ఆగస్ట్ 21 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (ఆగస్ట్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వ సారథ్యం వహించనుండగా.. కుసల్ మెండిస్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డేలో ఆరు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన జెఫ్రీ వాండర్సే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
నిసాల తారక, మిలన్ రత్నాయకే కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి ఘనమైన దేశవాలీ ట్రాక్ రికార్డు ఉంది. తారక 107 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 257 వికెట్లు.. రత్నాయకే 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. తారక, రత్నాయకే.. లహీరు కుమార, విశ్వ ఫెర్నాండో, అషిత ఫెర్నాండో, కసున్ రజితలతో కలిసి పేస్ విభాగంలో ఉంటారు.
స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో వాండర్సేతో పాటు ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ ఉన్నారు. దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్‌లతో లంక బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
ఇంగ్లండ్ టెస్టులకు శ్రీలంక జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, పాతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, అసిత ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లహిరు కుమార, నిసాల తారక, ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయకే
ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్..
తొలి టెస్ట్- ఆగస్ట్ 21-25 (ఓల్డ్ ట్రాఫోర్డ్)
రెండో టెస్ట్- ఆగస్ట్ 29-సెప్టెంబర్ 2 (లార్డ్స్)
మూడో టెస్ట్- సెప్టెంబర్ 6-10 (కెన్నింగ్‌స్టన్ ఓవల్)
Comments
Please login to add a commentAdd a comment