో శతకం. ఇక సెంచరీతో మెరిసిన రూట్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే...టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ క్రికెటర్ అలెస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్‌ల్లో 33 సెంచరీలు చేయగా.. రూట్ కేవలం 145 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. అతడు మరో సెంచరీ సాధిస్తే కుక్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.అదే విధంగా ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 11వ స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) ఆగ్రస్ధానంలో ఉన్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. రూట్ ఇప్పటివరకు తన సొంతగడ్డపై 6569* పరుగులు చేశాడు. ఇంతకుముందు రికార్డు కుక్(6568) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. చంద్రపాల్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో రూట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు తన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 84 బంతుల్లో 6 ఫోర్లతో రూట్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇది రూట్ రెండో హాఫ్ సెంచరీ. అంతకుముందు తొలి టెస్టులో కూడా ఆర్ధశతకంతో జో మెరిశాడు.రూట్ అరుదైన ఘనత.. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఐదో క్రికెటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 147 మ్యాచ్‌ల్లో 97*సార్లు ఏభై పైగా రూట్ పరుగులు సాధించాడు.ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ క్రికెట్ దిగ్గజం శివనారాయణ చందర్‌పాల్ పేరిట ఉండేది. చందర్‌పాల్ తన కెరీర్లో 164 టెస్టుల్లో 96 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. అయితే తాజా మ్యాచ్‌తో చందర్‌పాల్‌ను రూట్ అధిగమించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(119 ఫిప్టీ ప్లస్ స్కోర్లు) ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా కల్లిస్(103), పాంటింగ్(103), ద్రవిడ్(99) ఉన్నారు. కాగా రూట్ కెరీర్లో 32 టెస్టు సెంచరీలు ఉన్నాయి.చదవండి: 'బాబర్, అఫ్రిది కాదు.. పాక్‌లో ఆ భారత క్రికెటర్‌కే ఫ్యాన్స్ ఎక్కువ' -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 29) ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక రెండు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన కుసాల్ మెండిస్, విశ్వ ఫెర్నాండో స్థానాల్లో పతుమ్ నిస్సంక, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో ఓలీ స్టోన్ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఈ ఒక్క మార్పు మాత్రమే చేసింది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 236 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 326 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జేమీ స్మిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తుది జట్లు..శ్రీలంక: దిముత్ కరుణరత్నే, నిషన్ మదుష్క, పతుమ్ నిస్సంక, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, మిలన్ రత్నాయకేఇంగ్లండ్: బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్ -
Eng vs SL: మూడేళ్ల తర్వాత.. తుదిజట్టులో తొలిసారి
శ్రీలంకతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఒక మార్పుతో లార్డ్స్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. పేసర్ మార్క్‌వుడ్ స్థానాన్ని ఓలీ స్టోన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా 2021లో చివరగా ఇంగ్లండ్ తరఫున టెస్టు ఆడిన ఓలీ స్టోన్.. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండటం విశేషం.లంకతో తొలి టెస్టులో మార్క్‌వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ ఫాస్ట్‌బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల పేసర్ జోష్ హల్‌ను అతడి స్థానంలో జట్టుకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ బోర్డు.. హల్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఓలీ స్టోన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన 30 ఏళ్ల ఓలీ స్టోన్.. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 3 టెస్టుల్లో 10, ఎనిమిది వన్డేల్లో 8 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క టీ20 ఆడినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పర్యాటక లంక నుంచి గట్టి పోటీ ఎదురుకాగా.. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(128 బంతుల్లో 62) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇరు జట్ల మధ్య లండన్‌లో లార్డ్స్ మైదానంలో ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అతడికి డిప్యూటీగా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంపిక చేసింది ఇంగ్లండ్ బోర్డు.శ్రీలంకతో లండన్ వేదికగా రెండో టెస్టు ఇంగ్లండ్ తుదిజట్టులారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్. -
మార్క్ వుడ్‌కు గాయం.. ఇంగ్లండ్ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్
