చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు (వికెట్ కోల్పోయి) చేరింది.
టార్గెట్ 57.. 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
57 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఫజల్ హక్ బౌలింగ్‌లో డికాక్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
11.5 ఓవర్లలో 56 పరుగులకు అప్ఘనిస్తాన్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 57 పరుగులు
50 పరుగులకే తొమ్మిది వికెట్లు డౌన్
ఆఫ్ఘనిస్తాన్ ఒకే స్కోర్ వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో రషీద్ ఖాన్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఘోర పతనం దిశగా సాగుతుంది. షంషి బౌలింగ్‌లో నూర్ అహ్మద్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 50/8గా ఉంది. రషీద్ ఖాన్ (8), నవీన్ ఉల్ హక్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
50 పరుగుల వద్ద ఏడో వికెట్ డౌన్
50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. తబ్రేజ్ షంషి బౌలింగ్‌లో కరీమ్ జనత్ (8) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
28 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ 28 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఒమర్‌జాయ్ (10) ఔటయ్యాడు. కరీమ్ జనత్ (4), రషీద్ ఖాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 45/6గా ఉంది
ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు టాస్ గెలిచిమాన్న సంతోషం ఎంతో సేపు నిలబడలేదు. సఫారీ పేసర్లు రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్లు 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), మొహమ్మద్ నబీ (0), ఖరోటే (2) దారుణంగా విఫలమయ్యారు. జన్సెన్ (3-0-16-3) ఆఫ్ఘన్లను దెబ్బకొట్టాడు. రబాడ (2-1-5-2) మరో చేయి వేశాడు.
తుది జట్లు..
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫారూఖీ
Comments
Please login to add a commentAdd a comment