శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిసాంక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగి.. వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 144 ఏళ్ల చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అదేమిటంటే...!!
లంక అనూహ్య విజయం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు గెలుపొంది సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే, నామమాత్రపు మూడో టెస్టులో శ్రీలంక అనూహ్య రీతిలో విజయం సాధించింది. లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.
వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని
తద్వారా వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. అయితే, ఇంగ్లండ్‌లో మూడో టెస్టులో శ్రీలంక గెలుపొందడంలో ఓపెనర్ పాతుమ్ నిసాంకదే కీలక పాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో 51 బంతుల్లో 64 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లోనే 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
1880 నుంచి ఇదే మొదటిసారి
అయితే, నిసాంక సెంచరీ మార్కు అందుకునే కంటే ముందే అత్యంత అరుదైన ఘనత ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న నిసాంక.. రెండో ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా 26 ఏళ్ల నిసాంక చరిత్రకెక్కాడు.
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వీరులు వీరే
కాగా 1880లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 559 మ్యాచ్‌లకు ఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా నిసాంక మాదిరి ఇలా రెండు ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన దాఖలాలు లేవు.
ఇదిలా ఉంటే.. టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా యాభై పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్ల జాబితాలో మాత్రం నిసాంక తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ముందున్నది ఎవరంటే..
👉మార్క్ గ్రేట్‌బచ్(న్యూజిలాండ్)- జింబాబ్వే మీద- 1992లో
👉నాథన్ ఆస్ట్లే(న్యూజిలాండ్)- వెస్టిండీస్ మీద- 1996లో
👉తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- న్యూజిలాండ్ మీద- 2009లో
👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- న్యూజిలాండ్ మీద- 2012లో
👉జెర్మానే బ్లాక్‌వుడ్(వెస్టిండీస్)- టీమిండియా మీద- 2916లో
👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- పాకిస్తాన్ మీద- 2017లో
👉జాక్ క్రాలే(ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద- 2022లో
👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- న్యూజిలాండ్ మీద- 2023లో
👉పాతుమ్ నిసాంక(శ్రీలంక)- ఇంగ్లండ్ మీద- 2024లో
Comments
Please login to add a commentAdd a comment