
బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ ఖాతాలో మరో విజయం
సమయం 23: 14.. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 137 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇంగ్లండ్ 26 పరగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. లంక జట్టులో హసరంగ(34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు జోస్ బట్లర్ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. షనక(26) రనౌట్
సమయం 23:00.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు తడబడుతుంది. 17.2వ ఓవర్లో షనక(25 బంతుల్లో 26: 2 ఫోర్లు, సిక్స్) రనౌటయ్యాడు. దీంతో 130 పరుగుల వద్ద లంక జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో చమీరా, కరుణరత్నే ఉన్నారు.
బిల్లింగ్స్ అద్భుత క్యాచ్.. హసరంగ(34) ఔట్
సమయం 22:55.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సామ్ బిలింగ్స్ అద్భుత క్యాచ్‌లో భాగస్తుడుకావడంతో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. లివింగ్‌స్టోన్ వేసిన 16.5వ ఓవర్లో హసరంగ(21 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ బాట పట్టాడు.17 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 130/6. క్రీజ్‌లో షనక(26), కరుణరత్నే ఉన్నారు.
76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. రాజపక్స(26) ఔట్
సమయం 22:19.. ధాటిగా ఆడుతున్న రాజపక్స(18 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జేసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 77/5. క్రీజ్‌లో షనక(7), హసరంగ ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. ఫెర్నాండో(13) ఔట్
సమయం 22:04.. ఇన్నింగ్స్ 8.3వ ఓవర్లో శ్రీలంకకు మరో షాక్ తగిలింది. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో ఆవిష్క ఫెర్నాండో(13 బంతుల్లో 14; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 58/34. క్రీజ్‌లో రాజపక్స(15), షనక(1) ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుశాల్ పెరీరా(7) ఔట్
సమయం 21:48.. ఆదిల్ రషీద్ వేసిన ఇన్నింగ్స్ 5.1వ ఓవర్లో మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి కుశాల్ పెరీరా(9 బంతుల్లో 7) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 40/3. క్రీజ్‌లో అవిష్క ఫెర్నాండో(6), రాజపక్స ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అసలంక(21) ఔట్
సమయం 21:38.. ధాటిగా ఆడుతున్న అసలంక(16 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. 3.3 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 24/2. క్రీజ్‌లో కుశాల్ పెరీరా(2), అవిష్క ఫెర్నాండో ఉన్నారు.
టార్గెట్ 164.. మూడో బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంక
సమయం 21:27.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మోర్గాన్ అద్భుతమైన త్రో చేయడంతో పథుమ్ నిస్సంక(1) రనౌటయ్యాడు. దీంతో లంకేయులు 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయారు. తొలి ఓవర్ తర్వాత శ్రీలంక స్కోర్ 2/1. క్రీజ్‌లో కుశాల్ పెరీరా, అసలంక(1) ఉన్నారు.
బట్లర్ సెంచరీ.. ఇంగ్లండ్ 163/4; శ్రీలంక టార్గెట్ 164
సమయం: 21:18.. ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్(101, 67 బంతులు, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన బట్లర్ టి20ల్లో మెయిడెన్ సెంచరీ నమోదు చేశాడు. కాగా ఇంగ్లండ్ చేసిన 163 పరుగుల్లో 101 పరుగులు బట్లర్ నుంచి వచ్చినవే. మిగతావారిలో మోర్గాన్ 40 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ 3, దుశ్మంత చమీరా ఒక వికెట్ తీశారు.
మోర్గాన్(40) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
సమయం: 21:10.. బట్లర్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(40) హసరంగ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 19 ఓవర్లలో ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 87 పరుగులతో మెరుపులు మెరిపిస్తున్నాడు.
ఉతికి ఆరేస్తున్న బట్లర్.. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ 105/3
సమయం 20:48.. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన బట్లర్ మధ్య ఓవర్లలో జూలు విదిల్చాడు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ.. టోర్నీలో మరో అర్ధశతకం నమోదు చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ 15 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజ్‌లో బట్లర్(49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్(26 బంతుల్లో 22; ఫోర్, సిక్స్) ఉన్నారు.
ఇంగ్లండ్ భరతం పడుతున్న హసరంగ.. మూడో వికెట్ డౌన్
సమయం 20:00.. లంక స్పిన్నర్ హసరంగ ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పడుతున్నాడు. రెండో ఓవర్లోనే జేసన్ రాయ్‌ను పెవిలియన్‌కు పంపిన అతను.. 5వ ఓవర్ రెండో బంతికి బెయిర్‌స్టో(0)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 35 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో జోస్ బట్లర్(17 బంతుల్లో 18), మోర్గాన్ ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
సమయం 19:55.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్ డేవిడ్ మలాన్(8 బంతుల్లో 6; ఫోర్) చమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో జోస్ బట్లర్(16 బంతుల్లో 17), బెయిర్‌స్టో ఉన్నారు.
రెండో ఓవర్‌లోనే ఇంగ్లండ్‌కు షాక్
సమయం 19:35.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. లంక సూపర్ స్పిన్నర్ హసరంగ బౌలింగ్‌లో జేసన్ రాయ్(6 బంతుల్లో 9; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 15/1. క్రీజ్‌లో జోస్ బట్లర్(4 బంతుల్లో 5), డేవిడ్ మలాన్(2 బంతుల్లో 1) ఉన్నారు.
షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా సోమవారం(నవంబర్ 1) రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేసుకోగా.. శ్రీలంక 3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు, ఓ విజయం సాధించి సెమీస్ చేరేందుకు పోరాటం సాగిస్తోంది.
ఇక పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఓవరాల్‌గా ఇరు జట్లు 12 సందర్భాల్లో తలపడగా.. ఇంగ్లండ్ 8, శ్రీలంక 4 సార్లు విజయాలు సాధించాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో సైతం ఇంగ్లండ్(3-1)దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్(5-0) తిరుగులేని ఆధిక్యం కనబర్చింది.
ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) ఇంగ్లండ్ కంటే శ్రీలంకకే మెరుగైన రికార్డు ఉంది. పొట్టి ప్రపంచకప్‌లో లంకేయులు ఓసారి ఛాంపియన్‌గా(2014), మరో రెండుసార్లు(2009, 2012) రన్నరప్‌గా నిలిచారు. మరోవైపు ఇంగ్లండ్ ఓ సారి ఛాంపియన్‌గా(2010) అవతరించి.. మరోసారి రన్నరప్‌గా(2016) నిలిచింది.
తుది జట్లు:
ఇంగ్లండ్ : జేసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, తైమల్ మిల్స్
శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్‌కీపర్), పథుమ్ నిస్సంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లహీరు కుమార
Comments
Please login to add a commentAdd a comment