మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో లంక పరాజయం పాలైనప్పటకి ఆ జట్టు ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా సంచలన సెంచరీతో మెండిస్ మెరిశాడు. అది కూడా ఏడో స్ధానంలో వచ్చి శతకం బాదడం గమనార్హం. శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 183 బంతులు ఎదుర్కొన మెండిస్.. 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 113 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన మెండిస్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
మెండిస్ సాధించిన రికార్డులు ఇవే..
ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా కమిందు నిలిచాడు. ఇప్పటివరకు ఈ లంక బ్యాటర్ కూడా ఏడో స్ధానంలో వచ్చి సెంచరీ సాధించలేకపోయాడు. గతంలో 1984లో లార్డ్స్‌లో దులీప్ మెండిస్ చేసిన 94 పరుగులే అత్యధికం.
ఇంగ్లండ్ గడ్డపై ఏడో లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఏడో ఆసియా బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత క్రికెటర్లు సందీప్ పాటిల్, రిషబ్ పంత్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, అజిత్ అగార్కర్, రవీంద్ర జడేజాలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment