చరిత్ర సృష్టించిన స్మిత్‌.. 94 ఏళ్ల రికార్డు బద్దలు | Jamie Smith Creates History as Youngest English Wicketkeeper to Smash a Test Century | Sakshi
Sakshi News home page

ENG vs SL: చరిత్ర సృష్టించిన స్మిత్‌.. 94 ఏళ్ల రికార్డు బద్దలు

Published Fri, Aug 23 2024 9:48 PM | Last Updated on Sat, Aug 24 2024 1:27 PM

Jamie Smith Creates History as Youngest English Wicketkeeper to Smash a Test Century

మాంచెస్టర్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ యువ వికెట్ కీప‌ర్ జేమీ స్మిత్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో 148 బంతులు ఎదుర్కొన్న స్మిత్‌.. 8 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 111 ప‌రుగులు చేశాడు.

జీమీ స్మిత్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన స్మిత్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో సెంచరీ నమోదు చేసిన యంగెస్ట్‌ ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌గా స్మిత్‌ రికార్డులకెక్కాడు. 

ఈ ఘనతను స్మిత్ 24 సంవత్సరాల 42 రోజుల వయస్సులో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ వికెట్ కీపర్‌ లెస్ అమెస్ పేరిట ఉండేది. అమెస్  24 సంవత్సరాల 63 రోజుల వయస్సులో ఈ రికార్డును నమోదు చేశాడు. 1930లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెస్‌ ఈ ఫీట్‌ సాధించాడు. తాజా మ్యాచ్‌తో 94 ఏళ్ల  అమెస్ అల్‌టైమ్ రికార్డును స్మిత్‌ బ్రేక్ చేశాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement