లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 29) ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక రెండు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన కుసాల్ మెండిస్, విశ్వ ఫెర్నాండో స్థానాల్లో పతుమ్ నిస్సంక, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు.
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో ఓలీ స్టోన్ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఈ ఒక్క మార్పు మాత్రమే చేసింది.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 236 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 326 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జేమీ స్మిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
తుది జట్లు..
శ్రీలంక: దిముత్ కరుణరత్నే, నిషన్ మదుష్క, పతుమ్ నిస్సంక, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, మిలన్ రత్నాయకే
ఇంగ్లండ్: బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్
Comments
Please login to add a commentAdd a comment