ఐదేసిన జంపా.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం
సమయం 17:44.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్(20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(10 బంతుల్లో 16; 3ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. చివర్లో మిచెల్ మార్ష్(5 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ఐదేయడంతో బంగ్లా జట్టు కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. జంపాకు హేజిల్‌వుడ్(2/8), మిచెల్ స్టార్క్(2/21), మ్యాక్స్‌వెల్(1/6) తోడవ్వడంతో కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొసేన్(19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఫించ్(40) ఔట్
సమయం 17:33.. 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(10 బంతుల్లో 16; 3ఫోర్లు), ఆరోన్ ఫించ్(20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. అయితే 5వ ఓవర్ ఆఖరి బంతికి తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఫించ్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆసీస్ 58 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
ఐదేసిన జంపా.. 73 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
సమయం 16:48.. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ఐదేయడంతో బంగ్లా జట్టు కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. జంపాకు హేజిల్‌వుడ్(2/8), మిచెల్ స్టార్క్(2/21), మ్యాక్స్‌వెల్(1/6) తోడవ్వడంతో కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొసేన్(19)దే అత్యధిక స్కోర్ కాగా, మరో ఇద్దరు(నయీమ్(17), మహ్మదుల్లా(16)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. మహ్మదుల్లా(16) ఔట్
సమయం 16:35.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చివరి దశకు చేరింది. కెప్టెన్ మహ్మదుల్లా(18 బంతుల్లో 16; 2 ఫోరు) స్టార్క్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 13 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 65/8. క్రీజ్‌లో తస్కిన్ అహ్మద్(2), ముస్తాఫిజుర్ ఉన్నారు.
62 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
సమయం 16:31.. ఆసీస్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. జంపా వేసిన 11వ ఓవర్లో ఇద్దరు బంగ్లా ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరారు. ఐదో బంతికి షమీమ్ హొసేన్(18 బంతుల్లో 19; ఫోర్, సిక్స్), ఆరో బంతికి మెహిది హసన్(0) ఔటయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 62 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్ ఉన్నారు.
33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
సమయం 16:05.. బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ నాలుగు, ఐదు ఓవర్లు మినహా అన్నీ ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. జంపా తన స్పెల్ తొలి బంతికే అఫీఫ్ హెసేన్(0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆ జట్టు కేవలం 33 పరుగులు మాత్రమే స్కోర్ చేసి సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా, షమీమ్ హొసేన్ ఉన్నారు.
నయీమ్(17) ఔట్..బంగ్లాదేశ్ 32/4
సమయం 15:59.. మొదటి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. నాలుగో ఓవర్, ఐదో ఓవర్ గ్యాప్ ఇచ్చి ఆరో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ నయీమ్(16 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఔటయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా(8), అఫీఫ్ హొసేన్ ఉన్నారు.
3 ఓవర్లు 3 వికెట్లు..బంగ్లాదేశ్ స్కోర్ 10/3
సమయం 15:46.. ఆసీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బెంబేలెత్తిపోతుంది. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. తొలి ఓవర్‌లో లిటన్ దాస్ వికెట్ కోల్పోయిన బంగ్లా.. రెండో ఓవర్‌లో సౌమ్య సర్కార్.. మూడో ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్(2 బంతుల్లో 1) వికెట్ నష్టపోయింది. ముష్ఫికర్‌ను మ్యాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి 3 కీలక వికెట్లు కోల్పోయింది.
6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
సమయం 15:42.. తొలి ఓవర్‌లో లిటన్ దాస్ వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. రెండో ఓవర్‌లో సౌమ్య సర్కార్(8 బంతుల్లో 5: ఫోర్) వికెట్‌ను చేజార్చుకుంది. రెండో ఓవర్ ఆఖరి బంతికి జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్.. 6 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీమ్ ఉన్నారు.
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
సమయం 15:33.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో బంతికి స్టార్క్ బౌలింగ్‌లో లిటన్ దాస్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(1), సౌమ్య సర్కార్ ఉన్నారు.
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా గురువారం(నవంబర్ 4) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ సూపర్-12లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది.
ఇక పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. మొత్తం 9 మ్యాచ్‌ల్లో.. ఆసీస్ 5, బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. అయితే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్.. ఆసీస్‌తో తలపడిన ప్రతిసారి పరాజయం పాలైంది. 4 మ్యాచ్‌ల్లో నాలుగింటిలోనూ ఓటమిని ఎదుర్కొంది.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, షమీమ్ హెసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment