టీమిండియా ఆశలు ఆవిరి.. అఫ్గాన్‌పై కివీస్ ఘన విజయం
సమయం 18:36.. అఫ్గాన్లు నిర్ధేశించిన 125 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(42 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు), డెవాన్ కాన్వే(32 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు) కివీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో అఫ్గాన్లను మట్టికరిపించి దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లింది. అఫ్గాన్ బౌలర్లు ముజీబ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్(3/17), టిమ్ సౌథీ(2/24), సోధి(1/13), మిల్నే(1/17), నీషమ్(1/24) అప్గాన్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. నజీబుల్లా జద్రాన్(48 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించకపోయుంటే అఫ్గాన్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. 3 వికెట్లతో సత్తా చాటిన ట్రెంట్ బౌల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
టార్గెట్ 125.. 57 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
సమయం 17:49.. 57 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్టిన్ గప్తిల్(23 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8.5 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 57/2. క్రీజ్లో విలియమ్సన్(11), కాన్వే ఉన్నారు.
టార్గెట్ 125.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
సమయం 17:28.. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముజీబ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అహ్మద్ షెజాద్‌కు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్(12 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 30/1. క్రీజ్‌లో గప్తిల్(11), విలియమ్సన్(2) ఉన్నారు.
దారుణంగా నిరాశపర్చిన అఫ్గానిస్థాన్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితం
సమయం 17:05.. కీలకమైన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ దారుణంగా నిరాశపర్చింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్(3/17), టిమ్ సౌథీ(2/24), సోధి(1/13), మిల్నే(1/17), నీషమ్(1/24) అప్గాన్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. నజీబుల్లా జద్రాన్(48 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించకపోయుంటే అఫ్గాన్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది.
నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గాన్.. గుల్బదిన్(15) ఔట్
ఇష్ సోధి వేసిన 10వ ఓవర్ ఆఖరి బంతికి గుల్బదిన్(18 బంతుల్లో 15; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా అఫ్గానిస్థాన్ 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో జద్రాన్(27), మహ్మద్ నబీ ఉన్నారు.
19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్
సమయం 15:55.. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా అఫ్గాన్ మూడో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్భాజ్(9 బంతుల్లో 6; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 6 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 23/3. క్రీజ్‌లో గుల్బదిన్ నయీబ్(5), జద్రాన్(4) ఉన్నారు.
కష్టాల్లో అఫ్గాన్.. 12 పరుగులకే ఓపెనర్లు ఔట్
సమయం 15:46.. తొలి వికెట్ కోల్పోయిన మరుసటి ఓవర్‌లోనే అఫ్గాన్‌కు మరో షాక్ తగిలింది. నాలుగో ఓవర్ తొలి బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి హజ్రతుల్లా జజాయ్(4 బంతుల్లో 2) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 16/2. క్రీజ్‌లో రహ్మానుల్లా గుర్భాజ్(4), గుల్బదిన్ నయీబ్(4) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన అఫ్గాన్.. షెజాద్(4) ఔట్
సమయం 15:41.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అహ్మద్ షెజాద్(11 బంతుల్లో 4, ఫోర్) అనవసర ప్రయోగం చేసి ఔటయ్యాడు. మిల్నే బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డెవాన్ కాన్వే అద్భుతమైన క్యాచ్ పట్టడంతో షెజాద్ పెవిలియన్ బాట పట్టాడు. 2.2 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 8/1. క్రీజ్‌లో హజ్రతుల్లా జజాయ్(2), రహ్మానుల్లా గుర్భాజ్ ఉన్నారు.
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా ఆదివారం(నవంబర్ 7) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత మెగా టోర్నీలో గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరబోయే రెండో బెర్తు ఈ మ్యాచ్‌తో తేలనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పాక్ ఇదివరకే ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరుకోగా.. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, అఫ్గాన్, భారత జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్ చేరుకోనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం సాధిస్తే.. నెట్ రన్‌రేట్ ఆధారంగా ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్తు ఖరారు కానుంది.
తుది జట్లు:
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్
అఫ్గానిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షెజాద్(వికెట్ కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుల్బదిన్ నయీబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్
Comments
Please login to add a commentAdd a comment