శ్రీలంకతో తాజాగా ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం బారిన పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో వుడ్ మూడో రోజు నుంచి బౌలింగ్ చేయలేదు. వుడ్ స్థానంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు 20 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ జోష్ హల్‌ను ఎంపిక చేశాడు. హల్.. శ్రీలంకతో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టులో సభ్యుడిగా ఉంటాడు. Josh Hull - the 6'7 left arm pacer has been added to England's squad for Test series Sri Lanka. pic.twitter.com/FVdogR3toZ— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2024కౌంటీల్లో లీసెస్టర్‌షైర్‌కు ఆడే హల్కు భీకరమైన ఫాస్ట్ బౌలర్‌గా పేరుంది. 6 అడుగుల 7 అంగుళాలు ఉండే హల్కు అతని ఫైట్ చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇటీవల శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హల్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో రెండో టెస్ట్ ఆగస్ట్ 29 నుంచి మొదలవుతుంది. మూడో టెస్ట్ సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరుగనుంది.కాగా, ఓల్డ్ ట్రఫర్డ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ధనంజయం డిసిల్వ (74), మిలన్ రత్నాయకే (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. జేమీ స్మిత్ (111) సెంచరీతో కదంతొక్కడంతో 358 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. కమిందు మెండిస్ (113) సెంచరీతో రాణించడంతో 326 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. -
చరిత్ర సృష్టించిన మెండిస్.. తొలి శ్రీలంక క్రికెటర్‌గా
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో లంక పరాజయం పాలైనప్పటకి ఆ జట్టు ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా సంచలన సెంచరీతో మెండిస్ మెరిశాడు. అది కూడా ఏడో స్ధానంలో వచ్చి శతకం బాదడం గమనార్హం. శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 183 బంతులు ఎదుర్కొన మెండిస్.. 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 113 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన మెండిస్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.మెండిస్ సాధించిన రికార్డులు ఇవే..ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా కమిందు నిలిచాడు. ఇప్పటివరకు ఈ లంక బ్యాటర్ కూడా ఏడో స్ధానంలో వచ్చి సెంచరీ సాధించలేకపోయాడు. గతంలో 1984లో లార్డ్స్‌లో దులీప్ మెండిస్ చేసిన 94 పరుగులే అత్యధికం.ఇంగ్లండ్ గడ్డపై ఏడో లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఏడో ఆసియా బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత క్రికెటర్లు సందీప్ పాటిల్, రిషబ్ పంత్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, అజిత్ అగార్కర్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. -
జో రూట్ అరుదైన ఘనత.. ద్రవిడ్ రికార్డు బద్దలు! సచిన్‌కు చేరువలో
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు రాణించిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.128 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో అతడు 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంలో ఈ వెటరన్ తన వంతు పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఇంగ్లండ్ చిత్తుచేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి ఇంగ్లండ్ వెళ్లింది.జో రూట్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 144 టెస్టులు ఆడిన రూట్.. 64 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలాన్ బోర్డర్(63), భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(63)ల పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిద్దరని అధిగమించి మూడో స్ధానానికి రూట్ చేరుకున్నాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(68) అగ్రస్ధానంలో ఉండగా.. విండీస్ లెజెండ్ చంద్రపాల్(66) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రూట్ కెరీర్లో 32 టెస్టు సెంచరీలు ఉన్నాయి. -
తొలి టెస్టు.. శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 204/6తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక.. 326 పరుగులకు ఆలౌటైంది. కమిందు మెండిస్ (183 బంతుల్లో 113; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో రాణించి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 57.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (128 బంతుల్లో 62 నాటౌట్; 2 ఫోర్లు), జేమీ స్మిత్ (48 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్సర్), డాన్ లారెన్స్ (54 బంతుల్లో 34; 2 ఫోర్లు, ఒక సిక్సర్), హ్యారీ బ్రూక్ (68 బంతుల్లో 32; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. స్కోర్లుశ్రీలంక తొలి ఇన్నింగ్స్: 236/10ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్:358/10శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్:326/10ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్:205/5