
Eoin Morgan Becomes The Most Successful T20I Captain Of All Time: అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్‌గా (43 విజయాలు) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శ్రీలంకపై గెలుపుతో మోర్గాన్ ఈ ఘనత సాధించాడు. మోర్గాన్‌కు ముందు ఈ రికార్డు(42 విజయాలు) అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎంఎస్ ధోని (భారత్)ల పేరిట సంయుక్తంగా ఉండేది. శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపుతో మోర్గాన్ వారి రికార్డును బద్దలు కొట్టాడు.
మోర్గాన్ ఈ ఘనతను సాధించేందుక 69 మ్యాచ్‌లు తీసుకోగా.. ధోని 72, అస్గర్ అఫ్గాన్ 52 మ్యాచ్‌ల్లో సాధించారు. ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న మోర్గాన్.. ఇంగ్లండ్ జట్టును 2019 వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్‌ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.
చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా?
Comments
Please login to add a commentAdd a comment