కెన్నింగ్‌స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ధనంజయ డిసిల్వ 69, కమిందు మెండిస్ 64 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన మిలన్‌రత్నాయకే 7, విశ్వ ఫెర్నాండో 0, అశిత ఫెర్నాండో 11 పరుగులు చేశారు.
లంక ఇన్నింగ్స్‌లో ఓవరల్‌గా ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. రెండో రోజు ఆటలో పథుమ్ నిస్సంక 64 పరుగులు చేశాడు. వీరు మినహా కుసల్ మెండిస్ (14), అశిత ఫెర్నాండో మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ జోష్ హల్, ఓల్లీ స్టోన్ తలో 3, క్రిస్ వోక్స్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 62 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (13), హ్యారీ బ్రూక్ (19), జేమీ స్మిత్ (16), ఓల్లీ స్టోన్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లంక ఇన్నింగ్స్‌లో మిలన్ రత్నాయకే 3, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment